కూటమిలో ప్రధాన రోల్ పోషిస్తున్న టీడీపీ.. ఇటు పాలనపరంగా.. అటు అభివృద్ధి, సంక్షేమాల పరంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికి 11 మాసాలు పూర్తి చేసుకుంటోంది. కాగా.. ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారనేది చాలా కీలకం. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు చేయించి.. ప్రజల మనుసును గెలుచుకున్న వారి వివరాలను రాబట్టారు.
దీనికి సంబంధించిన నివేదిక ఒకటి సీఎం చంద్రబాబుకు చేరింది. దీనిలో గతంలో 70 మందిపై వ్యతిరేకత కనిపిస్తే.. తాజాగా వచ్చిన కొత్త నివేదికలో 40 మందిపైనే ప్రజల్లో అసంతృప్తి ఉందని స్పష్టమైంది. అంటే.. గతంలో వచ్చిన నివేదక తర్వాత.. చంద్రబాబు పార్టీ నాయకులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అంతేకాదు.. కొందరికి వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో పరిస్థితి కాస్తమెరుగు పడినట్టే కనిపిస్తోంది. చాలా వరకు నియోజకవర్గాల్లో మార్పు కనిపిస్తుండడమే దీనికి ఉదాహరణ.
గతంలో పార్టీ నాయకులపై పెట్టిన నిఘా, సర్వేల ద్వారా తీసుకున్న అభిప్రాయాలు.. చంద్రబాబుపై తీవ్ర ప్రభావం చూపించాయి. కూటమిలో ఏర్పడిన లుకలుకలు.. వంటివి కూడా ఆయనను ఆలోచనకు గురి చేశాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అప్పట్లో వార్నింగ్ ఇచ్చారు. ఇది ఫలించింది. తాజాగా చేయించి న సర్వేలో గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న 70 మంది ఎమ్మెల్యేల పనితీరులో సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరులో మార్పు కనిపించినట్టు స్పష్టమైంది.
తాజాగా వచ్చిన రిజల్ట్‌ను బట్టి సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరులో మార్పు కనిపించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా 20 మంది పనితీరు మారడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తున్నట్టు కూడా సర్వేలో స్పష్టమైంది. అంతేకాదు.. వీరు ప్రజలకు చేరువ కూడా అవుతున్నారని తెలిసింది. మెజారిటీగా 20 మందిలో 15 మందికి 90 శాతం మార్కులు పడగా.. కేవలం ఐదుగురికి మాత్రమే 75 శాతం మార్కులలోపు పడ్డాయి. ఇక, మరో 20 మంది ఎమ్మెల్యేలు 50 శాతానికి పైగానే మార్కులు సంపాయించారు. సో.. మొత్తంగా చూస్తే.. చంద్రబాబు మార్కు క్లాసులు ఫలించి.. తమ్ముళ్లలో స్పష్టమైన మార్పులు కనిపిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates