ఎగ్జిట్ పోల్స్: పంజాబ్ పీఠంపై ఆప్‌

ఢిల్లీకి చేరువ‌లో ఉన్న పంజాబ్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోతోంద‌ని ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు తేల్చి చెప్పాయి. ఈ రాష్ట్రాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంటున్న‌ట్టు పేర్కొన్నాయి. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ క్రమంలో పంజాబ్‌లో ప్ర‌జ‌లు ఆప్ పార్టీకి భారీ మెజారిటీ క‌ట్ట‌బెట్టారని ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి. ముఖ్యంగా బీజేపీ నేత‌లు పెట్టుకున్న ఆశ‌లు ఇక్కడ ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు. మినీ సార్వత్రిక సమరంగా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. అంతకుముందే.. ఫలితాల ధోరణిని అంచనా వేస్తూ విశ్లేషిస్తూ ఎగ్జిట్ పోల్స్.. అధికారం ఎవరిదోనని చెప్పేస్తాయి.

సర్వేల ద్వారా ఓటర్ల నాడిని పసిగడతాయి. తాజాగా ఈ ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. పంజాబ్ విష‌యానికి వ‌స్తే.. అన్ని ఎగ్జిట్‌పోల్ స‌ర్వేలు.. కూడా ఇక్క‌డ ఆప్‌ పార్టీ ఏక‌ప‌క్షంగా అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి ఉంద‌ని.. హంగ్ ఏర్ప‌డే అవ‌కాశం లేద‌ని తేల్చి చెప్పాయి. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ అధికారం కోల్పోవ‌డం కాయ‌మ‌ని ఎగ్జిట్ పోల్ స‌ర్వే అంచ‌నా వేసింది. అయితే.. ప్ర‌ధాన పోటీ మాత్రం ఆప్‌-కాంగ్రెస్ ల మ‌ధ్యే ఉంది. ఈ ఫ‌లితాలు.. ఎలా ఉన్నాయంటే..

పంజాబ్లో స్థానాలు‌-117

ఏబీపీ – సీ ఓటర్
ఆప్ 51-61
కాంగ్రెస్ 22-28
అకాలీదళ్‌+ 20-26
బీజేపీ+ 7-13
ఇతరులు 1-5

యాక్సిస్ మై ఇండియా
ఆప్ 76-90
కాంగ్రెస్ 19-31
అకాలీదళ్‌+ 7-11
బీజేపీ+ 1-4
ఇతరులు 0-2

జన్‌ కీ బాత్
ఆప్‌ 60-84
కాంగ్రెస్‌ 18-31
అకాలీదళ్‌+ 12-19
బీజేపీ+ 3-7
ఇతరులు 0

ఇండియా టుడే
ఆప్‌ 76-90
కాంగ్రెస్‌ 19-31
అకాలీదళ్‌+ 0
బీజేపీ+ 0

పీ మార్క్
ఆప్‌ 62-70
కాంగ్రెస్‌ 23-31
అకాలీదళ్‌+ 16-24
బీజేపీ+ 1-3
ఇతరులు 1-3

ఆత్మసాక్షి
ఆప్‌ 34-38
కాంగ్రెస్‌ 58-61
అకాలీదళ్‌+ 18-21
బీజేపీ+ 4-5
ఇతరులు 0