Political News

ఏపీ వైన్ టెండర్లలో ఒక్కడే 155 దరఖాస్తులు..

మద్యం బాబుల దయ వల్ల పలు రాష్ట్రాలు బలమైన ఆదాయంతో కొనసాగుతున్నాయి. ఇక వైన్ షాపుల ఓనర్లు కూడా ఏడాది తిరిగేసరికి ఊహించని లాభాలు చూస్తున్నారు. మొన్న దసరా సమయంలో మద్యం అమ్మకాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఊహించని ఆదాయం లభించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వైన్ షాపుల టెండర్లు ఊహించని ఉత్సాహాన్ని రేకెత్తించాయి. ఈ టెండర్లకు రాజకీయ నాయకుల నుంచి వ్యాపారవేత్తల వరకు పోటీ పడగా, సామాన్యులూ …

Read More »

చైనా దూకుడు.. ఆకాశంలో ఇండియా కన్ను

చాన్సు దొరికితే చాలు చటుక్కున దూరిపోయి చైనా మరోసారి తన వంకర బుద్దిని చుపోస్తోంది. హిందూ మహాసముద్రంపై చైనా క్రమంగా తన ప్రాబల్యాన్ని పెంచుతుండడంతో, భారత్ ఇప్పుడు తమ నిఘా వ్యవస్థను బలపర్చడానికి చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో, అమెరికాతో తాజాగా ప్రిడేటర్ ఎంక్యూ 9బీ డ్రోన్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం ప్రధానంగా చర్చనీయాంశమైంది. భారత ప్రభుత్వ నిర్ణయం మేరకు సుమారు రూ.32 వేల కోట్ల వ్యయంతో 31 …

Read More »

క‌శ్మీర్‌లో క‌ల‌కలం.. కాంగ్రెస్‌ కూట‌మి బీట‌లు!

జ‌మ్ముక‌శ్మీర్ రాజ‌కీయాల్లో సంచ‌ల‌న ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 90 స్థానాల‌కు గాను నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌(ఎన్‌.సీ) పార్టీ నేతృత్వంలోని కాంగ్రెస్ కూట‌మి మెజారి టీ స్థానాలు ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. 90 అసెంబ్లీ స్థానాల‌కు గాను(మ‌రో 5 నామినేటెడ్ స్థానా లు ఉన్నాయి) ఎన్‌.సీ 42 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కింది. ఈ రెండు క‌లిసి.. కూట‌మి …

Read More »

రెడ్డి గారి కూతురు… రాకెట్ స్పీడ్

రెడ్డిగారి కూతురా.. మ‌జాకా? అన్న‌ట్టుగా రెచ్చిపోయారు.. మాజీ ఎంపీ, నంద్యాల‌కు చెందిన ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజ‌ల‌. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌గా ఎదిగిన ఎస్పీవై రెడ్డి రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు.. గ‌త రెండు ద‌శాబ్దాలుగా సుజ‌లే చ‌క్రం తిప్పారు. ఆయ‌న ఎంపీగా ఉన్న‌ప్పుడు.. నంద్యాల స‌హా ఢిల్లీలోనూ సుజ‌ల దూకుడు చూపించారు. ఇక‌, ఎస్పీవై రెడ్డి మ‌ర‌ణానంత‌రం రాజ‌కీయాల్లోకి రావాల‌ని ప్ర‌య‌త్నించి.. ప‌లు కార‌ణాల‌తో ఆమె వెనుక‌డుగు వేశారు. అయితే.. ఇప్పుడు …

Read More »

అఖిల ప్రియ‌.. ఆగ‌ట్లేదుగా!!

భూమా అఖిల ప్రియ‌. ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని ఆళ్ల గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న మాజీ మంత్రి. ఆమె విజ‌యం ద‌క్కించుకున్న ఈ నాలుగు మాసాల్లో రెండు సార్లు చంద్ర‌బాబుకు ప‌నిక‌ల్పించారు. ఈ రెండు సార్లు కూడా చంద్ర‌బాబు ఆమెకు తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నాక‌.. నియోజ‌క‌వ‌ర్గంలో ఆమె అధికారుల‌ను బెదిరించిన వీడియోలు జూలైలో వెలుగు చూశాయి. తాను చెప్పింది వినాల‌ని.. చెప్పిందే చేయాల‌ని.. రూల్స్ ఉంటే …

Read More »

లోకేశ్ లోని చతురతను వెలుగులోకి తీసుకొచ్చిన ఇంటర్వ్యూ

ఒక రాజకీయ నేత సమర్థతను.. అంశాల మీద.. ప్రజా సమస్యల మీద అతడికున్న అవగాహనతో పాటు.. రాజకీయ చతురత ఎంతన్న విషయాన్ని చాటి చెప్పేందుకు.. ఏదైనా మీడియా సంస్థకు ఇచ్చే ప్రత్యేక ఇంటర్వ్యూ.. ఆ సందర్భంగా కఠినమైన ప్రశ్నలు.. చిరాకు పెట్టే ట్రికీ క్వశ్చన్లకు ఇచ్చే సమాధానాల ఆధారంగా అంచనా వేసేందుకు అవకాశం లభిస్తుంది. తాజాగా జాతీయ మీడియా సంస్థల్లో ఒకటైన టైమ్స్ నౌకు ఏపీ ఐటీ మంత్రినారా లోకేశ్ …

