తనపై ఉన్న వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులకు సంబంధించి వైసీపీ అధినేత జగన్.. తాజాగా హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత.. ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. 2020లో ఒకే ఒక్కసారి ఆయన ముఖ్యమంత్రి హోదాలో కోర్టు ఆదేశాల మేరకు నాంపల్లికి వచ్చి.. కోర్టు విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత తాను ముఖ్యమంత్రినని… తాను బయటకు వస్తే.. భారీ భద్రత కల్పించాల్సి ఉంటుందని, పైగా తాను …
Read More »భారత్ అమ్ములపొదిలో అమెరికన్ ‘అస్త్రాలు’
భారత రక్షణ రంగానికి అదిరిపోయే గుడ్ న్యూస్. మన సైనిక శక్తిని అమాంతం పెంచేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 93 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 800 కోట్లు) విలువైన భారీ ఆయుధ ఒప్పందానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ‘జావెలిన్’ యాంటీ ట్యాంక్ మిసైల్స్‌తో పాటు, శత్రువులను పిన్ పాయింట్ అక్యురసీతో కొట్టే ‘ఎక్స్‌కాలిబర్’ ఆర్టిలరీ మందుగుండు సామగ్రి కూడా ఉంది. …
Read More »ఈ టైంలోనా… మీ ‘రప్పా.. రప్పా..’?
తమ నాయకుడు వెళుతుంది కోర్టుకు..! అక్రమ ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి, బెయిలుపై వచ్చి.. దాదాపు ఆరేళ్ల తర్వాత కోర్టుకు హాజరయ్యారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఈ సమయంలో హైదరాబాదులో బేగంపేట నుంచి నాంపల్లి కోర్టు వరకు జగన్ అభిమానులు హంగామా సృష్టించారు. బేగంపేట్ నుంచి కోర్టు వరకు భారీ ర్యాలీ చేపట్టిన అభిమానులు.. ర్యాలీలో మహేష్ బాబు – జగన్ – కేటీఆర్ ఫ్లెక్సీలతో హల్చల్ …
Read More »ట్రంప్ కొత్త ‘డప్పు’!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ‘డప్పు’ కొట్టుకున్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య మే నెలలో జరిగిన ఉద్రిక్తతలను తానే స్వయంగా ఆపానని, లేకపోతే అది అణు యుద్ధానికి దారితీసేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికి దాదాపు 50 సార్లు ఇదే మాట చెప్పిన ట్రంప్, ఈసారి న్యూయార్క్‌లో జరిగిన సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్‌లో మరిన్ని కొత్త కథలు జోడించారు. “నేను జోక్యం చేసుకోకపోతే అణు బాంబుల …
Read More »అసమర్థుడు: రాహుల్ పై దండయాత్ర
జాతీయ స్థాయిలో వచ్చిన విశ్లేషణలు నిజమయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘంపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మేధావుల దండయాత్ర ప్రారంభమవుతుంది అని రెండు రోజుల క్రితం ఓ జాతీయ మీడియాలో వచ్చిన వార్తలు తాజాగా నిజమయ్యాయి. ఏకంగా 272 మంది మేధావులు రాహుల్ గాంధీపై విమర్శల వర్షం కురిపించారు. అంతేకాదు ఆన్ లైన్ లో నిర్వహించిన సర్వేలో సంతకాలు కూడా చేశారు. మరో లేఖపైనా వారు సంతకాలు చేయడం …
Read More »ఈ రెండు ఫొటోలు చాలు.. కూటమి బలం చెప్పడానికి!
“ఏపీలో కూటమి బలం ఏ విధంగా ఉందో చెప్పడానికి ఈ రెండు ఫొటోలు చాలు!“ ఈ మాట అన్నది ఎవరో టీడీపీ నాయకులో.. బీజేపీ నేతలో కాదు.. తటస్థులు, రాజకీయ విశ్లేషకులు!!. అంతేకాదు.. నెటిజన్లు కూడా ఫిదా అవుతున్న ఈ రెండు ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. అవే.. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి ఉన్న ఫొటో. దీనిలో …
Read More »నిద్ర లేదు.. ఆహారం తినాలని లేదు: పీకే ఆవేదన
ఆయన అనేక మంది నాయకులను చూశారు. అనేక పార్టీల గెలుపు ఓటములను కూడా దగ్గరగా పరిశీలించారు. అంతేకాదు ఒక పార్టీ గెలుపుకోసం పనిచేసి మరో పార్టీని ఓడించారు. ఇలా గత 10 సంవత్సరాలకు పైగా ప్రత్యక్ష రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రాజకీయ వ్యూహకర్త ప్రసాంత్ కిషోర్ ఉరఫ్ పీకే. అయితే ఆ అనుభవం తన దాకా వస్తే కానీ ఓటమిలో ఉన్న ఆవేదన ఆయనకు అర్థం కాలేదు. …
Read More »ఏపీ కొత్త ఎమ్మెల్యేలు: ఒక్కొక్కరు ఒక్కోలా …!
