హ‌మ్మ‌య్య‌.. చంద్ర‌బాబు వారిని శాటిస్‌పై చేశారే…!

ప‌ట్టుబ‌ట్టారు.. సాధించారు. ఈ మాట‌కు ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి నారాయ‌ణ స‌హా.. నారా లోకే ష్ కూడా ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నారు. వాస్త‌వానికి ప్ర‌భుత్వం అనుకుంటే.. సాధ్యం కానిది అంటూ ఏమీ ఉండ‌దు. అయితే.. కొన్ని కొన్ని విష‌యాల్లో సీఎం చంద్ర‌బాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయి తే.. తాజాగా చేసిన ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల బ‌దిలీల్లో.. మాత్రం ముగ్గురు మంత్రుల విష‌యంలో చంద్ర‌బాబు స్పంద‌న ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. వారు కోరుకున్న‌ట్టుగా బ‌దిలీలు జ‌ర‌గడం గ‌మ‌నార్హం.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌త డిసెంబ‌రు తొలి వారంలో కాకినాడ పోర్టును సందర్శించారు. ఆ స‌మయంలో ఆయ‌న పోర్టులోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, అధికారులు అడ్డు ప‌డ్డారు. ఇది పెద్ద వివాదానికి దారి తీసింది. ఆ త‌ర్వాత‌.. మ‌రో సంద‌ర్భంలోనూ.. కాకినాడ‌లో ప‌వ‌న్ కల్యాణ్ ఇబ్బంది ప‌డ్డారు. ఈ రెండు సార్లు కూడా.. ఆయ‌న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను కార్న‌ర్ చేసుకున్నారు. తాను జిల్లాకు వ‌స్తుంటే ఎస్సీ సెల‌వుపై వెళ్లిపోతున్నార‌ని, ఇది చాలా సీరియ‌స్ వ్య‌వ‌హార‌మ‌ని పేర్కొన్నారు. తాజాగా పాటిల్‌ను ప్ర‌భుత్వం బ‌దిలీ చేసి.. ప్రాధాన్యం లేని పోస్టుకు పంపించింది.

అంతేకాదు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌ల్నాడు ఎస్పీగా వ్య‌వ‌హ‌రించిన గ‌రిక‌పాటి బిందుమాధ‌వ్‌ను.. కాకినాడ ఎస్పీగా నియ‌మించింది. ఇది పూర్తిగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను సంతృప్తి ప‌రిచేందుకు చేప‌ట్టిన బ‌దిలీగా ఐపీఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, మంత్రి నారాయ‌ణ వ్య‌వ‌హారంలోనూ ఇదే జ‌రిగింది. అమ‌రావ‌తి రాజ‌ధాని బాధ్య‌త‌ల‌ను మంత్రి నారాయ‌ణ చూస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సీఆర్డీఏ క‌మిష‌న‌ర్‌గా ఉన్న కాట‌మ‌నేని భాస్క‌ర్ ఐఏఎస్‌కు ఆయ‌న‌కు పొస‌గ‌డం లేదు. దీనిపై రెండు మూడు సార్లు చంద్ర‌బాబు వ‌ద్ద పెద్ద ర‌గ‌డే జ‌రిగింది.

దీంతో తాజాగా కాట‌మ‌నేని కూడా త‌ప్పించారు. ఈ స్థానంలో క‌న్న‌బాబుకు చాన్స్ ఇచ్చారు. క‌న్న‌బాబు.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వానికిఅత్యంత విధేయుల‌న్న పేరుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, మంత్రి నారా లోకేష్ విష‌యా నికి వ‌స్తే.. ఐపీఎస్ అధికారి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రాజు విష‌యంలో సానుకూలంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న వైసీపీ నేత‌లకు సంబంధించిన సొమ్ముల‌ను ప‌ట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే లోకేష్ మ‌న‌సు చూర‌గొన్నారు.

తాజా బ‌దిలీల్లో.. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రాజును.. కీల‌క‌మైన‌ తిరుప‌తి ఎస్పీగా నియ‌మించ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి ఈ పోస్టు కోసం.. ఎంతో మంది ఐపీఎస్‌లు ఎదురు చూసినా.. చివ‌ర‌కు లోకేష్ ప్ర‌మేయంతో రాజుకు బ‌దిలీ ద‌క్కింద‌ని ఐపీఎస్ వ‌ర్గాలుచెబుతున్నాయి. మొత్తానికి మంత్రుల ప‌ట్టును నెర‌వేర్చ‌డంతో వారిని చంద్ర‌బాబు సంతృప్తి ప‌రిచినట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.