Political News

తెలంగాణలో కరోనా.. నంబర్ చూస్తే కళ్లు తిరుగుతాయ్

కరోనా టెస్టులు ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా కేసులు బయటపడతాయన్నది చాలా సింపుల్ లాజిక్. తెలంగాణలో ఇంతకుముందు తక్కువ టెస్టులు చేేసేవాళ్లు. కేసులు కూడా తక్కువగానే ఉండేవి. కానీ కొన్ని రోజులుగా టెస్టుల సంఖ్య బాగా పెరిగింది. అందుకు తగ్గట్లే కరోనా కేసులు కూడా పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు రోజుకు 50-100 మధ్య కేసులకే అమ్మో అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు రోజూ వందల్లో కేసులు నమోదవుతున్నాయి. …

Read More »

కరోనా మరణాలు..106వ స్థానంలో భారత్

మహమ్మారి వైరస్ 213 దేశాలపై పంజా విసిరింది. ప్రపంచవ్యాప్తంగా 88 లక్షల మంది ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. కరోనా బారినపడి 4,63,465 మంది చనిపోయారు. భారత్ లో కరోనా కేసులు 3,80,532కు చేరాయి. మనదేశంలో 12,573 మంది కరోనా బారిన పడి మరణించారు. కొవిడ్‌-19కు సంబంధించి తాజా గణాంకాలను అందించే అంతర్జాతీయ సంస్థ ‘వరల్డో మీటర్‌’ ప్రకారం పలు ఆసక్తికర గణాంకాలు వెల్లడయ్యాయి. కోవిడ్-19 మరణాల్లో తొలి …

Read More »

కరోనాపై సూర్యగ్రహణం ప్రభావం?

జూన్ 21న ఈ ఏడాదికిగాను అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం.. సూర్యగ్రహణం కారణంగా గ్రహాల నక్షత్రరాశులలో మార్పులు సంభవించనున్నాయి. ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రహణం కావడం గమనార్హం. జ్యోతిషశాస్త్రం ప్రకారం కరోనా వైరస్ గతేడాది డిసెంబరులో ఏర్పడిన సూర్యగ్రహణంతోనే ప్రారంభమైంది. ఈ సూర్యగ్రహణంతో కరోనా ప్రభావం ముగుస్తుందని చాలామంది అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో సూర్యుడు మరింత ప్రకాశవంతంగా వెలగనున్నాడని, సూర్యరశ్మి ధాటికి కరోనా వైరస్ …

Read More »

కరోనాకు ఫాబి ఫ్లూతో చెక్…భారత్ ఘనత

మహమ్మారి వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాణాంతక వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనేందుకు పలు దేశాల శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్ వచ్చేవరకు ఈ మహమ్మారిని నియంత్రించే సమర్థవంతమైన ఔషధాన్ని తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించారు. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సకు తొలి ఓరల్ ఔషధాన్ని తయారు చేసిన ఘనత మన దేశానికి దక్కింది. కరోనా చికిత్సకు మందును భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్‌ …

Read More »

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

మహమ్మారి వైరస్ భారత్ పై పంజా విసురుతోన్న సంగతి తెలిసిందే. రోజుకు సుమారు పది వేల వరకు కేసులు నమోదువుతుండడంతో కేంద్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఇక, ఏపీ, తెలంగాణలోనూ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రాణాంతక వైరస్ దెబ్బకు భయపడి ఇప్పటికేే తెలంగాణ, తమిళనాడులో పదో తరగతి పరీక్షలను రద్దు చేశారు. అయితే, ఏపీలో మాత్రం ఫిజికల్ డిస్టన్స్ పాటిస్తూ….పరీక్షలను నిర్వహించాలని ఏపీ సర్కార్ భావించింది. అయితే, …

Read More »

జగన్ ను ఫాలో అవుతున్న లోకేశ్..?

పోయిన చోటే వెతుక్కోవాలన్న పెద్దల మాటను తూచా తప్పకుండా ఫాలో అయినట్లుగా కనిపిస్తోంది చంద్రబాబు కుమారుడు కమ్ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీరు చూస్తుంటే. లాక్ డౌన్ సమయాన్ని పూర్తిస్థాయిలో వాడేసుకున్న లోకేశ్ .. తనను తాను మేకోవర్ చేసుకున్నారు. బొద్దుగా ఉండే ఆయన తన బాహ్యా రూపాన్ని మాత్రమే కాదు.. భాషను.. ఉచ్ఛారణను మార్చేసుకున్నారు. గతంలో మాదిరి మాటల కోసం తడుముకోవటం కాకుండా.. పక్కాగా ప్రిపేర్ అయి …

Read More »

ట్రంప్ కు ఎదురుగాలి.. ప్రత్యర్థి ముందంజ

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబరులో జరుగుతుున్న సంగతి తెలిసిందే. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఈ అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి మరోసారి ఎన్నిక కావాలని ట్రంప్ కోరుతుంటే.. మరోసారి ఆయన చేతిలో పాలనా పగ్గాలు ఉంటే అగ్రరాజ్యానికి గడ్డుపరిస్థితే అన్న భావన వ్యక్తమవుతోంది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న మహమ్మారికి ముందంతా ట్రంప్ జోరు సాగినా.. ఇప్పుడు మాత్రం లెక్కల్లో తేడా వస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ట్రంప్ కు …

Read More »

సరిహద్దుల్లో వాయుసేన భారీ మొహరింపు వ్యూహం ఏమిటి?

