Political News

జగన్ కు అంత ధైర్యముందా ?

తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేయగలరా ? ఇపుడిదే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. పెట్రోల్, డీజిల్ పై తన స్టాండ్ ఏమిటనే విషయాన్ని కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. పెట్రోలుపై రు. 5, డీజల్ పై రు. 10 తగ్గించిన కేంద్రం ఇదే దామాషాలో రాష్ట్రాలను కూడా తగ్గించాలని చెప్పింది. దాంతో వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి. నిజానికి గడచిన ఏడాదికాలంగా ఇంధన ధరలను పెంచేస్తున్న …

Read More »

రాజ‌కీయ ఆట‌లో రైతులు బ‌లి

దేశానికి అన్నం పెట్టే రైత‌న్న‌కు అడుగ‌డుగునా క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. త‌రాలు మారినా.. ప్ర‌భుత్వాలు మారినా.. పాల‌కులు మారినా.. రైతుల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పులు రావ‌డం లేదు. వాళ్ల క‌ష్టాలు.. ఇబ్బందులు.. స‌మ‌స్య‌లు అలాగే ఉన్నాయి. పంట పండించేందుకు శ్ర‌మించే రైతులు.. దాన్ని అమ్ముకునేందుకు అంతుకుమించి క‌ష్ట‌ప‌డే ప‌రిస్థితులు దాపురించాయి. దేశం అభివృద్ధి వైపు ప‌రుగులు పెడుతున్నా.. సాంకేతిక విప్లవం కొత్త పుంత‌లు తొక్కుతున్నా.. అన్న‌దాత‌ల దుస్థితిలో మాత్రం …

Read More »

ఈట‌ల‌కు నోటీసులు.. వెంటాడుతున్న కేసీఆర్‌!

రామేశ్వ‌రం వెళ్లినా.. శ‌నేశ్వ‌రం త‌ప్ప‌లేద‌న్న‌ట్టుగా ఉంది.. మాజీ మంత్రి, ప్ర‌స్తుత బీజేపీ నాయ‌కుడు.. ఈటల రాజేంద‌ర్ ప‌రిస్థితి. గ‌త మే నెల‌లో.. ఎలాంటి ప‌రిస్థితి ఎదురైందో.. ఇప్పుడు మ‌ళ్లీ అదే రిపీట్ అయింది. తాజాగా.. ఈట‌ల‌కు.. ఆయ‌న ఆధ్వ‌ర్యంలోని జ‌మున హ్యాచ‌రీస్‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసింది. నిజానికి గ‌తంలోనే మెద‌క్ క‌లెక్టర్ నోటీసులు ఇచ్చారు. అయితే.. ఇవి చెల్ల‌వంటూ.. తెలంగాణ హైకోర్టు చెప్ప‌డంతో.. అప్ప‌టి నుంచి మౌనంగా …

Read More »

అందుకే ఆర్టీసీ రేట్లు ఇప్పుడే పెంచ‌లేదా?

తెలంగాణ‌లో ఆర్టీసీ టికెట్ రేట్లు పెంచేందుకు కొంత‌కాలంగా ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఆర్టీసీ న‌ష్టాల్లో ఉంద‌ని దాన్ని గ‌ట్టెక్కించాలంటే ధ‌ర‌లు పెంచ‌క త‌ప్ప‌ద‌ని ర‌వాణా మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్, ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, ఎండీ స‌జ్జ‌నార్ ఉన్న‌త స్థాయి స‌మీక్ష స‌మావేశం నిర్వించారు. ధ‌ర‌ల పెంపు ప్ర‌తిపాద‌న‌ను సీఎం కేసీఆర్‌కు అందించారు. దీంతో ఆదివారం నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆర్టీసీ టికెట్ రేట్ల పెంపుపై కేసీఆర్ …

Read More »

ఏపీ సర్కార్‌పై నిప్పులు చెరిగిన బీజేపీ

వైసీపీ ప్రభుత్వ పాలనపై బీజేపీ నిప్పులు చెరిగింది. బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రిపై నాయ‌కులు చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ఏపీకి చెందిన ముఖ్య బీజేపీ నేత‌.. సత్య కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ అసమర్థత ప్రజలకు శాపంగా మారిందన్నారు. జగన్ వచ్చాక రాజధానిపై స్పష్టత లేదన్న ఆయన.. పెట్టుబడుల జాడ లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అస‌లు ప్ర‌భుత్వం ఉందా? అనే సందేహాలు కూడా వ్యక్త‌మ‌వుతున్నాయ‌ని …

Read More »

బాబు.. గంటాకు మధ్య దూరానికి అసలు కారణం ఇదేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద ఆ పార్టీకి చెందిన నేతలు మాత్రమే కాదు కార్యకర్తలు.. అభిమానులు తరచూ ఒక తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉండే బాబు.. పవర్ చేజారిన తర్వాత మాత్రం మరోలా మాట్లాడుతుంటారని చెబుతారు. పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ జెండా పట్టుకున్న వారికే తాను ప్రాధాన్యత ఇస్తానని.. పదవులు ఇస్తానని ఆశ చూపే ఆయన.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎవరెవరికో …

Read More »

ఆయ‌న‌తో 30 ఏళ్ల వైరం.. బాబు గెలిచి నిలుస్తారా ?

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబును చివ‌ర‌కు ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో కూడా గ‌ట్టిగా టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేత‌లు. గ‌త ఎన్నిక‌ల్లోనే బాబు కుప్పంలో చావు త‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగా కేవ‌లం 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక ఇటీవ‌ల జ‌రిగిన స‌ర్పంచ్ ఎన్నిక‌లు, జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ చిత్తు చిత్తు అయ్యింది. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డితో పాటు చిత్తూరు ఎంపీ రెడ్డ‌ప్ప …

Read More »

కేంద్రంతో ఢీ.. కేసీఆర్ ఫైర్‌!

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢీ అంటే ఢీ అంటూ.. ఆయ‌న స‌వాళ్లు రువ్వారు.. టార్గెట్లు పెట్టారు. తాము ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తూ.. ఊరుకున్నామ‌ని.. ఇక‌పై.. కొట్లాటే షురూ! అని ప్ర‌క‌ట‌న చేశారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌పై నిప్పులు చెరిగారు. కేంద్రం అన్ని విధాలా ఈ దేశాన్ని నాశ‌నం చేస్తోంద‌న్న కేసీఆర్.. రైతులు.. ప్ర‌జ‌లు.. సామాన్యుల వ‌ర‌కు మోసం …

Read More »

కలిసిపోతే ఓ పనైపోతుంది కదా ?

ఇపుడిదే అంశంపై రాజకీయ పార్టీల్లో చర్చ జోరుగా సాగుతోంది. తొందరలో జరగబోయే 12 మున్సిపాలిటీలు, కొన్ని జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో పాటు పంచాయితీలు, వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన మధ్య అధికారికంగా పొత్తులు ఉంటాయా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే నిజానికి ఈ మధ్యనే స్ధానిక సంస్ధల ఎన్నికలు అయిపోయాయి. అయితే అప్పట్లో ఎన్నికలు జరగని వాటికి వివిధ కారణాలతో బై ఎలక్షన్ అవసరమైన వాటికి ఇపుడు ఎన్నికలు …

Read More »

సిద్ధూ ష‌ర‌తులు

Navjot Singh Sidhu

పంజాబ్‌లో అధికార పార్టీ కాంగ్రెస్‌కు కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిన‌ట్లేన‌ని చెప్పాలి. వ‌చ్చే ఏడాది ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇటీవ‌ల పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు ఆందోళ‌న రేకెత్తించాయి. అమ‌రీంద‌ర్ సింగ్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌పుడు పీసీసీ అధ్య‌క్షుడు న‌వ్‌జ్యోత్ సింగ్ సిద్ధూతో మొద‌లైన విభేదాలు చిలికి చిలికి గాలివాన‌లా మారిన సంగ‌తి తెలిసిందే. చివ‌ర‌కు అమ‌రీంద‌ర్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. చ‌ర‌ణ్‌జీత్ సింగ్ చ‌న్నీని అధిష్ఠానం …

Read More »

జ‌య కూతురిని నేనే.. ఆధారాలూ ఉన్నాయ్‌..

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత.. విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు.. ఆశ్చ‌ర్య‌కర సంఘ‌ట‌న లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఆమె మ‌ర‌ణించి.. ఏళ్లు గ‌డిచినా.. ఇప్ప‌టికీ.. కొన్ని కొన్ని విష‌యాలు జ‌య చుట్టూనే గిరిగిర లాడుతున్నాయి. ముఖ్యంగా వేల కోట్ల రూపాయ‌ల జ‌య సంప‌ద‌ను.. సొంతం చేసుకు నేందుకు ప‌లువురు ప్ర‌య‌త్నించిన ఉదంతాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఆమెకు నేనే కుమార్తెనంటూ.. ఇప్ప‌టికే ప‌లువురు తెర‌మీదికి వ‌చ్చారు. వీరిలో ఒక‌రు ఏకంగా ఆధారాలు స‌మ‌ర్పిస్తే.. …

Read More »

టీఆర్‌ఎస్ లో హరీష్ రావుకు గడ్డుకాలం!

హుజూరాబాద్.. ఈ ఎన్నిక టీఆర్ఎస్‌కు గట్టి షాకే ఇచ్చింది. తెలంగాణా రాజకీయాల్లో మకుటం లేని మహారాజుగా ఆకాశంలో విహరిస్తున్న కేసీఆర్‌ను ఈ ఎన్నిక నేలపైకి దింపిందంటే అతిశయోక్తి కాదు. టీఆర్ఎస్ భవిష్యత్తుపైనే ప్రశ్నలు లేవనెత్తిన ఎన్నిక ఇది. ఇక టీఆర్ఎస్ తరువాత అంతటి మాస్ నాయకుడిగా గుర్తింపు ఉన్న హరీష్ రావు కూడా ఈ ఎన్నికల తరువాత గడ్డు పరిస్థితులే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బీజేపీని ఓడించేందుకు రెండు సార్లు బరిలోకి …

Read More »