దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ను సడలించేశారు. అన్ లాక్ పేరుతో థియేటర్లు, జిమ్‌లు లాంటివి మినహా అన్నీ తెరిచేశారు. మాల్స్, ఆలయాలు.. అన్ని రకాల దుకాణాలూ ఓపెన్ అయిపోయాయి. దీంతో పాటే కరోనా కేసులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా కేసులు, మరణాల్లో ఇండియా పీక్స్‌ను చూస్తోందిప్పుడు. ఒక్క రోజుల రెండు వేలకు పైగా మరణాలంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మళ్లీ లాక్ డౌన్ పెట్టక తప్పదని.. …
Read More »అదే నిజమైతే.. కేసీఆర్ సర్కారుకు షాకే
అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో పలు విమర్శల్ని ఎదుర్కొంటోంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఎవరెన్ని చెప్పినా.. మాయదారి రోగానికి ముందస్తుగా నిర్దారణ పరీక్షలు చేయమంటే ససేమిరా అంటూ.. అత్యంత పొదుపును ప్రదర్శిస్తోంది. తెలంగాణకు ఇరుగుపొరుగున ఉన్న రాష్ట్రాల్లో రోజువారీగా విస్తారంగా పరీక్షలు నిర్వహిస్తుంటే.. అందుకు భిన్నంగా వ్యవహరించటంలో ఉన్న మర్మం ఏమిటన్నది కేసీఆర్ అండ్ కోకు మాత్రమే అర్థమవుతుందన్న విమర్శలు ఉన్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో.. నిర్దారణ …
Read More »భారత్ – చైనా మధ్య ఘర్షణలు ఇప్పటికి ఎన్ని జరిగాయి?
భారత్ – చైనాల మధ్య సరిహద్దు వివాదం ఇప్పటిది కాదు. ఆ మాటకు వస్తే.. స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉంది. రెండు దేశాల మధ్యనున్న మూడు సరిహద్దులు వివాదంలో ఉన్నవే. మొండితనంతో పాటు.. తన అవసరాలకు తగ్గట్లు.. తన సరిహద్దు దేశాలతో పేచీ పెట్టుకునే చైనాకు గొడవలు మొదట్నించి అలవాటే. రెండు దేశాల మధ్య ఉన్న మూడు సరిహద్దు ప్రాంతాల్ని చూస్తే.. అందులో మొదటిది మెక్ మోహన్ లైన్.. రెండోది …
Read More »ఏపీలో ఒక్కరోజు… సంచలన సంఖ్యలో బిల్లులకు ఆమోదం
గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 2 రోజుల అసెంబ్లీ సమావేశాలను చరిత్రలో తొలిసారి చూస్తున్నాం. ఇదంతా కరోనా ప్రభావం. అయితే, వైసీపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉండటంతో సమావేశాల కాలం తగ్గినా బిల్లుల ఆమోదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతోంది. వీరికి 151 మంది మద్దతు ఉండటం ఒకటైతే… ఇతర పార్టీల నుంచి 3 ఓట్లు అనుకూలంగా ఉన్నాయి. పైగా టీడీపీకి చెందిన అచ్చెం నాయుడు రిమాండ్ ఖైదీగా …
Read More »మళ్లీ రెచ్చిపోయిన రఘురామకృష్ణంరాజు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు.. మరోసారి ఫైర్ బ్రాండ్ వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. ఇటీవలే ఒక వీడియో పెట్టి జగన్, వైకాపా మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసిన ఆయన.. మరోసారి ఆ పార్టీపై విరుచుకుపడ్డారు. తనపై విమర్శలు చేసిన వైకాపా ఎమ్మెల్యేలకు ఆయన గట్టిగా బదులిచ్చారు. ఈ సందర్భంగా ‘‘సింహం సింగిల్‌గా వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయన్న చందంగా అసెంబ్లీ లాబీలో …
Read More »ఈ రోజు చనిపోయిన సైనికాధికారి మన వాడట !
