జేసీ బ్ర‌ద‌ర్స్‌కు షాక్‌: చుట్టుముట్టిన ఈడీ… ఆస్తుల త‌నిఖీ

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బయట వారిని లోపలికి రానీయడం లేదు. ప్రభాకర్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబసభ్యుల మొబైల్‌ ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జేసీ ఆస్తులకు సంబంధించిన వివిధ పత్రాలను తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లోనూ జేసీ సోదరుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఉమ్మడి ఆస్తుల వివరాలపై ప్రశ్నిస్తున్నట్లు సమచారం.

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు క్లాస్ వన్ కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సహా కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బయట వ్యక్తులు ఎవరూ ఇంట్లోకి రాకుండా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

ఈడీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో అశోక్ లేల్యాండ్ నుంచి కొనుగోలు చేసిన వాహనాల విషయంలో జరిగిన లావాదేవీలపై ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలు స్తోంది. తనిఖీల సమయంలో జేసీ సోదరులు ఇళ్లలోనే ఉన్నారు. అదేవిధంగా క్లాస్‌-1 కాంట్రాక్టర్‌ చవ్వ గోపాల్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

వారి ఆస్తులకు సంబంధించిన పత్రాలను మొత్తం 20 మంది సిబ్బంది పరిశీలిస్తున్నారు. తాడిపత్రిలో భారీ బందోబస్తు నడుమ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లోనూ జేసీ సోదరుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈడీ తనిఖీ సమయంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ దివాకర్‌రెడ్డి కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం.