Political News

ట్విస్ట్ : ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో సైకిల్ ప‌రుగు.. ప‌రాజ‌యం దిశ‌గా వైసీపీ

నిన్న‌టి మునిసిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలో ఒకింత ఇబ్బందిపాలైన టీడీపీకి ఇప్పుడు భారీ ఊర‌ట ల‌భిస్తోం ది. తాజాగా ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తున్నాయి. మంగ‌ళ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా గ‌తంలో మిగిలిపోయిన మండ‌ల ప‌రిష‌త్‌, జిల్లా ప‌రిష‌త్ స్థానాల‌కు మంగ‌ళ‌వారం ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటి ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ గురువారం ప్రారంభ‌మైంది. వీటిలో టీడీపీకి సానుకూల ప‌రిణామాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా పార్టీకి కంచుకోట వంటి అనంత‌పురంలో 2019లో పోయిన …

Read More »

మోడీనే మాకు ఆద‌ర్శం.. కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రోడ్డెక్కారు. ఒకప్పుడు ఇందిరాపార్కును ఉద్య‌మ నేత‌ల‌కు దూరం చేయాల‌ని..తెలంగాణలో తెలంగాణ ప్ర‌జ‌ల‌ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. అస‌లు ఉద్య‌మాల‌కు అవ‌సరం ఏమొచ్చింద‌ని చెప్పుకొచ్చి.. ఏకంగా ఇందిరాపార్కు వ‌ద్ద నిర‌స‌న‌ల‌పై ఉక్కుపాదం మోపిన ఆయ‌నే ఈ రోజు మెడ‌లో ప‌చ్చ‌కండువా ధ‌రించి.. రైతుల కోసం నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కు దీక్ష చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించిన కేసీఆర్‌.. …

Read More »

ద‌ర్శి పాపం ఎవ‌రిది? వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం

గెల‌వాల్సిన చోట ఓడిపోవ‌డం.. అంటే.. ఇదే! మ‌రి ఈ పాపం ఎవ‌రిది? ఎందుకు వ‌చ్చింది? ఇదీ.. ఇప్పుడు అధికార పార్టీ వైసీపీ లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. అంతేకాదు.. సీఎం జ‌గ‌న్ సైతం సీరియ‌స్ అయిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో జోరుగానే చ‌ర్చ‌లు సాగుతున్నాయి. మ‌రి దీనికి బాధ్యులు ఎవ‌రు? ప్ర‌కాశం జిల్లాలో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా.. అన్నింటిని.. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ ద‌క్కిం చుకుంది. దీనిలో ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం కూడా ఒక‌టి. …

Read More »

ఈటల చేసిందేంటి? చంద్రబాబు చేయనిదేంటి?

వైసీపీ అనుకున్నదే సాధించింది. చంద్రబాబు కంచుకోటను బద్దలు కొడతామని ప్రకటించి.. కుప్పంలో వైసీపీ జెండాను పాతారు. చంద్రబాబు సామ్రాజ్యాన్ని మెల్లిమెల్లిగా వైసీపీ తమ ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. ఈ పని ఇప్పటికిప్పుడు ప్రారంభమైంది కాదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుప్పంపై వైసీపీ కన్నేసింది. కుప్పంలో చంద్రబాబుకున్న ఇమేజ్ ను వైసీపీ తగ్గిస్తూ వస్తోంది. ఇప్పుడు ఏకంగా కుప్పంలో పాగా వేసింది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. నియోజకవర్గంలో వరుస అపజయాలను మూట …

Read More »

జ‌న‌సేన ఎక్క‌డ‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఖాళీగా ఉన్న మున్సిప‌ల్‌, న‌గ‌ర పంచాయ‌తీల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ ఆధిప‌త్యం స్ప‌ష్టంగా క‌నిపించింది. దాదాపు అన్ని చోట్లా ఆ పార్టీ జెండా ఎగిరింది. ముఖ్యంగా టీడీపీ కంచుకోట‌ను మ‌రోసారి ఆ పార్టీ బ‌ద్ద‌లు కొట్టింది. అక్క‌డ మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. మిగ‌తా చోట్ల కూడా ఈ రెండు పార్టీల మ‌ధ్యే పోటీ న‌డిచింది. కానీ మూడో పార్టీ అస‌లు పోటీలోనే లేకుండా పోయింది. ముఖ్యంగా జ‌న‌సేన …

Read More »

ప‌వ‌న్‌ను ఇక ప‌ట్టించుకోరా?