ఈ రోజు లడఖ్ పరిధిలోని గాల్వన్ వ్యాలీ వద్ద చైనా – భారత సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మరణించినట్లు ఉదయం వార్తలు విన్నాం కదా. ప్రపంచమంతా చీ కొడుతున్నా చైనా బుద్ధి మారలేదు. అయితే అత్యంత విషాదకరం ఏంటంటే… ఈరోజు దేశం కోసం తుది శ్వాస విడిచిన వ్యక్తి సూర్యాపేట వాసి అని తాజాగా వెల్లడయ్యింది. ఆర్మీ అధికారులు వారి కుటుంబానికి ఈ రోజు సమాచారం ఇవ్వడంతో …
Read More »రూ.2.25లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్…హైలైట్స్
ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇసుక కొరత, కరోనా కట్టడి, లాక్ డౌన్ తోపాటు పలు సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇప్పటికే లోటు బడ్జెట్ తో కొనసాగుతోన్న ఏపీలో ఓ వైపు కరోనా కట్టడి కోసం విపరీతంగా ఖర్చు పెడుతున్న జగన్…..మరోవైపు సంక్షేమ పథకాల అమలులో రాజీ పడడం లేదు. ఈ నేపథ్యంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న జగన్ కు వార్షిక …
Read More »కొరకరాని కొయ్యలా రాజు.. జగన్ స్పందనపై ఆసక్తి
ప్రాంతీయ రాజకీయ పార్టీ అన్నాక క్రమశిక్షణ చాలా ముఖ్యం. కనుసైగతో కట్టడి చేయటం అవసరం. అందుకు భిన్నంగా మనసులో ఏమనిపిస్తే.. ఆ విషయాన్ని బయటకు వెల్లడిస్తే..పార్టీకి జరిగే నష్టం భారీగా ఉంటుంది. అందుకే.. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సిద్దాంతాన్ని తల ఎగురవేసే సొంత నేతలపై ఆయా పార్టీలు అమలు చేస్తుంటాయి. తాజాగా నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి …
Read More »బ్రేకింగ్.. తమిళనాడులో మళ్లీ లాక్ డౌన్
లాక్ డౌన్‌ను చాలా లైట్ తీసుకునే రోజులు నడుస్తున్నాయిప్పుడు. అది ఉన్నా లేకున్నా తేడా లేదు అన్నట్లే ఉంది. ఇంకెంతో కాలం జనాల్ని పట్టి ఉంచలేమన్న ఉద్దేశంతో ప్రభుత్వం దశల వారీగా మినహాయింపులు ఇస్తూ పోవడంతో ఇప్పుడు లాక్ డౌన్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఐతే దేశంలో కరోనా కేసులు, మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో మళ్లీ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కఠిన లాక్ డౌన్‌ను …
Read More »బలవంతంగా వైసీపీలో చేర్పించారు
వైసీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహార శైలి కొంతకాలంగా చర్చనీయాంశమవుతోనన సంగతి తెలిసిందే. తన సంచలన వ్యాఖ్యలతో, చర్యలతో రఘురామకృష్ణం రాజు పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో పార్లమెంట్ సమావేశాల తెలుగు భాషకి సపోర్ట్ గా మాట్లాడుతూ జగన్ కు షాక్ ఇచ్చారు. విజయసాయి రెడ్డికి చెప్పకుండా కేంద్రమంత్రులు,ప్రధానిని కలవద్దని సీఎం జగన్ స్వయంగా చెప్పినా…రఘురామకృష్ణం రాజు వినకుండా ప్రధాని మోడీకి పాదాభివందనం చేసి…పలువురు కేంద్ర …
Read More »లాక్ డౌన్ పుకార్లపై స్పందించిన కేంద్రం.. ఏమందంటే?
అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా త్వరలో లాక్ డౌన్ విధించటం ఖాయమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. గడిచిన మూడు రోజులుగా వినిపిస్తున్న ఈ మాట గ్రామీణ స్థాయికి వెళ్లిపోయింది. దీంతో.. మళ్లీ లాక్ డౌన్ అయితే ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత అనుభవాలతో.. మూడు రోజులుగా సూపర్ మార్కెట్లలో రద్దీ పెరిగింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిత్యవసర వస్తువుల్ని భారీగా కొనుగోళ్లు …
Read More »టిమ్స్ – గుర్తుందా… రేవంత్ ఏం చేశాడంటే ?
మార్చిలో టిమ్స్ (తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ) గురించి కేసీఆర్ ప్రకటించినపుడు అందరి స్పందన ఒకటే. కేసీఆర్ సంక్షోభాలను సవాళ్లుగా స్వీకరించారు, మంచి పని చేశారు అని అభినందించారు. కట్ చేస్తే సరిగ్గా వారం క్రితం గాంధీ ఆస్పత్రి సరిపోవడం లేదని… నిమ్స్ ను కూడా కోవిడ్ చికిత్స కోసం సిద్ధం చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. సరిగ్గా ఈ వార్త చదివిన అందరికీ ఒక …
Read More »