వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక కార్యకర్త.. జగన్ కాన్వాయ్ కింద పడి మృతి చెందారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ నాటి ఘటనపై విచారణ జరుగుతోంది. తాజాగా విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నలోని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు.
ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందారు., జగన్ పర్యటనలో పాల్గొనేందుకు ఎన్టీఆర్ జిల్లా చిల్లక్లలు గ్రామానికి చెందిన పంచాయతీ ప్రెసిడెంట్ రాంబాబు కూడా బయలు దేశారు. ఈయన ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. షుగర్ లెవిల్స్ పడిపోయి.. ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో స్పందించిన కార్యకర్తలు.. ఆయనను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
మరో ఘటనలో..
జగన్ వస్తున్నాడన్న ఆనందంతో.. కార్యకర్తలు కొందరు రోడ్లపై బైకులతో స్టంట్లు చేశారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త చేస్తున్న స్టంట్ అదుపు తప్పి.. బైకు వెళ్లి రోడ్డుపై ఉన్న బార్ గేట్‌ను బలంగా డీ కొట్టింది. ఈ ఘటనలో కార్యకర్త తలకు బలమైన గాయమై.. అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇతను ఇబ్రహీంపట్నం కొత్తగేట్‌కు చెందిన భార్గవ్‌గా గుర్తించారు. జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌కు స్నేహితుడని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా జగన్ పర్యటన అనగానే ఏవొ ఒక మరణాలు చోటు చేసుకుంటున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
