కాపు రిజర్వేషన్లకు వైసీపీ కట్టుబడి ఉందని పాదయాత్ర సందర్భంగా నాటి ప్రతిపక్ష నేత నేటి ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాపుల రిజర్వేషన్లకు వైసీపీ పూర్తి మద్దతునిచ్చినందుకే తుని రైలు దహనం ఘటనలో వైసీపీ నేతలను ఇరికించారని కూడా జగన్ గతంలో ఆరోపించారు. కాపులకు అండగా నిలుస్తానని, బీసీలకు అన్యాయం జరగకుండా…కాపుల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నానని కూడా జగన్ చెప్పారు. అయితే, అధికారంలోకి వచ్చి ఏడాది …
Read More »గ్రేటర్ హైదరాబాద్‌లో మళ్లీ లాక్ డౌన్ పెట్టాలా? వద్దా?
కేసీఆర్ మాట్లాడినా వ్యూహమే. మాట్లాడకపోయినా వ్యూహమే. ఆయన అధికారికంగా ఏదైనా ప్రకటన చేసినా దానికో లెక్క ఉంటుంది. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్ విషయంలో ఆయన వైఖరి లక్షలాది మందిని బుక్ చేసేలా ఉందంటున్నారు. ఇంతకీ ఎందుకు ఆ స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే….జూన్ 28న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్‌లో మళ్లీ లాక్ డౌన్ విధిస్తే పాజిటివ్ …
Read More »రఘురామకృష్ణం రాజు ఆత్మ వేరే పార్టీలో ఉంది
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఖరి ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రఘురామకృష్ణరాజుకు విజయసాయిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్‌హెడ్‌పై షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. షోకాజ్ కు సమాధానమిచ్చే క్రమంలో…వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్న పేరు వైసీపీ వాడకూడదన్న వాదనను రఘురామ తెరపైకి తెచ్చారు. అంతేకాకుండా, తనకు వైసీపీ శ్రేణుల నుంచి ప్రాణహాని ఉందని… కేంద్ర …
Read More »జగన్ ని ఆకాశానికెత్తేసిన పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. పవన్ సందర్భానుసారంగా గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో పాటు మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏడాది కాలంగా వివిధ అంశాల్లో వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని మండిపడుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన స్వయంగా సీఎంను మెచ్చుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్‌ను మెచ్చుకోవడానికి కారణం అంబులెన్స్‌లు. రెండురోజుల క్రితం వెయ్యికి పైగా 104, 108 అంబులెన్స్ వాహనాలను జగన్ …
Read More »ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణానికి డేట్ ఫిక్స్?
ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవి వెంకటరమణలు ఇద్దరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ రెండు ఖాళీల్ని ఎప్పుడు భర్తీ చేస్తారు? ఎవరికి కొత్త మంత్రులుగా అవకాశం లభిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏడాది పాలనతో దూసుకెళుతున్న జగన్ సర్కారు.. మహమ్మారి లాంటి విపత్తు వేళలోనూ.. తనదైన శైలిలో పాలనపై ముద్ర వేస్తున్నారు. మహమ్మారికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోజగన్ …
Read More »ఇందుకు కదా చంద్రబాబును విమర్శించేది ?
