భూమా ఫ్యామిలీ వ్యవహారమే విచిత్రంగా ఉంటోంది. ఒకరిపై మరొకరు కోర్టులో కేసులు వేసుకుంటున్నారు. బయటవాళ్ళెవరితో సమస్యలు వస్తే అందరూ కలిసి వాళ్ళపై దాడులు చేస్తుంటారు. ఆ విషయం ముగిసిపోగానే మళ్ళీ ఒకళ్ళపై మరొకళ్ళు కేసులు మామూలే. ఇపుడిదంతా ఎందుకంటే దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి కొడుకు జగద్విఖ్యాత్ రెడ్డి తన అక్కలైన భూమా అఖిలప్రియ, భూమా మౌనికపై తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు.
తన చిన్నపుడే తన తండ్రి ఎవరికో విక్రయించిన స్ధలం రిజిస్ట్రేషన్ చెల్లదని చెబుతు, పనిలో పనిగా తన అక్కలపైన కూడా కేసు వేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే భూమా నాగిరెడ్డి దంపతులకు రాజేంద్రనగర్ లో ఒక స్ధలముంది. అందులో కొంత భాగాన్ని దంపతులు ఎవరికో అమ్మేశారు. ఇపుడా అమ్మకమే చెల్లదంటూ జగత్ కోర్టులో కేసు వేశారు. ఎందుకు చెల్లదంటే ఆ స్థలాన్ని తన తల్లిదండ్రులు అమ్మినపుడు జగత్ మైనరట. అందుకనే తన అక్కల సంతకాలతో పాటు తన వేలిముద్రలు తీసుకున్నారు.
తనకు తెలీకుండానే స్ధలం అమ్మారు కాబట్టి ఇపుడా అమ్మకం చెల్లదని కోర్టులో కేసు వేశారు. నిజానికి విషయం తెలిసిన వారు ఆశ్చర్యపోతారు. తన తల్లి, దండ్రులు అమ్మి రిజిస్ట్రేషన్ చేసిందే చెల్లదని జగత్ వాదనే విచిత్రంగా ఉంది. తన తల్లి, దండ్రులు సంపాదించుకున్న స్ధలాన్ని వాళ్ళిష్టప్రకారమే అమ్మేసుకున్నారు. కొన్న వాళ్ళకి స్ధలాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసేశారు. ఇపుడో జరిగిపోయిన ఆస్తి అమ్మకం చెల్లదని ఇపుడు జగత్ కేసు వేయటమే చాలా విచిత్రంగా ఉంది. పైగా సంతకాలు పెట్టిన తన ఇద్దరు అక్కలతో పాటు స్ధలం కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఐదుగురిని కూడా పార్టీగా చేరుస్తు కోర్టులో కేసు వేయటమే ఆశ్చర్యంగా ఉంది. చూడబోతే కోర్టులో కేసు వేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయటం ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ఉన్నట్లు అనుమానంగా ఉంది. మరి కోర్టు ఏమి చెబుతుందో చూడాలి.