2024: జ‌న‌సేన చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన సంవ‌త్స‌రం!

జ‌న‌సేన పార్టీ 2014లో ఆవిర్భ‌వించినా.. ఆ త‌ర్వాత జ‌రిగిన రెండు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి పెద్ద‌గా ప్రాధాన్యం లేకుండా పోయింది. అస‌లు 2014లో పార్టీ పోటీలోనే లేకుండా పోయింది. 2019లో రాష్ట్ర వ్యాప్తం గా పోటీ చేసినా.. ఆ పార్టీకిఒక్క‌రే గెలిచారు. ఆయ‌న కూడా పొరుగు పార్టీలోకి జంప్ చేశారు. ఆ త‌ర్వాత‌.. సుదీర్ఘ నిరీక్ష‌ణ అనంత‌రం వ‌చ్చిన 2024 ఎన్నిక‌లు మాత్రం జ‌న‌సేన చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసింద‌నే చెప్పాలి. క‌నీ వినీ ఎరుగ‌ని విజ‌యాన్ని అందించింది. 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్ద‌రు ఎంపీలు పోటీ చేయ‌గా.. అంద‌రూ విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఇది.. జ‌న‌సేన పార్టీకి ఒక అనిర్వ‌చ‌నీయ‌మైన చ‌రిత్ర‌ను సొంతం చేసింది. ఇక‌, అక్క‌డితో కూడా.. 2024 ఆగ‌లేదు. కేంద్రంలో బ‌ల‌మైన మిత్ర‌ప‌క్షంగా.. బ‌ల‌మైన నాయ‌కుడిగా కూడా.. జ‌న‌సేన‌ను, ఆ పార్టీ అధి నేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఈ సంవ‌త్స‌ర‌మే నిల‌బెట్టింది. కేంద్రంలోని పెద్ద‌ల‌తో మ‌రింత బంధం పెరిగింది. మ‌హా రాష్ట్ర ఎన్నిక‌ల్లో ఆయ‌న చేసిన ప్ర‌చారం క‌లిసి వ‌చ్చి.. కేంద్రంపెద్ద‌ల వ‌ద్ద మంచి మార్కులు వేయించుకు న్నారు. ఇక‌, తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారంలో స్పందించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ దీక్ష చేప‌ట్టి.. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

ఈ దీక్ష ద్వారా.. ప‌క్కాగా ఆయ‌న హిందూ స‌మాజానికి ప్ర‌తినిధిగా మారార‌నే చెప్పాలి. ఇక‌, ఉప ముఖ్య మంత్రిగా పాల‌న‌లో ప‌గ్గాలు చేప‌ట్టిన ప‌వ‌న్‌.. ఆది నుంచి కూడా త‌న దైన భిన్న వైఖ‌రిని అవ‌లంభించా రు. ర‌హ‌దారుల బాగు చేత ఉద్య‌మానికి ప‌ల్లె పండుగ‌ పేరుతో చేప‌ట్టిన కార్య‌క్ర‌మం వ‌డివ‌డిగా సాగుతోంది. ఇక‌, కేంద్రం నుంచి త‌న మంత్రి త్వ శాఖ‌ల‌కు నిధులు రాబ‌ట్టుకునే విష‌యంలో త‌నే జోక్యం చేసుకుని కేంద్రం వ‌ద్ద‌కు వెళ్లి.. నిధులు వ‌చ్చేలా చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కీల‌క‌మైన ఉపాధి హామీ చ‌ట్టాన్ని బ‌లోపేతం చేయ‌డంలోనూ ఈ సంవ‌త్స‌రం ప‌వ‌న్‌కే క్రెడిట్ ద‌క్కుతుంది.

అన్నింటిక‌న్నా ముఖ్యంగా ఏ విష‌యంలో స్పందించాలో.. ఏ విష‌యంలో మౌనంగా ఉండాలో .. రాజ‌కీ యంగా ప‌వ‌న్‌కు ఈ సంవ‌త్స‌రం క‌లిసి వ‌చ్చింది. కీల‌క‌మైన విష‌యాల్లో స‌ర్కారు ఇరుకున ప‌డుతోంద‌ని తెలిసినప్పుడుత‌న‌దైన భిన్న ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించి.. స‌ర్కారును బ‌య‌ట‌కు ప‌డేశారు. అదేస‌మ‌యంలో త‌న పార్టీ ఎమ్మెల్యేల‌పైనా ప‌ట్టు ద‌క్కించుకున్నారు. ఎవ‌రూ దారి త‌ప్ప‌కుండా చేయ‌డంలోనూ ప‌వ‌న్ క‌ల్యాణ్ జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ముఖ్యంగా చంద్ర‌బాబు, టీడీపీతో త‌న చెలిమి సుదీర్ఘ‌కాలం ఉంటుంద న్న సంకేతాల‌ను క్షేత్ర‌స్థాయిలోకి పంపించ‌డం ద్వారా.. కూట‌మిపై వ‌స్తున్న లుక‌లుక‌ల‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

త‌ను న‌మ్మిన వారికి.. త‌న‌నున‌మ్మిన వారికి కూడా.. ఎమ్మెల్సీ స‌హా నామినేటెడ్ ప‌ద‌వులు ఇప్పించుకోవ‌డంలోనూ ఈ ఏడాది ప‌వ‌న్ మార్క్ స్ప‌ష్టం గా క‌నిపించింది. రాజ్య‌స‌భ సీటు విష‌యంలో కేంద్రం పేచీ పెట్టినా.. వివాదానికి తావివ్వ‌కుండా.. మ‌రో రూట్‌లో త‌న అన్న నాగ‌బాబుకు ప్ర‌మోష‌న్ ఇప్పించ‌డంలోనూ స‌క్సెస్ అయ్యారు. మొత్తంగా 2024లో ప‌వ‌న్‌లో అన్ని షేడ్స్‌ను రాజ‌కీయం చూసింద‌నే చెప్పాలి.