తెలంగాణలో ఎన్నికల రాజకీయం హీటెక్కిన సంగతి తెలిసిందే. ఓవైపు సంక్షేమ-అభివృద్ధి పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనధికార ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో అలర్టయిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించి, అనంతరం తుక్కుగూడలో విజయ భేరి పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆరు హామీలను ప్రకటించింది. 6 గ్యారెంటీలు, డిక్లరేషన్లతో తెలంగాణలో విజయం సాధిస్తామని కాంగ్రెస్ నేతల్లో ధీమా వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో …
Read More »ఏపీకి అన్యాయం జరిగింది.. తెలంగాణలో రక్తం పారింది: మోడీ
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తొలిరోజు.. లోక్‌సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. సుమారు 42 నిమిషాల పాటు ఆయన 75 ఏళ్ల పార్లమెంటు ప్రస్థానంపై చర్చను ప్రారంభించి ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన కీలకమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కూడా ఈ పార్లమెంటు భవనంలోనే జరిగిందన్న ప్రధాని.. అయితే, శాస్త్రీయంగా ఈ విభజన జరగలేదని విమర్శలు గుప్పించారు. “తెలంగాణ …
Read More »చారిత్రక నిర్ణయాలు తప్పవు: మోడీ
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలే ఉంటాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని ఈ రోజు ఉదయం పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. జీ-20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ భవిష్యత్తుకు భారత్ ఆశాకిరణంగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. పార్లమెంటు …
Read More »జగన్‌కు చంద్రబాబుకు సాపత్యమా ధర్మాన సార్?!
ఏపీ అధికార పార్టీ వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. చంద్రబాబు అరెస్టు, జైలులో పెట్టడం పట్ల ఆసేతు హిమాచలం ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మహిళలు, వృద్ధులు కూడా రోడ్లమీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు, ఎన్నారైలు.. రిలే నిరాహార దీక్షలు చేస్తూ..చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ విషయంపై మౌనంగా ఉండాల్సిన మంత్రి ధర్మాన.. …
Read More »అందరి చూపూ బ్రాహ్మణి పైనే
అనుకోని అతిథులు కామనే. మన జీవితాల్లోనూ ఎంతో మంది అనుకోకుండా తటస్థ పడడం, వారితో మనకు సాన్నిహిత్యం ఏర్పడడం తెలిసిందే. అయితే, రాజకీయాల్లోనూ ఇలాంటి సందర్భాలు ఉంటాయా? ఇలా కూడా జరుగుతుందా? అంటే.. జరుగుతుందనే అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఏపీ టీడీపీకి అనుకోని అతిథి పరిచయం అయ్యారు. ఇలా అనుకోని అతిథి వస్తారని కానీ, పార్టీకి కీలకంగా మారతారని కానీ.. ఎవరూ ఊహించలేదు. కానీ, ఇప్పుడు అందరి చూపూ అనుకోని …
Read More »వారెంటీలు లేని గ్యారెంటీ హామీలు
విపక్షాలను టార్గెట్ చేసే విషయంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావుది సపరేట్ స్టైల్. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలపై ఆసక్తికరంగా స్పందించారు. అలవికాని హామీలు, అబద్ధాల ఆరోపణలు, చరిత్ర వక్రీకరణలు.. కాంగ్రెస్ సభ సాంతం ఆత్మవంచన, పరనిందగా సాగిందని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలు దేవుడెరుగు, అసలు కాంగ్రెస్ కు ఓట్లు పడతాయనే గ్యారంటే లేదు అంటూ ఎద్దేవా చేశారు. గాలికి …
Read More »టీడీపీ ఇంతే సిన్సియర్‌గా మాట్లాడితే..
రెండు చేతులు కలిస్తేనే చప్పట్ల శబ్దం వస్తుంది. రాజకీయ పార్టీల పొత్తు వ్యవహారం కూడా అంతే. ఇరు వర్గాలూ బేషజాలు లేకుండా కలిసి పని చేయాలి. పరస్పరం గౌరవించుకోవాలి. ఒకరినొకరు నమ్మాలి. అవసరమైనపుడు అవతలి పార్టీని నిజాయితీగా పొగడాలి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. నూటికి నూరు శాతం ఇలాగే చేస్తున్నట్లు కనిపిస్తోంది. పొత్తు ప్రకటించిన సమయంలోనే చంద్రబాబు …
Read More »పొత్తులు ఓకే.. సంతకాల మాటేంటి? ఇదికదా అసలు ప్రశ్న
టీడీపీ-జనసేన పొత్తులకు రెడీ అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కూడా కలిసి పనిచేస్తే.. గెలు పు తథ్యమనే ధీమాతోనూ ఉన్నాయి. ఇక, ఈ రెండు పార్టీల సంగతి ఇలా ఉంటే.. రాజకీయంగా కొన్ని సమస్యలు ఈ పొత్తులపై ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. ఉదాహరణ కు ఓ రెండు మాసాల కిందటి వరకు కూడా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోరుకు సిద్ధమని ప్రకటిస్తూనే …
Read More »చంద్రబాబుతో ములాఖత్.. రజినీ ఏమన్నాడంటే?
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ఈ విషయంలో బాబుకు దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీల నేతలు బాసటగా నిలిచారు. అలాగే సామాన్య జనం కూడా తెలుగు రాష్ట్రాల్లోనే దేశ విదేశాల్లో బాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలు జరుగుతుండటం విశేషం. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున జనం స్వచ్ఛందంగా పాల్గొంటుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీడీపీ వాళ్లు కూడా ఈ స్పందన చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉండగా.. …
Read More »స్కిల్ డెవలప్మెంట్లో.. సీమెన్స్ మాజీ ఎండీ షాకింగ్ ప్రెస్ మీట్
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న స్కిల్ డెవలప్మెంటు కేసు విషయంలో సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ స్పందించారు. స్కిల్ డెవలప్మెంట్లో 341 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేసి, రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచిన విషయం తెలిసిందే. దీనిపై సుమన్ బోస్ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్ మెంట్ కేసు నీరదారమైనదని వ్యాఖ్యానించారు. బిల్డ్ …
Read More »మేము మాత్రం జనసేన తో పొత్తులోనే వున్నాం
టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగిందంటూ అరెస్టు చేయడం వెనుక బీజేపీ ఉందని, కేంద్ర పెద్దల సూచనలతోనే ఇది జరిగిందని కొందరు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆదివారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని బీజేపీనే తొలుత తప్పు పట్టిందని తెలిపారు. మాజీ సీఎం, 70 ఏళ్ల నాయకుడిని అరెస్టు చేసిన …
Read More »వైసీపీకి 100 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా కష్టమే: డీఎల్
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, జైలుపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వైఖరిని కూడా ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు సంబంధించిన 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో తనకు ఎక్కడా తప్పు చేసినట్లు కనిపించలేదన్నారు. న్యాయ చరిత్రలోనే ఇటువంటి ఆర్డర్ ఇచ్చిన జడ్జి ఎక్కడా లేరని ఆయన వ్యాఖ్యానించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా రిమాండ్ విధించారని …
Read More »