రాజకీయాలన్నాక విమర్శలు చేయాలి. కానీ.. చేసేవి ప్రజల్ని ప్రభావితం చేసేలా ఉండాలి. అంతేకాదు.. ఇదెక్కడి గోలండి? ప్రభుత్వం చేసే ప్రతి పనిని అదే పనిగా విమర్శించటం మినహా మరింకేమీ పని ఉండదా? అన్న భావన కలుగక కూడదు. ప్రభుత్వం చేస్తున్న పనుల మీద ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత.. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తే ప్రయోజనం ఉంటుంది. ఆ విషయాన్ని వదిలేసి.. నిద్ర లేచింది మొదలు పడుకునే …
Read More »అమరావతి – ఉద్యమంలా కదులుతున్న ఎన్నారైలు
నిర్విరామంగా సాగుతున్న రైతుల అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. 200 రోజులు పూర్తి చేసుకుంటున్న అమరావతి సాధన ఉద్యమానికి అండగా ప్రపంచంలో వివిధ దేశాల్లో ఎన్నారైలు ఏకమై సంఘీభావం తెలుపుతున్న సంగతి తెలిసిందే. ముందు ఒక్క అమెరికాలో కొన్ని ప్రముఖ నగరాల్లో సంఘీభావంగా నిరసన తెలుపుదాం అని కోమటి జయరాం ఆధ్వర్యంలో కొందరు సంకల్పించారు. అయితే… తర్వాత 200 రోజులుక చిహ్నంగా 200 నగరాల నుంచి నిరసన తెలిపితే బాగుంటుందని …
Read More »కేసీఆర్ కు కొత్త తలనొప్పిగా విజయసాయి ట్వీట్
పోలిక మానవ నైజం. అందునా రాజకీయాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. ఏదైనా విషయంలో ఒక రాష్ట్రం విజయం సాధించిన వెంటనే.. రెండో రాష్ట్ర పాలకుల పని తీరుతో పోల్చటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. ఒకేలాంటి అంశాల్ని ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలా డీల్ చేస్తున్నారన్న అంశంపైనా ఆసక్తి పెరిగింది. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారిని కంట్రోల్ చేసే విషయంలో ఏ దేశానికి ఆ …
Read More »లక్షమందితో జనసేన యాక్షన్ ప్లాన్
జనసేన పార్టీకున్న అతి పెద్ద బలహీనత.. క్షేత్ర స్థాయిలో బలం లేకపోవడం. ఒక రాజకీయ పార్టీకి అత్యంత అవసరమైంది అదే. క్షేత్ర స్థాయిలో నిర్మాణం జరగకుండా.. ఉన్నత స్థాయిలో ఎంత చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. పార్టీకి ఊపు వచ్చినా.. గ్రౌండ్ లెవెల్లో కమిటీలు ఏర్పాటు చేసి, కార్యకర్తల్ని మోటివేట్ చేయడం.. తరచూ సమావేశాలు నిర్వహించడం.. ఉన్నత స్థాయి నాయకత్వంతో సంబంధం లేకుండా క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు చేపట్టడం.. జనాలతో …
Read More »రఘురామ కొత్త ట్విస్టు.. అనర్హత అడ్డుకోవాలంటూ హైకోర్టుకు
గడిచిన కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో ట్విస్టు ఇచ్చారు. పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యలు చేయటంతో పాటు.. పార్టీ లైన్ కు భిన్నంగా ఆయన వ్యవహారశైలి ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి పేరిట ఒక నోటీసు అందుకున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. పార్టీకి చిరాకు …
Read More »రౌడీషీటర్లు రెచ్చిపోయి 8 మంది పోలీసుల్ని కాల్చేశారు
ఉత్తరప్రదేశ్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించే సీన్ ఇప్పుడు వాస్తవంగా చోటు చేసుకుంది. దేశంలో ఇప్పటివరకూ ఎప్పుడూ లేని రీతిలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున చోటు చేసుకున్న వైనాన్ని యూపీ పోలీసులు మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కాన్పూరు శివారులో జరిగిన ఈ ఘటన పెనుసంచలనంగా మారింది. కాన్పూరు శివారులోని …
Read More »ఆ 59 యాప్స్‌పై నిషేధం.. 45 వేల కోట్ల నష్టం?
ఇండియాలో చైనా ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లను ఆపితే ఆ దేశానికి నష్టం కానీ.. చైనా యాప్‌లను నిషేధిస్తే వచ్చే నష్టమేంటి అన్నది చాలామంది వేస్తున్న ప్రశ్న. కానీ యాప్‌ల ద్వారా వచ్చే ఆదాయం గురించి తక్కువ అంచనా వేస్తే తప్పే అవుతుంది. ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ యాప్‌గా ఉన్న టిక్ టాక్‌తో పాటు మరో పాపులర్ యాప్ ‘హలో’.. ఇంకొన్ని చైనా యాప్‌ల యాజమాన్య సంస్థ ‘బైట్ డ్యాన్స్’.. …
Read More »