గత ఏడాది ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్నప్పటికీ.. దాన్నుంచి త్వరగానే కోలుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తోంది జనసేన పార్టీ. కరోనా విజృంభిస్తున్న వేళ ఏపీలో జనసేన నాయకులు, కార్యకర్తలు చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసలందుకుంటున్నాయి. ఎన్నికలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో కూడా జనసేన మద్దతుదారులు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కరోనాపై అవగాహన పెంచడానికి, సేవా కార్యక్రమాలకు, పార్టీ విధానాల్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు.. అలాగే అధికార పార్టీని ఎదుర్కొనేందుకు …
Read More »‘భారతదేశంలో ఆల్రెడీ 2 కోట్ల మందికి కరోనా సోకి ఉంటుంది’
కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనకు టెస్టులు చేస్తున్నాం కాబట్టి బయటపడింది. మనం ఊహించినదానికంటే ఎక్కువగా ఇండియాలో కరోనా ఉంది. 30-40 రోజుల నుంచి కేసులు పెరుగుతూ వస్తున్నాయి. టెస్టులు చేస్తున్నాం కాబట్టి ఇపుడు బయటపడుతున్నాయి. దీనిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కరోనా కర్నూలులో నాలుగో దశలో ఉంది. నాకు తెలిసి దేశంలో కరోనా సుమారు 2 కోట్ల మందికి సోకి …
Read More »డాక్టర్ చేతులు వణికి.. కిమ్ పరిస్థితి విషమం?
కిమ్ జాంగ్ వున్.. ఈ ఉత్తర కొరియా నియంత గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పరమ దుర్మార్గుడు, కఠినాత్ముడిగా పేరున్న కిమ్ అనారోగ్యంతో చనిపోయినట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొందరేమో అతను బ్రెయిన్ డెడ్ అయ్యాడని.. కోమాలో ఉన్నాడని.. బతికి ఉన్నా చచ్చినట్లే అని అంటున్నారు. ఇంకొందరేమో అతడి ప్రాణాలు పోయాయని చెబుతున్నారు. దీనిపై ఉత్తర కొరియా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కిమ్ గురించి …
Read More »లాక్ డౌన్ 2.0 ఏం చేద్దాం? జగన్ కు షా ఫోన్
కరోనా కట్టడి కోసం మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 దేశం మొత్తం లాక్ డౌన్ విధించాలని ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 24న సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కోరలు పీకేందుకు స్వీయ గృహనిర్బంధం ఒక్కటే మార్గమని మోడీ ఇచ్చిన పిలుపునకు దేశంలోని అన్ని రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మద్దతు తెలిపాయి. ఏప్రిల్ 14 తర్వాత కరోనా ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ …
Read More »ఏపీలో ఓ ఎంపీ కుటుంబంలో నలుగురికి కరోనా?
ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. కరోనా వ్యాపిస్తోన్న తొలినాళ్లలో ఏపీలో పరిస్థితి అదుపులో ఉంది. ఢిల్లీ లింక్ బయటపడ్డ తర్వాత ఏపీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 81 పాజిటివ్ కేసులు నమోదు కాగా…మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1097కు చేరింది. ఇక, ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల జాబితాలో టాప్ ప్లేసులో ఉన్న కర్నూలులో కరోనా వైరస్ …
Read More »తెలంగాణలో అతి తక్కువ పాజిటివ్ కేసులు
మూడు రోజుల క్రితమే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యి క్రాస్ చేయటం ఖాయమనుకున్న అంచనాలు తప్పు అయ్యాయి. శనివారం రాత్రి నాటి అతి తక్కువ కేసులు నమోదు కావటంతో వెయ్యి కేసులకు మరో పది కేసులు నమోదైతే తప్పించి ట్రిపుల్ ఫిగర్ ను దాటే అవకాశం ఉంది. ఆ మధ్యన పెద్ద ఎత్తున కేసులు నమోదైన దానికి భిన్నంగా గడిచిన మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య …
Read More »పేకాట పుణ్యం.. 24 మందికి కరోనా
సూర్యా పేటలో కరోనా వైరస్ వ్యాప్తి అనూహ్యంగా పెరగడానికి ఓ మహిళ కారణం కావడం.. ఆమెకు అష్టాచెమ్మా ఆడే అలవాటు ఉండటం వల్ల 30 మందికి పైగా కరోనా బారిన పడటం తెలిసిన సంగతే. సంచలనం రేపిన ఈ ఘటన తర్వాత తాజాగా విజయవాడలో ఓ వ్యక్తి సరదా 24 మందిని కరోనా బారిన పడేలా చేసింది. ఓ వ్యక్తి లాక్ డౌన్ టైంలో కరోనా అంటించుకుని.. పేకాట ఆడటం …
Read More »స్నేహితుడ్ని ఇరుకున పడేస్తున్నారేంటి అక్బరుద్దీన్
సంక్షోభ సమయాల్లో అండగా నిలవాల్సిన స్నేహితుడు.. అందుకు భిన్నంగా విమర్శలు చేయటం ఏమిటన్న ఆశ్చర్యం పలువురిలో వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి మధ్యనున్న బంధం గురించి అందరికి తెలిసిందే. అసద్ తనకు స్నేహితుడని.. మజ్లిస్ తనకు మిత్రుడన్న మాటను పదే పదే చెబుతుంటారు కేసీఆర్. అలాంటి స్నేహితుడి మీద ఓవైసీ బ్రదర్స్ స్పందించే తీరు మాత్రం భిన్నంగా ఉంటుందనే చెప్పాలి. కొన్ని …
Read More »ఏపీలో కరోనా కేసులు@1016
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి నెల రోజులు పూర్తయింది. లాక్ డౌన్ విధించినపుడు దేశవ్యాప్తంగా వందల్లో ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు వేలల్లోకి వెళ్లిపోయింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 25వ తేదీ నాటికి 24,506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ కట్టుదిట్టంగా చేపట్టినప్పటికీ నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే, చైనా, ఇటలీ, అమెరికా వంటి దేశాలతో పోల్చుకుంటే ప్రమాదకర స్థాయిలో …
Read More »శభాష్ గంభీర్.. పనిమనిషికి అంత్యక్రియలు
భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్మన్ గౌతమ్ గంభీర్ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి. అతడికి దేశభక్తి సామాజిక సేవా దృక్పథం కొంచెం ఎక్కువే. ఈ విషయంలో అనేకసార్లు తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఇప్పుడు అతను ఓ గొప్ప పనితో వార్తల్లో నిలిచాడు. తన ఇంట్లో పని మనిషిగా ఉన్నసరస్వతి పత్రా అంత్యక్రియలను తనే నిర్వహించాడు ఆరేళ్లుగా గంభీర్ ఇంట్లో పని చేస్తున్న ఆమె గత కొన్ని రోజులుగా …
Read More »కలకలం… మోదీ స్టేట్ సిటీలు సహా ఐదు నగరాల్లో కరోనా విలయం
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్… భారత్ లో అంతకంతకూ తన విస్తృతిని పెంచేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 23 వేలకు పైగా నమోదు కాగా… దేశంలోని పలు కీలక నగరాల్లో వైరస్ విస్తృతి ఓ రేంజిలో ఉంది. ఇలా కరోనా విస్తృతి శృతి మించిన నగరాల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గంగా పేరొందిన అహ్మదాబాద్ సహా గుజరాత్ లోని సూరత్ కూడా చేరిపోయాయి. …
Read More »ఏపీలో కరోనా లెక్కల్లో గందరగోళం
ఏపీలో కరోనా కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతుండడం కలవరపెడుతోంది. ఓ పక్క ప్రతి రోజు నిర్వహించే టెస్టుల సామర్ధ్యం పెంచిన ఏపీ సర్కార్…మరిన్ని టెస్టులు చేసేందుకు సిద్ధపడుతున్నామని చెబుతోంది. అయితే, పాజిటివ్ కేసుల సంఖ్య విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఎం డ్యాష్ బోర్డు అంకెలకు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి లెక్కలకు పొంతన లేదని విమర్శలు వస్తున్నాయి. విమర్శలే కాదు…ఆ విమర్శలకు తగ్గట్లుగా గణాంకాలు కూడా …
Read More »