రాష్ట్రంలో కొత్త ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? వారు.. ప్రజలకు ఏమేరకు చేరువ అవుతున్నారు? .. ఈ ప్రశ్నలు ఎవరో.. ప్రత్యర్థులు అడుగున్నవి కాదు. సాక్షాత్తూ వారికి టికెట్ ఇచ్చి.. వారు గెలిచేలా ప్రోత్సహించి, ప్రచారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు వస్తున్న డౌట్లు. ఈ క్రమంలోనే కొత్తవారిని దారిలో పెట్టాల్సిన బాధ్యతను వారిని సరైన విధంగా ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యతను కూడా ఇంచార్జ్ మంత్రులకు అప్పగించారు. అయితే.. …
Read More »జగనే… నన్ను దూరం పెట్టాడు: షర్మిల
వైసీపీ అధినేత జగన్ సోదరి, ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల.. మరోసారి తన అన్నను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జగన్‌కు దూరం కాలేదని.. జగనే తనను, తన తల్లిని కూడా దూరం పెట్టాడని ఆమె అన్నారు. “ఎవరు చెప్పారు.. జగన్‌కు నేను దూరంగా ఉన్నానని?” అని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు..”జగన్ ఎప్పుడు అడిగినా.. నేను రాజకీయంగానే కాదు.. కుటుంబ పరంగా కూడా …
Read More »టీడీపీ మహిళా నేత: ఎన్నికల్లో ఓడి.. జనం మనసు గెలిచి.. !
“ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికల్లోనే గెలవాలా?. ఒక సంకల్పంతో వచ్చాం. అది నెరవేర్చుకునేందుకు ఎన్నికలు ఒక అవకాశం. ఎన్నికల్లో గెలిచి ఉంటే.. మన సంకల్పం మరింత పదును తేరుతుంది. అలాగని ఓడినా.. సంకల్పాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఏదో ఒక రకంగా సేవలు అందించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా.”-ఇదీ.. గత ఎన్నికల్లో పోటీ చేసి.. చివరి క్షణం వరకు గట్టి పోటీ ఇచ్చిన.. టీడీపీ నాయకురాలు, తొలిసారి …
Read More »ఎస్సై అరెస్టు: టపాసులు కాల్చి జనం సంబరాలు!
అవినీతి.. అడుగడుగునా చేతులు తడపాల్సిందే. పనికావాలన్నా.. మాట వినాలన్నా.. నోట్ల కట్టలు చేతులు మారాల్సిందే. ఇదీ.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉన్న పోలీసు స్టేషన్లలో కనిపిస్తున్న అవినీతి భూతం. ఇప్పటి వరకు అనేక వందల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే.. తాజాగా మెదక్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన ఇప్పటి వరకు జరిగిన అన్ని ఘటనలకు పరాకాష్ఠగా మారింది. అవినీతి అనకొండగా మారిన జిల్లాలోని టెక్మాల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ …
Read More »తమిళనాడులో ‘బీహార్ గాలి’: మోడీ
రాజకీయ విశ్లేషకులు ఊహించిందే జరిగింది. తమిళనాడులో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఖచ్చితంగా ఎన్నికల వ్యూహాన్ని ఆవిష్కరిస్తారని విశ్లేషకులు అంచనా వేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ఆయన పర్యటన పెట్టుకోవడం కూడా కీలక వ్యూహమేనని చెప్పారు. దీనిని నిజం చేసినట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ.. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే సాధించిన ఘన విజయాన్ని ప్రస్తావించారు. అంతేకాదు.. ఎన్నికలకు చాలా ముందే.. తమిళనాడు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates