వైసీపీ అధినేత జగన్‌కు షాకిచ్చే పరిణామం. రాష్ట్రంలోని బీజేపీ-టీడీపీ-జనసేనల కూటమిని ఆయన ఎంత తేలికగా తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఈ కూటమి బీటలు అవుతుందని.. నాయకుల మధ్య పొరపొచ్చాలు వస్తున్నాయని.. తన అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రొజెక్షన్ చేస్తున్నారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వాలు ఉన్న చోట సహజంగానే వివాదాలు కూడా ఉంటాయి. వీటిని కాదనలేం. మహారాష్ట్ర సహా.. బీహార్ వంటి చోట్ల పొరపొచ్చాలు కనిపిస్తున్నాయి.
ఏపీలోనూ ఇలానే జరుగుతుందని.. వచ్చే ఎన్నికల నాటికి కూటమి ముక్కలై… తనకు మేలు జరుగుతుందని జగన్ అంచనాలు వేసుకుంటున్నారు. కానీ.. వైసీపీ అధినేత వేసుకుంటున్న అంచనాలు అంత కరెక్టు కాదన్న విషయం తాజాగా మరోసారి కూడా రుజువైంది. ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచే కూటమి బలం ఎంత ఉందన్నది స్పష్టంగా తెలుస్తోంది. “మనమే(పవన్-చంద్రబాబు-మోడీ) రాజధాని అమరావతిని పూర్తి చేయాలి” అని నొక్కి మరీ చెప్పారు.
సహజంగా కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలా ఒక నాయకుడు ‘మనం’ అని వ్యాఖ్యానించ డం చాలావరకు తక్కువగానే ఉంటుంది. పైగా మోడీ వంటి నాయకుడు.. ఇలా వ్యాఖ్యానించారంటే.. ఈ మూడు పార్టీల మధ్య ఉన్న బలం.. బంధం వంటివి స్పష్టం చేస్తున్నాయి. అందుకే.. మోడీ “ఎన్టీఆర్.. వికసిత భారత్ కోసం కలలు కన్నారని.. వాటిని మనం సాకారం చేద్దామని” కూడా పేర్కొంటూ.. అన్నగారిని కూడా ప్రస్తావించారు. ఇది టీడీపీ హార్డ్ కోర్ అభిమానులను మరింత మంత్రి ముగ్ధులను చేసింది.
ఈ పరిణామాలను గమనిస్తే.. కూటమి నిర్వీర్యమైపోతుందని.. వచ్చే ఎన్నికల నాటికి తనను ప్రజలు అక్కున చేర్చుకుంటారని జగన్ భావిస్తున్నారు. కానీ.. బలమైన సంకేతాలు ఇప్పటికే వస్తున్నాయి. ఇటు వైపు పవన్ కల్యాణ్ కూడా.వచ్చే 15 సంవత్సరాల వరకు తాము కలిసే ఉంటామని చెబుతున్నారు. తాజాగా మోడీ కూడా.. అంతపెద్ద ప్రకటన చేయకపోయినా.. అంత పెద్ద వ్యూహాన్నే ఆవిష్కరించారు. సో.. ఇప్పటికైనా.. జగన్.. ఈ కూటమిని తక్కువగా అంచనా వేయకుండా తన వ్యూహానికి పదును పెంచితేనే పార్టీకి మేలు జరుగుతుందని వైసీపీ నాయకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates