టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును 2023 సెప్టెంబరులో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాజమండ్రి జైల్లో రిమాండ్ పై ఉన్న చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్ ములాఖత్ కావడం ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు. అక్కడే ఏపీలో ఎన్డీఏ కూటమికి బీజం పడడం…ఆ తర్వాత కూటమి అఖండ విజయం సాధించడం ఒక చరిత్ర.
చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో లోకేశ్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు పవన్. అప్పటి నుంచి నేను ‘ఉన్నా’ అని తనకు భరోసానిచ్చిన పవన్ ను ‘అన్నా’ అంటూ ఆప్యాయంగా పలకరిస్తుంటారు.
ఈ ఇద్దరు ఒకచోట కలిసే సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఆప్యాయంగా సోదరభావంతో మెలుగుతుంటారు. ఆ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు వీరిద్దరూ హాజరైన ప్రతిసారి ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం ఆనవాయితీగా మారింది.
తాజగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా లోకేశ్, పవన్ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో, ఈ ఫొటో లేకుండా అసెంబ్లీ మొదలవ్వదు అంటూ టీడీపీ, జనసేన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ ఇద్దరు యువ నేతల మధ్య బాండింగ్ కలకాలం కొనసాగాలని, వీరి నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates