తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ఎముకలు కొరికే చలిలో సైతం వాడీవేడిగా కొనసాగుతున్నాయి. పలు అంశాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి వచ్చే సభ్యులకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అసెంబ్లీకి వచ్చే ముందు సభ్యులకు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని హరీష్ …
Read More »విజయ్ మాల్యా ఆస్తులు అమ్మేశాం: కేంద్రం
ఆర్థిక నేరస్తుడు.. ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకున్న ప్రముఖ వ్యాపారవేత్త.. కింగ్ ఫిషర్ వ్యవస్థాపకుడు.. విజయ్ మాల్యా ఆస్తులు అమ్మేసినట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన ప్రకటన చేసింది. బుధవారం లోక్‌సభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. విజయ్ మాల్యా.. ఆర్థిక నేరాలపై పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయని తెలిపారు. వివిధ బ్యాంకులకు ఆయన ఎగవేసిన విషయం వాస్తవమేనని తెలిపారు. ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా ఆస్తులను అమ్మేసి.. …
Read More »రోడ్డెక్కిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో చిత్రమైన రాజకీయం తెరమీదికి వచ్చింది. అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన నాయకులు మంత్రులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. అంతేకాదు.. పాదయాత్ర కూడా చేశారు. నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్‌భవన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. భారీ బ్యానర్లతో నాయకులు, మంత్రులు ముందుకు కదలిలారు. ఈ పాదయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఇతర మంత్రులు కూడా హాజరయ్యారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ప్రముఖ పారిశ్రామిక …
Read More »జగన్ పాలనపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీ అధినేత జగన్ పాలనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో 4 వేల కోట్ల రూపాయలను నష్టపరిచారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును కూడా ఇష్టానుసారం సొంతానికి వాడేసుకున్నారని తెలిపారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకం కింద.. రాష్ట్రానికి 4 వేల కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. అయితే.. ఆ …
Read More »చంద్రబాబు.. నమ్మకాన్ని వమ్ము చేస్తున్న తమ్ముడు!!
టీడీపీ తరఫున తొలిసారి విజయం దక్కించుకున్న కొలికపూడి శ్రీనివాస్‌కు ప్రత్యేకత ఉంది. ఆయనకు విషయ పరిజ్ఞానం ఎక్కువని అంటారు. ఏ విషయంపైనైనా ఆయన ఆలోచించి.. అధ్యయనం చేసి.. స్పందిస్తారన్న మంచి పేరు కూడా ఉంది. అమరావతి రాజధాని విషయంలో ఆయన వ్యవహరించిన తీరు.. అక్కడి రైతులకు అండగా ఉన్న తీరు వంటివి ఆయనను హీరోను చేశాయి. ఈ క్రమంలోనే కొలికపూడి చంద్రబాబుకు చేరువయ్యారు. అంతేకాదు.. తాజాగా ఈ ఏడాది జరిగిన …
Read More »టీడీపీలో మరో పవర్ సెంటర్ అతడే..?
టీడీపీలో ఇప్పుడు ఒక పేరు తరచూ వినిపిస్తోంది. ఆ పేరు 2014లో పార్టీ విజయం సాధించినప్పుడూ వినిపించింది.. ఇప్పుడు 2024 ఎన్నికల్లో గెలిచాక కూడా వినిపిస్తోంది. సహజంగానే తెలుగుదేశం ప్రభుత్వం అంటే వినిపించే పేర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆయన తనయుడు నారా లోకేష్ పేర్లు మాత్రమే.. ఇప్పుడు మూడో పవర్ సెంటర్ కూడా టీడీపీలో వచ్చిందన్న గుసగుసలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఆ పేరుపై పార్టీ మంత్రులు, …
Read More »గిరిజనుల డోలీ మోతలకు బాబు – పవన్ చెక్!
చంద్రయాన్ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసిన దేశంగా భారత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు లేని దేశంగా కూడా విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ కోవలోనే ఆంధ్రప్రదే్శ్ లోని గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల కోసం డోలీలే గిరిజనులకు గతి. అయితే, గిరిజనులకు ఆ దుస్థితి తప్పించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నడుం బిగించారు.ఏపీలో డోలీల మోతకు …
Read More »టీడీపీలోకి ఆళ్ల నాని.. ముహూర్తం రెడీ!
వైసీపీ మాజీ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజకీయం యూటర్న్ తీసుకుంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన నాని.. ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని చెబుతూ. ఎన్నికలు జరిగిన రెండు మాసాలకే సంచలన ప్రకటన చేశారు. ఇదే సమయంలో వైసీపీకి కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే.. అనుకున్నట్టుగా అయితే.. ఆయన వ్యవహరించలేదు. మళ్లీ రెండు మాసాలు ముగిసే సరికి …
Read More »బీఆర్ఎస్ చేసింది.. కాంగ్రెస్ చేయకపోతే రోడ్డెక్కుతాం: ఒవైసీ
తెలంగాణ అసెంబ్లీలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు వ్యవహారం కాక రేపింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంటును ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చెల్లించడం లేదని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ నిలదీశారు. విద్యార్థులపై రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ అప్పటి ప్రభుత్వం బకాయిలు పెట్టిందని తెలిపారు. వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్పారు. అయితే.. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం …
Read More »లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లు
ఒకే దేశం-ఒకే ఎన్నికల బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్.. మంగళవారం జమిలి ఎన్నికల బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 129వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బిల్లును సభలో ప్రవేశ పెడుతున్నట్టు తెలిపారు. దేశంలో ఒకే సారి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఖజానాపై భారం తగ్గుతుందని.. అదేవిధంగా పాలనా వ్యవస్థల …
Read More »కూటమి మంత్రుల పనితీరుపై నివేదిక రెడీ.. !
కూటమి ప్రభుత్వంలో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు నివేదిక రెడీ చేసుకున్నారని సమాచారం. సచివాలయంలో ఏ శాఖ ఉన్నతాధికారిని కలిసినా.. నివేదిక రెడీ అయిందనే చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. 100 రోజుల్లోనే మంత్రులకు సంబంధించిన నివేదికను విడుదల చేస్తామని.. మంత్రుల పనితీరుపై మధనం చేస్తామని అప్పట్లో చంద్రబాబు చెప్పారు. అయితే.. 100 రోజుల సమయంపై మంత్రులు ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలు కుప్పకూలాయని …
Read More »ప్రజా సమస్యలపై చర్చ ఏది?
తెలంగాణ అసెంబ్లీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం చర్చల మధ్య తీవ్ర అభ్యంతరాలతో ముగిసింది. సభకు సంబంధించిన రోజులను నిర్ణయించాల్సిన ఈ సమావేశం, విపక్షాల తీవ్ర వ్యతిరేకతతో నిరర్థకంగా ముగిసింది. ముఖ్యంగా బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు సమావేశం మధ్యలోనే వాకౌట్ చేయడం వివాదానికి దారితీసింది. సభను తక్కువ రోజులకే పరిమితం చేయడంపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారనే విషయంపై స్పష్టత …
Read More »