Read More »

గాంధీ ఫ్యామిలీలోనే కాదు పార్లమెంటులోనూ రేర్ సీన్

అంచనాలు నిజమయ్యాయి. లెక్క వేసుకున్నట్లే.. కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ సోదరి వాద్రా ఎన్నికల బరిలోకి దిగారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు ఉంది. ఆమె ఎన్నికల బరిలోకి దిగనున్నట్లుగా మంగళవారం పార్టీ అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో ఉప ఎన్నికల జరిగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తాజా నిర్ణయంతో గాంధీ కుటుంబానికి …

Read More »

ఏపీలో మద్యం పై 2 శాతం డ్రగ్ రీహ్యాబిలిటేషన్ సెస్

ఏపీలో నూతన మద్యం పాలసీ అక్టోబర్ 16 నుంచి అమల్లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 14 వ తారీకున కొత్త వైన్ షాపులకు లాటరీ ప్రక్రియ ముగియడంతో రేపటి నుంచి ఏపీలో ప్రైవేట్ రిటైల్ వైన్ షాపులు తెరుచుకోనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉండబోతున్నాయి. ఈ రోజు ప్రభుత్వం మద్యం షాపులకు చివరి రోజు కానుంది. ఈ …

Read More »

స‌జ్జ‌ల విష‌యాన్ని బాబు సీరియ‌స్‌గా తీసుకోలేదా?

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ మాజీ సల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అడ్డంగా బుక్క‌య్యారు. ఏపీ ప్ర‌భుత్వం స‌జ్జ‌ల‌పై కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై ఇంకా ఎఫ్ఐఆర్ న‌మోదు కావాల్సి ఉంది. ప్ర‌స్తుతం కేసు పూర్వాప‌రాల‌ను మాత్ర‌మే పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. ఈ నేప‌థ్యం లో తాజాగా స‌జ్జ‌ల విదేశాల నుంచి స్వ‌దేశానికి వ‌చ్చారు. అయితే.. ఆయ‌న విదేశాల‌కు పారిపోతున్నార‌ని భావించిన ఇమ్మిగ్రేష‌న్ వ‌ర్గాలు ఢిల్లీలో ఆయ‌న‌ను అడ్డుకున్నాయి. …

Read More »

చంద్ర‌బాబు సంప‌ద సృష్టిలో తొలి అడుగు ప‌డిన‌ట్టేనా..!

సంప‌ద సృష్టి. ఈ మాట ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌లకు ముందు జోరుగా వినిపించింది. “సూప‌ర్ సిక్స్ అమ‌లు చేస్తాం అంటే.. కొంత‌మంది .. ఎలా అమ‌లు చేస్తారు? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌ళ్లీ మ‌ళ్లీ చెబుతున్నాం.. అమ‌లు చేస్తాం. సంప‌ద‌సృష్టిస్తాం.. ఆ సంప‌ద‌ను అంద‌రికీ పంచుతాం. అప్పుడు అన్నీ అమ‌ల‌వుతాయి..” ఇదీ.. ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ నాయ‌కులు చెప్పిన మాట‌. దీంతో సంప‌ద సృష్టిపై త‌ర‌చుగా కూట‌మి స‌ర్కారుకు ప్ర‌శ్న‌లు …

Read More »

వైసీపీకి సెగ‌: కార్యాల‌యాలు క‌నిపించ‌డం లేదు

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి మ‌రో స‌మ‌స్య ఎదుర‌వుతోంది. ఒక‌వైపు పార్టీ నుంచి నాయ‌కులు ర‌న్ రాజా ర‌న్ అన్న‌ట్టుగా పొరుగు పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. మ‌రికొంద‌రు మౌనంగా ఉన్నారు. ఇంకొంద‌రు అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే.. పార్టీ అధినేత జ‌గ‌న్ మాత్రం ఇవ‌న్నీ తెలిసి కూడా చాలా నింపాదిగా ఉంటున్నారు. అస‌లు ఏమీ జ‌ర‌గ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తు న్నారు. ఫీల్ గుడ్ థియ‌రీ నుంచి …

Read More »

దూకుడు లేని కూట‌మి మంత్రులు.. మార్పులు త‌ప్ప‌వా..!

రాష్ట్రంలోని కూట‌మి ప్ర‌భుత్వంలో ఉన్న మంత్రులు కొంద‌రు బాగా ప‌నిచేస్తున్న విష‌యం తెలిసిందే. నిరంత‌రం… త‌మ శాఖ‌ల‌పై అప్ర‌మ‌త్తంగా ఉంటూ.. నిర్ణ‌యాల‌ను కూడా వేగంగా తీసుకుని అమ‌లు చేస్తున్నారు. ఈ జాబితాలో చాలా త‌క్కువ మంది ఉండ‌డ‌మే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మీడియా ముందైనా.. తెర‌వెనుకైనా.. క‌నిపిస్తున్న‌వారే క‌నిపిస్తున్నారు. ప‌నిచేస్తున్న‌వారే చేస్తున్నారు. మ‌రి మిగిలిన వారి సంగ‌తేంటి? అనేది ప్ర‌శ్న‌. ప్ర‌భుత్వం ఏర్ప‌డి నాలుగు మాసాలైంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం …

Read More »