నేడు(నవంబరు 19) దేశ మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ జయంతి. 1917, నవంబరులో ఆమె జన్మించారు. దేశానికి ప్రధాన మంత్రిగా చేశారు. కూడు-గూడు-గుడ్డ నినాదాన్ని అందిపుచ్చుకుని పేదలను తనవైపు తిప్పుకొన్నారు. అయితే.. ఎమర్జెన్సీ కారణంగా.. ఇందిరమ్మ ప్రజా ప్రాభవం కోల్పోయింది. ఇదిలావుంటే.. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. దీనికి `ఇందిరా మహిళా శక్తి` అనే పేరు పెట్టింది. ఈ పథకం కింద.. …
Read More »లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్ నివేదిక ఆధారంగా చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రూ.54.87 కోట్లను నల్లధనంగా మార్చినట్లు సిట్ తేల్చింది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఉన్న పలు ఆస్తులు జప్తు కానున్నాయి. అధికార అండతో మోసపూరిత భూ లావాదేవీలు జరిగినట్లు సిట్ నిర్ధారించింది. అవినీతి నిరోధక, నేర చట్టాల ప్రకారం జప్తును అనుమతించాలంటూ సిట్ సిఫార్సు …
Read More »`ఆపరేషన్ తమిళనాడు`.. మోడీ స్టార్ట్ చేసేశారా?
ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా బీజేపీ నేతల వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. ఎన్నికలకు మూడు నాలుగు మాసాల ముందుకాదు.. ఏకంగా ఆరేడు మాసాల ముందే ప్లాన్ వేసుకుంటారు. ఎన్నికల కోడ్ రావడానికి ముందే రాజకీయ వ్యూహాలను అమలు చేసేస్తారు. ఇది బీజేపీ విజయానికి బలమైన దన్నుగా మారుతోంది. ఇప్పటి వరకు బీజేపీ దక్కించుకున్న రాష్ట్రాల పరిస్థితిని గమనిస్తే.. ఖచ్చితంగా ఈ తరహా వ్యూహం స్పష్టంగా …
Read More »రూపాయి బిళ్ళతో మోదీ గడియారం.. దాని చరిత్ర తెలుసా?
ప్రధాని నరేంద్ర మోదీ ధరించే జాకెట్లు, కుర్తాలు ఎప్పుడూ స్పెషలే. ఆయన స్టైల్ స్టేట్మెంట్ను ఫాలో అయ్యేవాళ్ళు చాలామందే ఉన్నారు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో మోదీ చేతికి ఉన్న వాచ్ ఒకటి గట్టిగానే వైరల్ అవుతోంది. ఎందుకంటే అది ఏదో విదేశీ బ్రాండ్ రోలెక్స్ వాచ్ కాదు. పక్కా మన దేశంలో తయారైన వాచ్. దాని ధర సుమారు 55 వేల నుంచి 60 వేల రూపాయలు …
Read More »10వ సారి సీఎం కుర్చీ.. కానీ ఆ ‘పవర్’ ఎవరి చేతిలో?
బీహార్ రాజకీయాల్లో “నితీష్ కుమార్” అంటేనే ఒక రికార్డు. ముఖ్యమంత్రి కుర్చీ మారదు, కూటములు మాత్రమే మారుతుంటాయి అనే పేరున్న ఆయన, ఇప్పుడు మరో చరిత్ర సృష్టించబోతున్నారు. అక్షరాలా 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అయ్యారు. ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో, ఈరోజు (బుధవారం) ఆయన తన పదవికి రాజీనామా చేసి, మళ్లీ రేపు (గురువారం) కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇది భారత రాజకీయ …
Read More »ఏపీలో 46,85,838 మంది రైతులకు రూ.3135 కోట్లు..
అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద నేడు రైతుల ఖాతాల్లో నిధులు ప్రభుత్వం జమచేసింది. 46,85,838 రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.3135 కోట్లు సొమ్మును జమ చేసింది. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ.2 వేలు, రాష్ట్ర వాటా రూ.5 వేలు చొప్పున మొత్తం 7 వేలు అందించింది. రెండు విడతల్లో కలిపి పిఎం కిసాన్- అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం రూ.6309.44 కోట్ల …
Read More »ఏజెన్సీలో కాల్పుల మోత.. మరో భారీ ఎన్ కౌంటర్?
ఏజెన్సీలో ఇవాళ ఉదయం మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మారేడుమల్లి పరిధిలోని బీఎం వలసలో ఉదయం నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్ కౌంటర్ మృతుల్లో అగ్ర నేతలు ఉన్నట్లు సమాచారం. ఎన్ కౌంటర్ ను ఇంటిలిజెన్స్ ఏడిజి మహేష్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. పూర్తి వివరాలు అందాల్సి ఉందని తెలిపారు. నిన్న 19 మంది తప్పించుకున్నారని …
Read More »జగన్ పరివారంలో నిరాశ… పీక్స్‌కు వెళుతుందా?
వైసీపీ అధినేత జగన్ పరివారంలో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నాయా? పార్టీ భవిష్యత్తుపై ఆశలు ఉడికిపోతున్నాయా? అంటే.. కొన్నాళ్లుగా ఔననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీ అధినేత బయటకు రాకపోవడం.. పార్టీని బలమైన దిశగా నడిపించక పోవడం వంటివి నేతల మధ్య చర్చకు వచ్చాయి. ఇక, పార్టీ పరంగాకూడా సరైన అడుగులు వేయలేక పోతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలో గతంలో మాదిరిగా జగన్ కు ఆదరణ ఉండడం లేదన్న …
Read More »‘పరకామణి’పై మరింత పటిష్ఠంగా.. టీటీడీ నిర్ణయం
వైసీపీ హయాంలో 2021-22 మధ్య కాలంలో తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల హుండీ పరకామణిలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో పరకామణి సొమ్మును లెక్కించే సమయంలో విదేశీ 70 డాలర్లను అక్కడే పనిచేస్తున్న రవికుమార్ అనే సీనియర్ అసిస్టెంట్ కట్ డ్రాయర్లో పెట్టుకుని దోచుకున్నారు. అయితే.. ఈ విషయాన్ని పసిగట్టిన ఏవీఎస్వో సతీశ్ కుమార్ పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం.. ఏం జరిగిందో ఏమో.. ఈ …
Read More »ఆయనను బీఆర్ఎస్ నుండి తరిమేసి తప్పు చేశారు: కవిత
బీఆర్ఎస్ పార్టీపైనా .. ఆ పార్టీ నేతలపైనా విమర్శలు చేస్తున్న తెలంగాణ జాగృతి నాయకురాలు, మాజీ ఎంపీ కవిత తాజాగా మరో సంచలన వ్యాఖ్య చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి.. ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావును బీఆర్ ఎస్ పార్టీ నుంచి తరిమేసి పెద్ద తప్పు చేశారని కవిత అన్నారు. ఆయనను అలా పంపించేసినందుకే.. బీఆర్ ఎస్ …
Read More »ఓటమికి నేనే బాధ్యుడిని.. మౌన దీక్ష చేస్తా: పీకే
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకుని అధికారంలోకి వస్తామనిప్రకటించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఆశించిన విధంగా ఫలితాలను రాబట్టుకోలేక పోయారు. కనీసం 234 మంది అభ్యర్థులను నిలబెట్టినా ఒక్క చోట కూడా.. ఆయన డిపాజిట్ దక్కించుకోలేక పోయారు. అయితే.. ఓట్లు మాత్రం 3.3 శాతం వచ్చాయి. ఇవి ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, ఆర్జేడీల కూటమిని చావు దెబ్బ కొట్టాయన్న చర్చ ఉంది. అయితే.. పీకే ప్రారంభించిన జన్ …
Read More »రాజధానికి కూతవేటు దూరంలో మావోయిస్టుల కలకల
ఏపీ రాజధాని అమరావతి సమీపంలో విజయవాడ నగర శివారు కానూరు కొత్త ఆటోనగర్‌లో మావోయిస్టుల కలకలం రేగింది. కేంద్ర బలగాలు సోదాలు చేపట్టి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ భవనాన్ని షెల్టర్‌గా చేసుకుని మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. అరెస్టయిన మావోయిస్టుల్లో 12 మంది మహిళలు, నలుగురు కీలక హోదాల్లోని వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. 11 మంది …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates