ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనాలు పెరగనున్నాయి. రెండు ప్రతిపక్ష పార్టీల అధినేతలు ప్రజల్లోకి వచ్చేందుకు రెడీ అయ్యారు. వీరిద్దరూ మిత్రులు కూడా కావడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలోనూ.. తెలంగాణలోనూ.. మరోసారి అధికారంలోకి వస్తామని భావించిన కేసీఆర్, జగన్లు ప్రజా తీర్పు కారణంగా.. పరాజితులయ్యారు. ఆ తర్వాత.. ఇద్దరూ కూడా దాదాపు ఇంటికే పరిమితం అయ్యారు. కేసీఆర్ ఏడాది కాలంలో ఒకటి రెండు సార్లు మాత్రమే బయటకు వచ్చారు. …
Read More »పవన్ పగబడితే ఇట్టా ఉంటదా…!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పగబడితే ఇలా ఉంటుందా? ఇదీ.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు.. వ్యాపార వర్గాల్లోనూ వినిపిస్తున్న మాట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి జనసేనపైనా.. ముఖ్యంగా పవన్ కల్యాణ్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. వ్యక్తిగత విమర్శలతోపాటు.. రాజకీయంగా కూడా.. పవన్ను ఆయన టార్గెట్ చేశారు. బహిరంగ సవాళ్లు కూడా గుప్పించారు. ఈ క్రమంలో పవన్ కాకినాడలో …
Read More »పది నెలల్లోనే అద్బుతాలు జరుగుతాయా?: సీఎం రేవంత్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి పది మాసాలే అయిందని.. ఈ పది మాసాల్లోనే అద్భుతాలు జరిగిపోతాయా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్ష బీఆర్ ఎస్ నాయకులు చేస్తున్న విష ప్రచారాన్ని అడ్డుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలే తమ ప్రభుత్వాన్ని కాపాడాలని కూడా ఆయన సూచించారు. అయితే.. ఇప్పటికిప్పుడు ప్రబుత్వానికి వచ్చిన సమస్య ఏమీలేదన్న ఆయన విపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని అడ్డుకునే బాధ్యత ప్రజలపైనే …
Read More »పవన్ మరో షిప్ను ఎందుకు చెక్ చేయలేదు?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సముద్రంలోకి వెళ్లి షిప్ పరిశీలించిన అంశం పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన, పవన్ కల్యాణ్ చర్యలను ప్రశంసించినప్పటికీ, పర్యటనపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ అనుభవం ఉన్న రంగం కాబట్టే షిప్ చుట్టూ గిరగిరా తిరుగుతూ వీడియోలు తీశారని, కానీ ఇందులో దాగున్న ఉద్దేశ్యాలు ఏమిటని ప్రశ్నించారు. …
Read More »చంద్రబాబుతో పవన్ భేటీ.. కాకినాడ ఎస్పీ బదిలీ తప్పదా?..
ఏపీలో కూటమి ప్రభుత్వానికి నేత్రాల్లాంటి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇద్దరూ భేటీ అయ్యారు. అమరావతి పరిధిలోని ఉండవల్లిలో ఉన్న ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి.. అనేక అంశాలపై ఆయనతో చర్చిస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీ పర్యటన, రాజ్యసభ సీట్ల పంపిణీ, కాకినాడ పోర్టులో ఇటీవల తాను పర్యటించినప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు వంటివాటిపై సీఎం చంద్రబాబుకు ఆయన మరింత విశదీకరించి వివరించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా …
Read More »జగన్ కేసులు : సుప్రీంకోర్టు షాకింగ్ ఆర్డర్స్
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు భారీ షాక్ తగిలింది. జగన్పై నమోదైన అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు తాజాగా షాకింగ్ ఆర్డర్స్ జారీ చేసింది. ఆయా అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను తమకు రెండు వారాల్లోగా అందించాలని సీబీఐ, ఈడీలకు స్పష్టం చేసింది. వీటితోపాటు తెలంగాణ హైకోర్టు సహా.. సీబీఐ, ఈడీ కోర్టులలో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని సంబంధిత అధికారులను …
Read More »పార్లమెంటులో ‘సబర్మతి రిపోర్టు’.. ‘చిత్రం’ ఏంటంటే!
