ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈ రోజు సంచలనం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇందిరమ్మ మనవరాలు.. ప్రియాంక గాంధీ పేరు ఖాయమని తెలిసింది. మరికొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా బీజేపీ నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ నుంచి మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఈసారి ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ …
Read More »క్యాసినో ఆడించినట్టు నిరూపిస్తే.. ఆత్మహత్య చేసుకుంటా: కొడాలి
మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో తాను క్యాసినో ఆడించినట్లుగా రుజువు చేస్తే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా అని వ్యాఖ్యానించారు. క్యాసినో అంటే ఏంటో టీడీపీ నేత, చంద్రబాబు కుమారుడు లోకేశ్‌కు తెలుసని అన్నారు. తనకు చెందిన కల్యాణ మండపంలో కేసినో ఆడిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. వర్ల రామయ్య, బొండా ఉమా లాంటి వ్యక్తులను నిజనిర్ధారణకు పంపుతారా అని ప్రశ్నించారు. గుడివాడలో ఏదో …
Read More »చిరంజీవి-సీఎం జగన్‌లది చిట్‌చాటే.. చర్చ కాదు: పేర్ని నాని
ఏపీలో నెలకొన్న సినిమా టికెట్ల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని సినీ పెద్దలు గంపెడాశతో ఉన్న సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని వారి ఆశలపై నీళ్లు చల్లారు. చిరంజీవితో ముఖ్యమంత్రి జగన్ జరిపినవి సంప్రదింపులు కావని, కుశలప్రశ్నలు(చిట్ చాట్) మాత్రమేనని తేల్చేచారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం విస్మయానికి గురి చేసింది. వాస్తవానికి ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం ప్రభుత్వం, సినీ నిర్మాతల మధ్య అగాధాన్ని పెంచిన విషయం తెలిసిందే. …
Read More »జగన్ డేంజర్ గేమ్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకునే కొన్ని నిర్ణయాలు చూస్తే.. ఈయనేంటి కొరివితో తల గోక్కుంటున్నాడు అనిపిస్తుంది. సినిమా టికెట్ల ధరలు సహా చాలా విషయాల్లో అవనసరంగా జోక్యం చేసుకుని సమస్యలు కొని తెచ్చుకున్నట్లుగా కనిపిస్తుంది. కానీ తనను సినిమా వాళ్లు తగినంత గౌరవం ఇవ్వట్లేదన్న ఇగోతో ఇలా చేశాడో.. పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపంతో చేశాడో కానీ.. సినిమా టికెట్ల వ్యవహారం మీద అనవసర …
Read More »జగన్ దగ్గర కంటే బాబు దగ్గరే ఆ స్వేచ్ఛ ఉందా ?
సాధారణంగా.. ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా.. రాజకీయాలను పక్కన పెడితే.. ప్రబుత్వాన్ని ముందుండి నడిపించే వారిలో ఉన్నతాధికారులే ముందుంటారు. ఐఏఎస్, ఐపీఎస్ లు కీలక పాత్ర పోషిస్తారు. అందు కే.. ప్రభుత్వానికి ముక్కుచెవులు కూడా వారేననిఅంటారు. గతంలో ఉన్నతాధికారులు.. చంద్రబాబు పాలనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేవారు. సమయం పాడు లేకుండా సమీక్షలు చేస్తున్నారని.. ఇంటి పట్టున ఉండేం దుకు కుటుంబంతో గడిపేందుకు కూడా సమయం ఇవ్వడం లేదని వ్యాఖ్యానించేవారు. …
Read More »బురఖాలు వద్దు.. పాఠశాలలకు అనుమతించం.. కర్ణాటక మంత్రి
బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన విద్యార్థినులు తమ సంప్రదాయం ప్రకారం.. బురఖాలు ధరించి.. పాఠశాలకు, కాలేజీలకు రావడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. దీనిని సీరియస్‌గా తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. అంతేకాదు.. విద్యార్థినులు బురఖాలు ధరించి వస్తే.. పాఠశాలలకు మేం అనుమతించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు మంత్రి వ్యాఖ్యలు వివాదాన్ని రేపుతున్నాయి. …
