గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాగానే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన కార్యక్రమం ప్రభుత్వా కార్యాలయాలన్నింటికీ పార్టీ రంగులు వేయడం. ఐతే ముందు పంచాయితీ భవనాలతో మొదలైన రంగుల కార్యక్రమం.. ఆ తర్వాత అన్నింటికీ విస్తరించింది. వాటర్ ట్యాంకర్లు.. బోర్లు.. స్కూళ్లు.. డివైడర్లు.. ఇలా దేన్నీ వదలకుండా కనిపించిన ప్రతి దానికీ వైకాపా రంగులేస్తూ పోయారు. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. చివరికి ఈ …
Read More »పవన్ రాజకీయంపై చిరు షార్ప్ కామెంట్
రాజకీయం పేరెత్తితే చాలు చిరాకు పడిపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య. అవి తన ఒంటికి అస్సలు సరిపడవని ఆయన కొన్నేళ్ల కిందటే తేల్చిపడేశారు. తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టాక పరిశ్రమకు పూర్తిగా అంకితమైపోయారు. తాను పక్కా సినిమా వాడినని చెప్పకనే చెబుతున్నారు. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని ఆయన స్పష్టం చేశారు. కనీసం తన తమ్ముడి రాజకీయ పార్టీ గురించి కూడా చిరు ఎప్పుడూ మాట్లాడట్లేదు. గత ఏడాది …
Read More »మా సంసారంలో నిప్పులు పోయొద్దు చిరు
కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పలు వీడియోలు, పాటలు రూపొందించిన సినీ తారలు…లాక్ డౌన్ పుణ్యమా అంటూ కుటుంబ సభ్యులతో చాలా సమయం గడుపుతున్నారు. ఎప్పుడూ షూటింగ్ లతో బిజీబిజీగా ఉండే సినీ హీరోలు, దర్శక నిర్మాతలు లాక్ డౌన్ వల్ల దొరికిన గ్యాప్ ను ఇంటి కోసం కేటాయిస్తున్నారు. …
Read More »అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సీతక్క
కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 2.0 విధించిన సంగతి తెలిసిందే. తొలి విడత విధించిన 21 రోజుల లాక్ డౌన్ వల్ల బడుగు, బలహీన వర్గాలు, నిరు పేదలు, దినసరి కూలీలు, వలస కార్మికులు నానా ఇబ్బందులు పడ్డారు. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు…తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రం లాక్ డౌన్ పొడిగించడంతో వారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. అటువంటి వారికి ఆపన్న హస్తం అందించేందుకు …
Read More »జగన్ సస్పెండ్ చేస్తే… కేంద్రం పెద్ద పోస్ట్ ఇచ్చింది
ఓవైపు ఏపీలో అధికార వైసీపీ, బీజేపీ రాష్ట్ర నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న తరుణంలో కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి షాక్‌కు గురయ్యే నిర్ణయం తీసుకుంది. జగన్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధుల నుంచి తొలిగించి కేసు నమోదు చేసిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌కు కేంద్రంలో పదోన్నతి కట్టబెట్టింది. తద్వారా జగన్ సర్కారు తొలగించిన అధికారికి కీలక పదవి ఇచ్చింది. జాస్తి …
Read More »కేసీఆర్ ఇచ్చే షాక్ కు రెడీగా ఉండండి
రాత్రి పూట కర్ఫ్యూ, పగటి పూట ఆఫీసు. ఇవే ఉంటాయి. ఆరేడు అయితేనే దుకాణం బంద్ కావచ్చు. ఎంటర్ మైంట్ జోన్లేమీ ఉండవు. షాపింగ్ మాల్సేమీ ఉండవు. కళ్యాణ వేదిక తెరచుకోవు. శిల్పారామాల్లో సేద తీరలేవు. నార్మల్సీ అనేది ఇప్పట్లో తీరే కోరిక కాదు. తెలంగాణలో అందరూ రికవరీ అయ్యి, జీరో పేషెంట్ చూసిన 15 రోజుల తర్వాత ప్రభుత్వం ఆలోచిస్తుంది. అపుడు కూడా కొన్ని నిబంధనలుంటాయి. స్వచ్ఛమైన గాలి …
Read More »రోజా వీడియో నేషనల్ లెవెల్లో వైరల్
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతల ప్రచార హడావుడి చూసి జనాలు ఇప్పటికే విస్తుబోతున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఈ మధ్య కరోనా కోసం విరాళాలిచ్చిన వాళ్ల నిలువెత్తు ఫొటోలు ట్రాక్టర్లలో పెట్టి ఊరేగిస్తూ చేసిన హంగామా ఎలాంటిదో అందరూ చూశారు. మరోవైపు ఎమ్మెల్యే రజని తనకు తాను ఎలివేషన్లు ఇచ్చుకుంటూ రిలీజ్ చేస్తున్న వీడియోలు ఎలా నవ్వుల పాలవుతున్నాయో తెలిసిందే. ఇప్పుడు వీటిని మించిన వీడియో …
Read More »తన స్థలంలో ఖననాలు చేసుకోమన్న హీరో
కరోనా మహమ్మారి గురించి జనం మరీ భయపడిపోతుండటానికి ఓ కారణం.. పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలితే పద్ధతిగా అంత్యక్రియలు కూడా జరుపుకునే అవకాశం లేకపోవడం. కుటుంబ సభ్యులు కూడా మృతదేహాన్ని తాకే అవకాశం ఉండదు. సన్నిహితులు కూడా అంత్యక్రియలకు హాజరు కాలేరు. ఆ సమయంలో సాయం పట్టడానికి కూడా మనుషులు లేని దైన్యాన్ని చూస్తూనే ఉన్నాం. కొన్ని చోట్ల తమ ప్రాంతాల్లో కరోనా మృతుల్ని ఖననం చేయడానికి కూడా జనాలు …
Read More »ఏపీ సర్కారు కిట్లకు కేంద్రం బ్రేక్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ కరోనా టెస్టింగ్ మీద కొన్ని రోజులుగా ఎంత రగడ నడుస్తోందో తెలిసిందే. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఒక్కోటి రూ.337 రూపాయలకే కొన్న కిట్లను ఏపీ సర్కారు రూ.700 చొప్పున పెట్టి కొనడంపై దుమారం రేగింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ముందు బుకాయించినప్పటికీ.. తర్వాత దిద్దుబాటు చర్యలకు దిగింది. చివరికి రేటు తగ్గించే ప్రభుత్వానికి అందజేసేందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన కంపెనీ అంగీకరించినట్లు చెబుతున్నారు. …
Read More »ట్రంప్ ది ఎంత మూర్ఖత్వం అంటే …
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు అత్యధిక నష్టం చవిచూస్తున్న దేశం అమెరికా. వారం కిందటి వరకు ఇటలీ కన్నీటి గాథల గురించి చెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అమెరికా దాన్ని దాటేసింది. ఊహించని స్థాయిలో అక్కడ కరోనా కేసులు బయటపడుతున్నాయి. కరోనా మరణాల సంఖ్య కూడా భయం గొలిపేలా ఉంది. ఆ దేశంలో గంటకు 107 మంది చనిపోతున్నారంటే పరిస్థితి అంచనా వేయొచ్చు. ఒక్క రోజు వ్యవధిలో ఆ దేశంలో 2569 …
Read More »బ్రెజిల్ ప్రధాని రామాయణం చదివారా?
కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ కకావికలమవుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కరోనాకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో.. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న మందులతో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నాయి. కరోనాను కట్టడి చేయడంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ కీలకమైన పాత్ర పోషిస్తుండడంతో ఇపుడు వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.అగ్రరాజ్యం అమెరికా దగ్గర కూడా సరిపడినంత హైడ్రాక్సీ క్లోరోక్విన్ లేకపోవడంతో…మిత్రదేశం భారత్ ను ట్రంప్ సాయం అడిగారు. ఒకింత …
Read More »కరోనా టెస్టులపై సుప్రీం కీలక సూచన
దేశవ్యాప్తంగా కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో మరింత మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలూ నిర్ణయించాయి. ఈ నేపథ్యంలోనే నిర్దేశించిన ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు కొన్ని ప్రైవేటు ల్యాబ్ లలోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమ వంతు వచ్చేసరికి కొంచెం ఆలస్యమవుతుందేమోనని భావించిన వారు…ప్రైవేటు ల్యాబ్ లలో టెస్టులు చేయించుకుంటున్నారు. ప్రైవేటు ల్యాబుల్లో ఒక్కో …
Read More »