రాష్ట్రాన్ని కుదిపేస్తున్న పెగాసస్ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. పెగాసెస్‌పై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. పెగాసెస్‌పై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఏపీలో పెగాసస్ స్పై వేర్ కలకలం రేపుతోంది. టీడీపీ హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేశారన్న పశ్చిమ్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కామెంట్లతో ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. పెగాసెస్ స్పైవేర్ ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేయలేదని గతంలో మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.
పెగాసెస్ సాఫ్ట్ వేరును ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందా అంటూ ఓ ఆర్టీఐ దరఖాస్తుదారు అడిగిన ప్రశ్నకు మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ రిప్లై ఇచ్చారు. తమ హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేయలేదని ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. ఏపీ అసెంబ్లీలో రోజు రోజంతా.. సోమవారం ఈ అంశంపై నే చర్చ చేపట్టారు. పెగాసస్ స్పైవేర్‌పై చర్చలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. పెగాసస్ వంటి స్పైవేర్‌తో వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని తెలిపారు. ఇది ప్రమాదమే కాదు.. అనైతికమని కూడా అన్నారు.
చంద్రబాబు పెగాసస్ సాఫ్ట్‌వేర్ కొన్నారని సీఎం మమతా చెప్పారని తెలిపారు. ఈ స్పైవేర్‌తో వ్యక్తిగత వివరాలన్నీ తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి అనైతిక కార్యక్రమాలు ఇల్లీగల్‌గానే చేస్తారని అన్నారు. చంద్రబాబు చేసిన చర్య.. మానవహక్కులకు భంగం కలిగించడమే అని పేర్కొన్నారు. పెగాసస్‌ను కొనడం.. ఘోరమైన నేరమని తెలిపారు. చంద్రబాబుకు అడ్డదారి రాజకీయాలు మాత్రమే తెలుసని అన్నారు. పెగాసస్‌ను చంద్రబాబు రాజకీయనేతలపై ఉపయోగించారని అన్నారు.2016లో పెగాసస్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ప్రమాదకర సాఫ్ట్‌వేర్‌ను చంద్రబాబు కొన్నారంటే ఎంత దుర్మార్గం అని తెలిపారు. పెగాసస్‌తో ఏం చేశారో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
సేవామిత్ర యాప్ ద్వారా కూడా టీడీపీ.. ఓటర్లపై నిఘా పెట్టిందని మంత్రి బుగ్గన తెలిపారు. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉండేవారి ఓట్లను తొలగించారని అన్నారు. ఆధార్ డేటా సేకరించి ఏ ఓటర్ ఏ పార్టీకి ఓటు వేస్తారో తెలుసుకునే యత్నం జరిగిందని తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఏబీ వెంకటేశ్వరరావు ఎన్నిసార్లు ఇజ్రాయెల్ వెళ్లారో తనకు తెలియదని అన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు, తన ఫోన్ ట్యాంపర్ అయిందని తెలిపారు. ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారని చెప్పారు. ఇది రాజ్యాంగానికి విఘాతం కలిగించే చర్య అని సజ్జల అన్నారని గుర్తుచేశారు. పెగాసస్‌పై హౌస్‌కమిటీతో విచారణ జరపాలని మంత్రి బుగ్గన కోరారు. ఇదే విధంగా ఇతర సభ్యులు కూడా డిమాండ్ చేయడంతో సభాపతి హౌస్‌కమిటీకి ఆర్డర్ ఇచ్చారు.