ఆచితూచి అడుగులు వేసే రోజులు పోయాయి. విషయం ఏదైనా తేల్చుకోవాలన్నప్పుడు అమీతుమీ అన్నట్లుగా దూకుడుగా.. దుందుడుకుగా వ్యవహరించినోళ్లదే ఇప్పుడు హవా నడిపిస్తున్నారు. దేశంలో కావొచ్చు.. ప్రపంచంలోని మరే ప్రాంతంలోనైనా కావొచ్చు. అందుకే.. ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి. సమీకరణాలు కొత్తగా సమీకరించుకోవాల్సిన పరిస్థితి. ప్రత్యర్థి ఎవరన్న దాని కంటే.. ఎలా బదులిస్తామన్న విషయాన్ని చాటి చెప్పే సరికొత్త రణనీతిని ప్రదర్శిస్తోంది మోడీ సర్కారు. గడిచిన నాలుగైదు దశాబ్దాల్లో ఇప్పటి మాదిరి చైనాతో …

Read More »

భారత్ తో చర్చలు జరపనంటోన్న నేపాల్

Nepal

కొంతకాలంగా భారత్ పై చైనా కయ్యానికి కాలు దువ్వుతోన్న సంగతి తెలిసిందే. లడఖ్ ప్రాంతంలో భారత సైన్యంపై చైనా బలగాలు….కవ్వింపులకు పాల్పడుతున్నాయి. డ్రాగన్ సేనలకు భారత్ దీటుగా జవాబిస్తోంది. బలగాల ఉప సంహరణకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే చైనా బలగాలు దుందుడుకు చర్యలకు పాల్పడడంతో ఉద్రిక్తత ఏర్పడింది. తూర్పు లడాఖ్ లోని గల్వాన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో భారత్ …

Read More »

నిమ్మగడ్డకు బీజేపీ ఫుల్ సపోర్ట్… ఇదిగో సాక్ష్యాలు

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి వైసీపీ సర్కారు అర్ధాంతరంగా తొలగించబడ్డ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు నిజంగానే బీజేపీ మద్దతు దక్కిందనే చెప్పాలి. అంతేకాకుండా బీజేపీ నుంచి నిమ్మగడ్డకు దక్కిన మద్దతు అంతకంతకూ పెరుగుతోందని కూడా చెప్పక తప్పదు. వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు పరిశీలిస్తే ఈ మాట నిజమేనని ఒప్పుకోక కూడా తప్పదు. మొత్తంగా వైసీపీ సర్కారు తనపై కక్ష కట్టి మరీ తనను పదవి నుంచి …

Read More »

ఇలాంటి సమయాల్లో తప్పులో కాలేస్తే ఎలా రాహుల్?

అత్యున్నత స్థానాల్లో ఉండే రాజకీయ నేతలు కొన్నిసార్లు ప్రస్తావించే అంశాలు వారి ఇమేజ్ ను దెబ్బ తీయటమే కాదు.. వారికున్న పరపతిపైనా ప్రశ్నలు లేవనెత్తుతుంది. జాతీయవాదం విషయంలో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విమర్శలు.. ఆరోపణలు అన్ని ఇన్ని కావు. మారిన దేశ ప్రజల మనోగతాన్ని గుర్తించటంలో ఆ పార్టీ చేసిన తప్పులు ఇప్పుడు శాపాలుగా మారుతున్నాయి. జరిగిన తప్పులేవో జరిగిపోయాయి. ఇప్పటికి ఆ తప్పుల్ని సరిదిద్దుకునే విషయంలో ఆ …

Read More »

యాంటీ చైనా.. ఉద్యమం ఊపందుకుంటోంది

మన దేశం ఇప్పుడు కరోనాతో ఇలా అల్లాడుతుండటానికి కారణం చైనా. పాకిస్థాన్ ఉగ్రవాదులు సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు చెలరేగిపోతూ ఉండటానికి పరోక్ష కారణమూ చైనానే. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు భారత భూభాగంలో అక్రమంగా అడుగుపెట్టి దాన్ని ఆక్రమించే దుస్సాహసానికి దిగుతోంది చైనా. సంబంధిత ఘర్షణల్లో భాగంగానే 20 మంది భారత సైనికులు హతమయ్యారు. మన దేశానికి ఇంత పెద్ద శత్రువుగా మారిన చైనాకు ఆ దేశం అవతల అత్యధిక ఆదాయం అందించే …

Read More »