దేశాన్ని రెండు దశాబ్దాలుగా కుదిపేస్తున్న గుజరాత్లోని గోద్రా రైలు దుర్ఘటన వ్యవహారం.. ఇప్పుడు పార్లమెంటుకు చేరింది. పార్లమెంటులోని బాలయోగి ఆడిటోరియంలో ఈ రోజు ‘ద సబర్మతి రిపోర్టు’ సినిమాను ప్రదర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రదర్శించే ఈ సినిమాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా హాజరై వీక్షించనున్నారు. ఈ సినిమాను వీక్షించేందుకు కేంద్రమంత్రులు, పార్లమెంటు ఉభయ సభ్యులను కూడా ఆహ్వానించారు. గుజరాత్లోని గోద్రాలో 2002లో జరిగిన రైలు దహనం …
Read More »బీజేపీ జాతీయ పీఠంపై పురందేశ్వరి..!?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా రాజమండ్రి ఎంపీ, ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరికి పట్టంకట్టనున్నారా? ఆమె పేరు పరిశీలనలో ఉందా? అంటే.. జాతీయ మీడియా వర్గాలు ఔననే అంటున్నాయి. ఆమె పేరు అనూహ్యంగా తెరమీదికి వచ్చిందని కూడా చెబుతున్నాయి. దీనికి రెండు కారణాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పేరు పరిశీలనలోకి వచ్చినట్టు వార్తలు వెలువడుతున్నాయి. 1) వచ్చే నెలలో.. ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. …
Read More »మహారాష్ట్ర కొత్త సీఎం ఫడ్నవీస్
మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వచ్చి వారం గడుస్తున్నా సీఎం పీఠంపై పీటముడి విప్పడంపై బీజేపీ పెద్దలు కసరత్తు చేస్తూనే ఉన్నారు. సీఎం రేసులో ఫడ్నవీస్, షిండేలు ప్రధానంగా ఉండగా…ఏదైనా అవకాశం వస్తుందేమోనని అజిత్ పవార్ కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అని ఖరారైంది. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. డిసెంబరు 2వ తేదీన లేదంటే …
Read More »వక్ఫ్ బోర్డు రద్దుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ!!
ఏపీలో వక్ఫ్ బోర్డును సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ రద్దు చేసింది…కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురాబోతోన్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపే క్రమంలోనే ఏపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును రద్దు చేసింది…ముస్లింలకు ఈ ప్రభుత్వం ద్రోహం చేసింది..ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇది. కానీ, వాస్తవం అది కాదు. నిబంధనలు తుంగలో తొక్కి వైసీపీ ప్రభుత్వ హయాంలో వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసేందుకు …
Read More »ఇండియా కూటమి దెబ్బతినేలా కేజ్రీవాల్ నిర్ణయం?
దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ స్టాండ్ను స్పష్టంగా తెలియజేశారు. ఇండియా కూటమితో కలిసి పోటీ చేయడం అనే ఆలోచననే తమ పార్టీకి లేదని, అన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులే బరిలో ఉంటారని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. రాజకీయంగా ఈ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆదివారం మీడియాతో మాట్లాడిన …
Read More »పెద్దారెడ్డి – పెద్దిరెడ్డి.. సేమ్ టు సేమ్!
కేతిరెడ్డి పెద్దారెడ్డి 70+, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 70+.. ఇద్దరూ సీనియర్ రాజకీయ నేతలే. పైగా తమ తమ నియోజకవర్గాల్లో తాముచెప్పిందే శాసనం అన్నట్టు వ్యవహరించారు. ఈ విషయంలో పెద్దిరెడ్డి సైలెంట్ అయితే.. పెద్దారెడ్డి ‘పుష్ప’ టైపు! కానీ, ఇద్దరూ కూడా చాపకింద నీరులా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన వారే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి.. మంత్రి కూడా. దీంతో ఆయనకు చిత్తూరు వ్యాప్తంగా …
Read More »