ఏపీ సీఎం చంద్రబాబుపై గత రెండు రోజులుగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి మరోసారి తన అక్కసు ప్రదర్శించారు. కాకినాడ పోర్టు వ్యవహారంపై తనకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేయడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సాయిరెడ్డి గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘బతికి ఉంటే.. అరెస్టు తప్పదు’ అంటూ.. ఎవరూ సహించని భాషను ప్రయోగించారు. అంతేకాదు.. చంద్రబాబు దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు …
Read More »రాజ్యసభలో నోట్ల కట్టలు.. తెరపైకి మరో వివాదం!
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదానీ, మణిపూర్, యూపీలో సంభాల్ వివాదం వంటివాటిపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో సభలు సజావుగా సాగడం లేదు. ఇక, ఇప్పుడు రాజ్యసభలో నోట్ల కట్టల వివాదం తెరమీదికి వచ్చింది. ఓ సీటు వద్ద రూ.500, రూ.100 నోట్ల కట్టలు లభించడం వివాదానికి, అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ నోట్ల కట్టలు లభించడంపై …
Read More »కేతిరెడ్డికి చెక్ పెడుతున్నారు.. !
అనంపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్.. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో రోజూ ప్రజలకు చేరువయ్యారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న కొన్ని సమస్యలను కూడా పరిష్కరించారని అంటారు. అయితే.. ధర్మవరంలో బీజేపీ గెలిచిన తర్వాత.. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ మంత్రి అయ్యాక ఇక్కడ సీన్ మారిపోయిందని చెబుతున్నారు. వెంకట్రామిరెడ్డి …
Read More »‘పీఠాలు’ కదులుతున్నాయి.. జగనే పట్టించుకోలేదు!
ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత జగన్ లైట్ తీసుకున్నారే కానీ.. ఇతర వర్గాలు.. ముఖ్యంగా ప్రజలు మాత్రం చాలా సీరియస్‌గానే తీసుకున్నారు. ఒక్కసారి రాజధానిని ఫిక్స్ చేయడం.. అక్కడి రైతుల నుంచి భూములు తీసుకుని కొంత మేరకు ప్లాన్లు కూడా రెడీ చేసుకోవడం, సచివాలయం, హైకోర్టు, శాసన సభ, మండలి వంటివాటిని నిర్మించడం.. వంటివి ప్రజలు సీరియస్‌గానే తీసుకున్నారన్న విషయం.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో స్పష్టంగా …
Read More »డీఎస్సీ నుంచే రిజర్వేషన్ ఫలాలు.. బాబు షాకింగ్ నిర్ణయం
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఫలాలు ఎప్పుడు అందుతాయనే ప్రశ్నకు ఏపీ సీఎం చంద్రబాబు సమాధానం చెప్పారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఫలాలను ఆయా సామాజిక వర్గాలకు అందించనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. చేసినతొలి సంతకం.. 16 వేల టీచర్ ఉద్యోగాల భర్తీపైనే. దీనికి సంబంధించి డీఎస్సీ ప్రకటన కూడా విడుదలైంది. అయితే.. ఆరు మాసాలైనా డీఎస్సీ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై సందిగ్థత కొనసాగుతోంది. దీనిపై …
Read More »గగ్గోలు పెట్టిన సాయిరెడ్డి!
వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి గగ్గోలు పెట్టారు. కాకినాడ పోర్టు విషయంలో కోనేరు వెంకటే శ్వరరావు(కేవీ రావు)ను బెదిరించారన్న కేసులో సాయిరెడ్డిపై ఏపీ సీఐడీ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన సాయిరెడ్డి గగ్గోలు పెట్టారు. తానేమైనా దొంగనా? దేశం విడిచిపారిపోతానా? అని ప్రశ్నించారు. తాను బాధ్యతాయుతమైన రాజ్యసభ సభ్యుడినని.. అనేక అంశాలపై సభలో ప్రజల తరఫున …
Read More »గ్రామీణ స్థాయిలో వైసీపీకి భరతం.. రేపటి నుంచే!
ప్రస్తుతం ఏపీలో ఉన్న కూటమి సర్కారు గత వైసీపీ సర్కారు తప్పులను లెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇసుక సహా.. అనేక వ్వవస్థలను బాగు చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు గ్రామీణ స్థాయిలో వైసీపీ నేతలు చేసిన తప్పులను వెలికి తీసేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో శుక్రవారం(డిసెంబరు 6) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 40 రోజలు పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుల్లో …
Read More »జగన్ జైలుకు వెళ్లడం ఖాయం.. ఏసీబీ ఆఫీస్ వద్ద షర్మిల!
ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ నుంచి రూ.1750 కోట్ల మేరకు లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్‌పై ఆయన సోదరి పీసీసీ చీఫ్ షర్మిల నిరసన బాట పట్టారు. బుధవారం ఆమె ప్రకటించినట్టుగానే గురువారం ఉదయం.. జగన్‌పై ఏపీ ఏసీబీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అయితే.. దీనికి ముందే.. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అదానీ – జగన్ రూ.1750 కోట్ల ముడుపుల పై వెంటనే దర్యాప్తు జరిపించాలని …
Read More »ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు సేఫ్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయాలను తీవ్రంగా కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అనేక మంది అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కీలక అధికారులు ప్రస్తుతం జైల్లో ఉండగా.. మరొకరు విదేశాలకు కూడా వెళ్లిపోయారు. ఇక, ఈ కేసులో మాజీ మంత్రి హరీష్‌రావు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు …
Read More »కేసీఆర్ బాటలో రేవంత్ నడుస్తున్నారా?
ఎవరినైతే తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ రాజకీయంగా ఎదుగుతారో.. సదరు అధినేత తీరును తాను అనుకరించటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నారా? అన్నదిప్పుడు చర్చగా మారింది. సీఎంగా ఆయన తొలి ఏడాదిని విజయవంతంగా పూర్తి చేసుకుంటున్న వేళ.. పెద్ద ఎత్తున విజయోత్సవాల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సందర్భంంలో కాస్త ఇబ్బంది కలిగించినా.. వాస్తవాన్ని వెల్లడించాల్సిన అవసరం ఉంది. …
Read More »హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ.. హిజ్రాల చేతిలోకి..!
హైదరాబాద్.. ఎంత సుందర నగరమో.. అంతే కష్టాలకు కూడా కేంద్రం. చిన్నపాటి వర్షానికే మునిగిపోవడం.. ఎటు చూసినా ట్రాఫిక్‌తో కొట్టుమిట్టాడే సగటు జీవి.. మనకు ఇక్కడే కనిపిస్తాడు. ఉదయం 8-10, సాయంత్రం 4-8 అడుగు తీసి బయట పెట్టాలం టే ఆపశోపాలు పడాల్సిందే. కిలో మీటరు దూరం ప్రయాణించేందుకు నానా కష్టాలు పడాల్సిందే. దీనికి కారణం భారీగా పెరిగిపో యి వాహనాలు.. ప్రజలు! దీంతో ట్రాఫిక్ కష్టాలు ఇంతింత కదయా! …
Read More »డిప్యూటీ సీఎం పదవికి ఓకే చెప్పిన షిండే!
మహారాష్ట్రకు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే భావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరి వరకు షిండే సీఎం పీఠం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే, ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిగా చేయాలని బిజెపి పెద్దలు భావించడంతో షిండే డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రేపు షిండే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. షిండే తో పాటు అజిత్ పవర్ కూడా రేపు …
Read More »