Read More »గుడివాడలో అడుగడుగునా.. పోలీసులు…
కృష్ణా జిల్లా గుడివాడ పోలీసుల అష్టదిగ్బంధంలోకి జారిపోయింది. ఎటు చూసినా పోలీసులు కనిపిస్తున్నా రు. నగరంలో 144 సెక్షన్ కూడా విధించారు. దీనికి కారణం ఏంటి? అంటే.. సంక్రాంతి సందర్భంగా గుడివా డను అడ్డాగా చేసుకుని మంత్రి కొడాలి నాని..కేసినో సహా ఇతర జూదాలు ఆడించారు. గోవా తరహా కేసినో క్రీడను.. ఆయన తన సొంత కె-కన్వెన్షన్లోనే ఏర్పాటు చేశారు. ఎంట్రీఫీజు రూ.10 వేలుగా నిర్ణయించారు. దీనికి రాష్ట్రం నుంచే …
Read More »ప్రభుత్వానికి ట్రెజరీ ఉద్యోగుల షాక్..జీతాలకు బ్రేక్
కొత్త పీఆర్సీ పద్దతిలో జీతాల బిల్లలు రెడీ చేసేది లేదని చెప్పి ప్రభుత్వానికి ట్రెజరీ ఉద్యోగులు పెద్ద షాకే ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలాఖరులో బిల్లులు రెడీ చేస్తేనే బ్యాంకుల ద్వారా జీతాలు అందుతాయి. అదే పద్దతిలో ఇపుడు కూడా కొత్త పీఆర్సీ ప్రకారమే బిల్లులు రెడీ చేయమంటే అందుకు ట్రెజరీ సిబ్బంది నిరాకరించారు. పీఆర్సీ విషయమై ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య పెద్ద వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. …
Read More »ఇండియా టు డే సర్వే… మోడీకి తిరుగులేదు, జగన్ కు తగ్గలేదట
తాజాగా ఒక ఆశ్ మూడ్ ఆప్ ది నేషన్ పేరుతో సీ ఓటర్-ఇండియా టు డే జరిపిన తాజా సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డిదే విజయమని పేర్కొంటూ ఫలితాలు విడుదల చేసింది . మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ పరిస్థితి ఏమిటి అనే విషయమై పై రెండు సంస్ధలు దేశవ్యాప్తంగా సర్వే జరిపాయి. ఈ సర్వేలో …
Read More »నరసాపురం ఫైట్.. వైసీపీ తరఫున మాజీ ఐఏఎస్ ఎందుకంటే?
త్వరలోనే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ నుంచి గత 2019 ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు త్వరలోనే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఫిబ్రవరి 5న తన పదవిని వదులు కుంటానని వెల్లడించారు. అయితే..ఆయన ఆ సమయానికి రాజీనామా చేసే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే.. అప్పటికి బడ్జెట్ సమావేశాలు మంచి పీక్ …
Read More »కేటీఆర్ ట్వీట్ కాపీ.. కామెడీ అయిన ఏపీ ఎమ్మెల్యే
ఇండియాలో తమ కార్ బ్రాండును తీసుకురావడానికి భారత ప్రభుత్వంతో ఇబ్బందులున్నట్లుగా ఇటీవల టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ జవాబు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తమ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమని, తమతో కలిస్తే సవాళ్లపై కలిసి పని చేసి పరిష్కారం కనుగొందామని కేటీఆర్ ట్వీట్ వేశారు. అసలు టెస్లా ఇండియాకు రాకపోవడానికి కారణాలేంటో తెలియకుండా చాలామంది సెలబ్రెటీలు కేటీఆర్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ …
Read More »ఏపీ సర్కారుకు మరింత సెగ
ఏపీ ప్రభుత్వానికి మరింత సెగ తగలనుందా? ఇప్పటికే తమకు పీఆర్సీతో తీవ్ర నష్టం చేకూర్చారంటూ.. తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు.. తాజాగా మరింత తీవ్రస్థాయిలో ఉద్యమాన్ని వేడెక్కించాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో అన్ని సంఘాలు ఒకే వేదికపైకి రావాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం కావాలని.. అన్ని జేఏసీలు ఒకేతాటిపైకి రావాలని అభిప్రాయపడ్డాయి. శుక్రవారం నాటి సమావేశంలో విధివిధానాలను నిర్ణయిస్తామని జేఏసీ నేతలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates