టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం మొత్తం ఎప్పుడూ రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితి లేదు. ఆయన కుమారుడు, ఆయన కోడలు బ్రాహ్మణి మాత్రమే ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన పరిస్థితి ఉండేది. మహా అయితే.. ఎన్నికల సమయంలో ఆయన సతీమణి భువనేశ్వరి కుప్పంలో ఒకటి రెండు రోజులు పర్యటించిన పరిస్థితి ఉంది. కానీ.. రాజకీయాల్లో తొలిసారి 2024లో నారా కుటుంబం యావత్తు తొలి ఐదు మాసాలు.. రోడ్డెక్కిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది. 2024 జనవరి నుంచి మేలో ఎన్నికలు ముగిసే వరకు నారా కుటుంబం ఇంటి బాటపట్టింది కేవలం కొద్ది రోజులు మాత్రమే.
నేరుగా ఎన్నికల ప్రచారం చేయని నారా భువనేశ్వరి.. చంద్రబాబును జైల్లో పెట్టిన సమయంలో ఆవేదన చెంది.. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను కలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆమె జనవరి నుంచే ప్రారంభించారు. ఎన్నికలు అయ్యే వరకు కూడా దీనిని కొనసాగించారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ ఆమె కార్యకర్తల కుటుంబాలకు వెళ్లారు. వారిని ఓదార్చారు. వైసీపీ సర్కారుపై మహిళల్లో చైతన్యం రగిలించి సమర శంఖం పూరించారు. తనదైన శైలిలో ఆమె వైసీపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. తర్వాత కుప్పంలోనే రోజుల తరబడి ఉన్నారు.
అదేవిధంగా నారా వారి కోడలు.. బ్రాహ్మణి కూడా.. రెండు మాసాల పాటు మంగళగిరిలోనే తిష్ఠవేశారు. గతంలో 2019 ఎన్నికల సమయంలో కేవలం పదిరోజులు మాత్రమే నియోజకవర్గంలో ఉన్న ఆమె.. ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో తొలిసారి రెండు మాసాల పాటు ఇక్కడే ఉండి.. అన్ని వర్గాలను కలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి.. బొట్టు పెట్టి మరీ తన భర్తనుగెలిపించాలని కోరుకున్నారు. చేనేత కార్మికుల కుటుంబాలను కూడా ఆమె కలుసుకున్నారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. రాజధాని రైతుల ను కలుసుకున్నారు. ఇలా.. రెండు మాసాల పాటు క్యాంపెయిన్ నిర్విరామంగా సాగించారు.
వీరికంటే ముఖ్యంగా.. ఎన్నడూలేని విధంగా చివరకు అన్నగారు జీవించి ఉన్న రోజుల్లో కూడా.. రోడ్డెక్కని నందమూరి ఆడపడుచులు, మనవళ్లు..మనవరాళ్లు సైతం ఈ ఏడాది రోడ్డెక్కారు. నందమూరి వారసులు అందరూ రోజుల తరబడి మంగళగిరిలో మండు టెండలో నారా లోకేష్ విజయం కొసం శ్రమించారు. నియోజకవర్గంలోని ప్రతి గడపకూ.. వెళ్లారు. ఓట్లు అర్థించారు. పవైసీపీ పాలనపై ఒక యుద్ధమే చేశారు. మొత్తంగా చూస్తే.. నారా కుటుంబంతోపాటు, నందమూరి కుటుంబాలను కూడా.. 2024 రోడ్డెక్కించింది. అయితే.. అందుకు తగ్గ ఫలితం దక్కడం మాత్రం భారీ ఉరటనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates