కొన్ని కొన్ని అంశాలను లెక్కలు.. కూడికలు, తీసివేతలతో చెబితే తప్ప.. ఎవరికీ అర్థం కాదు. ఇదే విషయాన్ని వైసీపీ అధినేత జగన్‌కు కూడా.. సీమకు చెందిన ఓ సీనియర్ నాయకుడు, ఫైర్ బ్రాండ్ మాజీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ‘రఫ్‌గా కొన్ని లెక్కలు’ పేరుతో జగన్‌కు ఆయన మైనస్‌లు, ప్లస్‌లు వివరించే ప్రయత్నం చేశారు. వీటిని జగన్ అమలు చేస్తారా? తనను తాను పరిశీలించుకుని సరిదిద్దుకుంటారా? అనేది చూడాలి. ఏదేమైనా.. ప్రస్తుతం సదరు మాజీ ఎమ్మెల్యే చేసిన సూచనలు మాత్రం పార్టీ వరకు చేరాయి.
మాజీ ఎమ్మెల్యే సూచించిన విషయాలను పరిశీలిస్తే.. రఫ్‌గా అంటూనే బలమైన కారణాలు చెప్పుకొచ్చారు. ఈ విషయాలపై జగన్ రియలైజ్ అయితే.. బాగానే ఉంటుంది. అయితే.. ఆయన ఆదిశగా ఆలోచన చేస్తారా? అన్నది మాత్రం ప్రశ్నగానే మారింది. ఇంతకీ ఈ సీనియర్ నాయకుడు ఏం చెప్పారంటే.. ప్రస్తుతం మనకు.. నిరసనలు చేసే అవకాశం లేదు. ఇంకా సమయం ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. చంద్రబాబు నిరసనలు చేస్తే.. మనం యాగీ చేశాం కదా! అని తొలి సూచన చేశారు.
ఇది కొంత కటువుగానే ఉంది. కానీ, వాస్తవం. ఇక, కార్యకర్తలను, నాయకులను రోడ్డు మీదకు పంపించి.. మీరు మాత్రం బెంగళూరులో విశ్రాంతి తీసుకోవడం సరిగా లేదు. దీనిపై సొంత పార్టీలోనే చర్చ సాగుతోం ది. దీనిని మార్చుకుని మీరు కూడా ప్రజల్లోకి వస్తే బాగుంటుంది. దీనికి ముహూర్తాలు పెట్టుకోవడం కూడా సరిగాలేదు. అని రెండో సూచన చేశారు. పార్టీలో నిద్రాణంగా ఉన్న అలసత్వాన్ని తరిమి కొట్టేందుకు మీరు నడుం బిగించాలి. లేకపోతే.. పార్టీ నుంచి వెళ్లిపోయే వారే ఎక్కువగా ఉన్నారు. అని మూడో సూచన చేశారు.
వీటితోపాటు.. అసలు మన స్టాండ్ ఏంటి? ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడమా? లేక.. ప్రజలకు చేరువ కావడమా? అనే విషయంలో క్లారిటీ కావాలని సదరు నాయకులు నిలదీశారు. ఈ విషయాలు చాలా లైట్‌గా ఉన్నాయని అనుకున్నా.. ఇవే విషయాలు పార్టీలోనూ చర్చకు వస్తున్నాయి. పార్టీ అధినేతగా జగన్ తీసుకునే స్టాండు కోసం.. కార్యకర్తలు, నాయకులు కూడా వేచి చూస్తున్నారు. కానీ, ఈ విషయంలో ఆయనకు క్లారిటీలేదు. మరి రఫ్‌గా పంపించిన ఈ సూచనలనైనా జగన్ పాటిస్తారో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates