ఏపీ శాసన మండలి ఐదో రోజు సమావేశాలు హాట్ హాట్‌గా ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం అవుతూనే .. రాష్ట్రంలో శాంతి భద్రతలపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో చైర్మన్ మోషేన్ రాజు శాంతి భద్రలపై చర్చకు ఓకే చెప్పారు. తొలుత మాట్లాడిన వైసీపీ మండలి పక్ష నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. కూటమి ప్రభుత్వం వచ్చాక వీధికో రౌడీ తయారయ్యారని, మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని …
Read More »మరో సారి కేటీఆర్ పై రెచ్చిపోయిన కొండా సురేఖ
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దాడి చేయించేందుకు వెనుకనుండి కేటీఆర్ కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. అమాయకులను బలి చేసి తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడమే బీఆర్ఎస్ నాయకుల లక్ష్యమని పేర్కొన్నారు. అంతే కాకుండా లగచర్ల ఘటనలో ప్రమేయం ఉన్న అధికారులను విదేశాలకు …
Read More »ఆదివారం కూడా.. కేసీఆర్‌ను వదిలిపెట్టవా రేవంత్!?
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం సండే అయినా మండే అయినా తగ్గేదేలే అన్నట్లుగా తమ తమ రాజకీయ అజెండాతో ముందుకు సాగుతుంటారు. అలా తాజాగా ఓ వైపు మహారాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు తెలంగాణలో తన రాజకీయ ప్రత్యర్థి అయిన కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. ఈ మేరకు …
Read More »కేజ్రీవాల్ కు మరో దెబ్బ..
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత నేతలే ఇప్పుడు అధినేత కేజ్రీవాల్ కు శత్రువులుగా మారుతున్నారు. ఈసారి ఏకంగా ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాస్ గెహ్లాట్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ పార్టీలో (ఆప్) కొత్త చర్చకు తెరలేపారు. ప్రభుత్వ అవినీతిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ …
Read More »రేవంత్ మనసును తెలుసుకున్న అధికారులు…
ఇప్పుడు మనం జీవిస్తున్న సమాజంలో… కొన్ని సమస్యలు చాపకింద నీరులా మన పుట్టి ముంచేస్తున్నాయి. మొదట ఒకచోట ప్రారంభమై… తర్వాత స్వల్పకాలంలోనే అందరికీ చేరువై జీవితాలను, కుటుంబాలను, సమాజాన్ని నాశనం చేస్తున్నాయి. అలాంటి వాటిల్లో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా మారింది డ్రగ్స్! ఆల్కహాల్ తీసుకోవడానికి అనుబంధంగా, అతి కొద్ది మంది ఫన్ కోసం తీసుకున్న ఇది ఇప్పుడు అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం నుంచి మొదలుకొని ఆదిలాబాద్ వంటి మారుమూల …
Read More »ఏపీకి గోల్డెన్ ఛాన్స్.. ఒకేసారి 6 ఎయిర్‌పోర్టులు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వైమానిక పరివహనానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ ఆరు కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణాన్ని పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ప్రతిపాదనల కోసం రూ.1.92 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో సాధ్యత అధ్యయనం ప్రారంభించి, నివేదికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు రాష్ట్రానికి ఆర్థికంగా ప్రయోజనాలు కలిగించే ప్రాంతాలను సెలెక్ట్ చేసుకునే పనిలో పడ్డారు. చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంతో పాటు, శ్రీకాకుళం (పలాస), నాగార్జునసాగర్ …
Read More »కొత్త రాజధాని కోసం చంద్రబాబు పాట్లు చూశారా…!
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధానంగా మూడు విషయాలను ఆయన కేంద్ర మంత్రులతో చర్చించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లతోనూ ఆయన భేటీ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఏపీలోనే చంద్రబాబు.. అనంతరం ఢిల్లీ వెళ్లి.. అక్కడ వారిని కలిశారు. ఈ క్రమంలో అమరావతి రాజధానికి సంబంధించిన కీలక విషయంపై జైశంకర్‌తో చర్చించారు. అమరావతి రాజధానిని నిర్మించేందుకు, ఈ ఐదేళ్ల …
Read More »‘బ్రిటీషర్ల మాదిరి ప్రపంచాన్ని భారతీయులు ఏలవచ్చు’
ఢిల్లీలో జరుగుతున్న హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కొంతకాలంగా పాపులేషన్ మేనేజ్మెంట్ ఆవశ్యకత గురించి పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు తాజాగా హెచ్ టీఎల్ ఎస్ లో కూడా ఆ అంశాన్ని ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుదల సమస్య మొదలైందని, ఫెర్టిలిటీ రేటు తగ్గుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జననాల రేటు బోర్డర్ లైన్ లో ఉందని, అది …
Read More »తమ్ముడి మృతి.. తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు అకాల మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రిలో రామ్మూర్తినాయుడు మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోయారు. తమ్ముడి నిర్జీవ దేహాన్ని చూస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ, తమ్ముడి మరణం తన జీవితంలో చాలా పెద్ద లోటు అని పేర్కొన్నారు. “తమ్ముడు రామ్మూర్తినాయుడు ప్రజాసేవకు నిరంతరం …
Read More »అవినాష్‌రెడ్డికి మరో చిక్కు.. ఇక, బీటెక్ రెడ్డి వంతు!
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం బెయిల్‌పైనే కాలం గడుపుతున్నారు.ఇక, ఆయన ప్రోత్సహించినట్టు చెబుతున్న కొందరు వైసీపీ సానుభూతి పరులు సోషల్ మీడియాలో విశృంఖలంగా కామెంట్లు చేశారు. వీరిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. కీలకమైన అవినాష్‌రెడ్డి పీఏ కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఇన్ని చిక్కుముడుల …
Read More »కూటమి కలకాలం.. తేల్చేసిన చంద్రబాబు!
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కారణాలు ఏవైనా.. నాయకులు మాత్రం నిప్పులు చెరుక్కుంటు న్నారు. కూటమి నేతలు తమ పదవులు తన్నుకు పోతున్నారని టీడీపీ నాయకులు, టీడీపీ నాయకుల వల్లే తమకు పదవులు రాకుండా ఉంటున్నాయని ఇతర పార్టీల నాయకులు ఉసూరు మంటున్నారు. దీంతో కలివిడి కన్నా విడివిడి రాజకీయాలే ఏపీలో క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. …
Read More »రాజాసింగ్…కనబడుటలేదు!
రాజాసింగ్… రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. హిందుత్వం పట్ల తన నిబద్దతను ఎప్పటికప్పుడు చాటుకుంటూ `సిద్ధాంతపరమైన` ప్రత్యర్థులను టార్గెట్ చేయడంలో ఆయన ముందుంటారు. అంతేకాకుండా, హైదరాబాద్‌లో ఏకైక బీజేపీ ఎమ్మెల్యే కూడా రాజాసింగ్. వరుసగా మూడు సార్లు గెలిచిన రాజాసింగ్ జాడ ఏదని ఇప్పుడు బీజేపీలోనే చర్చ జరుగుతోంది, తాజాగా మరో అంశంలో ఆయన పేరు …
Read More »