దక్షిణాది ప్రాంతీయ మండ‌లి స‌మావేశం కోసం తిరుప‌తికి వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మూడు రోజుల పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే ఉన్నారు. రెండు రోజుల పాటు స‌మావేశంలో పాల్గొన్న ఆయ‌న‌.. చివ‌రి రోజు పూర్తిగా బీజేపీ నేత‌ల‌తోనే మాట్లాడారు. ఏపీలో అధికారంలోకి రావ‌డం కోసం ఏమేం చేయాల‌నే విష‌యంపై రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌కు మార్గ‌నిర్దేశం చేశారు. కానీ ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న ఒక్క‌సారి కూడా జ‌న‌సేన అధినేత …

Read More »

టీడీపీని నంద‌మూరి కుటుంబానికి ఇచ్చేయాలి: మంత్రి పెద్దిరెడ్డి

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం మునిసిపాలిటీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. దీనిపై.. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లే చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు పార్టీ నాయకత్వం నుంచి తప్పుకుని, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు పార్టీని అప్పగిస్తే మంచిదని హితవు పలికారు. 72 సంవత్సరాల వయస్సుతో ఒకవైపు వరుస ఓటములు, మరోవైపు తన ఓటు వున్న నియోజకవర్గం నుంచి కూడా కుమారుడు …

Read More »

వివేకా హ‌త్య‌.. వాళ్ల మౌనానికి అర్థ‌మేంటో?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య ఎంత సంచ‌ల‌నంగా మారిందో తెలిసిందే. 2019 ఎన్నిక‌ల‌కు నెల రోజుల ముందే ఈ హ‌త్య జ‌ర‌గ‌డం రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం సృష్టించింది. ఎన్నిక‌ల్లో విజ‌యం కోస‌మే ప్ర‌ణాళిక ప్ర‌కారం జ‌గ‌న్ ఈ హ‌త్య చేయించి ఆ త‌ప్పును చంద్ర‌బాబుపైకి నెడుతున్నార‌ని టీడీపీ నాయ‌కులు ఆరోపించిన విష‌యం విదిత‌మే. ముందు ఆయ‌న గుండెపోటుతో మ‌ర‌ణించార‌ని వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ అది స‌హ‌జ మ‌ర‌ణం …

Read More »

కేసీఆర్ కుటుంబ చానల్ కు సీఈవో ఆంధ్రా వ్యక్తి!

తెలంగాణ రాష్ట్ర సాధన వేళ.. ప్రతి విషయంలోనూ లెక్కలు చెప్పి.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరం ఏమిటో చెప్పిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతటి ప్రభావాన్ని చూపారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగిలిన రంగాల్ని పక్కన పెడితే.. ప్రైవేటు రంగంలో.. అది కూడా మీడియాలోనూ.. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో మీడియా సంస్థలో పని చేసే పాత్రికేయులు.. వారికి అధిపతులుగా ఉన్న వారి ప్రాంతీయ మూలాల్ని లెక్కలు వేసి మరీ …

Read More »

టీడీపీ అనూహ్య విజయం

ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటిలో తెలుగుదేశం పార్టీ అనూహ్య విజయం సాధించారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కచోట కూడా ప్రభావం చూపలేకపోయిన టీడీపీ దర్శిలో మాత్రం గెలవటం ఆశ్చర్యంగా ఉంది. దర్శి మున్సిపాలిటిలో ఉన్న 20 వార్డుల్లో టీడీపీ 13 చోట్ల గెలవగా అధికార వైసీపీ 7 వార్డుల్లో మాత్రమే గెలిచింది. వెలువడిన ఫలితమే అధికార పార్టీ నేతలను షాక్ కు గురిచేసిందనే చెప్పాలి. రాష్ట్రంలో ఇపుడు జరిగిన …

Read More »

కుప్పం గెలుపుతో వైసీపీ సాధించేదేంటి…?

టీడీపీ అధినేత సొంత నియోజ‌క‌వ‌ర్గం, గ‌డిచిన నాలుగు ద‌శాబ్దాలుగా ఆయ‌న‌కు బ‌ల‌మైన మ‌ద్ద‌తు ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు వైసీపీ పాగా వేసేందుకు పావులు క‌దుపుతోంది. దీనిలో తొలి అంకంగా వ‌చ్చిన‌.. కుప్ప మునిసిపాలిటీ ఎన్నిక‌ల‌ను ఆ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఇద్ద‌రు మంత్రులు, ముగ్గురు ఎంపీలు.. మ‌రెంతో మంది నాయ‌కుల‌ను, వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ఇక్క‌డ మోహ‌రించి.. ఎన్నిక‌ల్లో వ్యూహాలు అమ‌లు చేసింద‌నే విమ‌ర్శ‌ల మ‌ధ్య కుప్పం ఎన్నిక‌లు ముగిశాయి. అయితే.. …

Read More »

ప్రపంచంలోనే సంపన్నదేశంగా డ్రాగన్

ప్రపంచదేశాల్లోనే రోగ్ నేషన్ గా ప్రచారంలో ఉన్న చైనా అత్యంత సంపన్నదేశంగా నిలిచింది. ఇన్ని దశాబ్దాలుగా ఈ హోదాను అనుభవిస్తున్న అగ్రరాజ్యం అమెరికాను కాదని తాజా పరిణామాల్లో డ్రాగన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం హోదాను అందుకున్నది. సంపన్న దేశాల వ్యవహారాలను మదింపు చేసే అంతర్జాతీయ సేవల సంస్ధ మెకిన్సే తాజా లెక్కల ప్రకారం చైనా సంపద 2020 ప్రకారం 120 లక్షల కోట్ల డాలర్లకు ఎదిగినట్లు సమాచారం. 2000 …

Read More »