Political News

ఇంత అర్జంటుగా కార్యనిర్వాహక కమిటి ఎందుకేసినట్లు ?

తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో జనసేన తరపున పవన్ కల్యాణ్ కార్యనిర్వాహక కమిటిని నియమించారు. జనసేన అధినేత తరపున రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ఓ మీడియా రిలీజ్ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు ఇంత అర్జంటుగా కార్యనిర్వాహక కమిటిని నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎవరికీ అర్ధం కావటం లేదు. పదిమందితో కూడిన ఈ కమిటి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో వెంటనే తన పర్యటనను ప్రారంభించేస్తుందట. ఈ కమిటి ఏమి …

Read More »

టీడీపీ సీటుపై వైసీపీ గురిపెట్టిందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇక్కడ సీట్లంటే మొన్నటి అసెంబ్లీలో తెలుగుదేశంపార్టీ గెలుచుకున్న ఎంఎల్ఏ సీట్లు కాదులేండి. అప్పుడెప్పుడో టీడీపీ హయాంలో జరిగిన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పైన ఇఫుడు వైసీపీ గురిపెట్టిందట. 2017లో జరిగిన కాకినడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. 50 డివిజిన్లకు గాను 48 డివిజన్లలోనే ఎన్నికలు జరిగాయి. కోర్టు వివాదాల కారణంగా రెండు డివిజన్లలో ఎన్నికలు జరగలేదు. జరిగిన …

Read More »

రైతు గెలిచాడు.. రాజ‌ధాని నిల‌బ‌డ‌డం ఖాయం!!

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని నిల‌బెట్టుకోవ‌డం కోసం.. ఆంధ్రుల కోసం.. మ‌హ‌త్త‌ర‌మైన న‌గ‌రాన్ని నిర్మించ‌డం కోసం.. త‌ల‌కు క‌ట్టిన పాగాను న‌డుముకు బిగించి.. మ‌డిలో నిల‌పాల్సిన పాదాన్ని.. న‌డిరోడ్డుపైకెక్కించి.. రైత‌న్న సాగిస్తున్న రాజ‌ధాని ఉద్య‌మానికి ఏడాది పూర్తయింది. రాజ‌ధాని క‌డుతున్నాం.. భూములు ఇవ్వండి.. అంటే.. త‌ట‌ప‌టాయించిన అన్న‌దాత‌.. ఆనాడు.. ప్ర‌భుత్వాధినేత‌గా చంద్ర‌బాబు ఇచ్చిన హామీని న‌మ్మాడు. రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం.. రాష్ట్రం కోసం.. తాను సింధువు కావ‌డాన్ని గ‌ర్వించాడు. ఈ క్ర‌మంలోనే …

Read More »

బర్త్ డే స్పెషల్: జగన్ కు తోడుగా నీడగా.. షర్మిల..

ప్రతి మొగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందంటారు. ఏపీలో ఒంటరిగా బరిలోకి దిగి ఏకంగా 151 ఎమ్మెల్యే సీట్లు,, 22 ఎంపీ సీట్లు, 51శాతం ఓట్ల శాతం పొంది.. 2019 ఏపీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన సీఎం జగన్ వెనుక ఎవరున్నారు? ఆయనను నడిపించింది ఎవరు? ఆయన వెనుకున్నది ఎవరు అన్నది తరిచిచూస్తే ఆయన కుటుంబమే కనిపిస్తుంది. సీఎం జగన్ వెనుక స్త్రీ శక్తి స్వరూపాలున్నాయి. వాళ్లు …

Read More »

విజ‌య‌సాయిరెడ్డి ఆ ట్వీట్ ఎందుకు డెలీట్ చేశాడు?

విదేశాల్లో క‌రోనా వ్యాక్సినేష‌న్ జోరుగానే సాగుతోంది కానీ.. ఇండియాలో ఆ ప్ర‌క్రియ ఎప్పుడు మొద‌ల‌వుతుందో స్ప‌ష్ట‌త లేదు. ఐతే వ్యాక్సినేష‌న్ కోసం స‌న్నాహాలు చేసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అయితే మార్గ‌ద‌ర్శ‌కాలు అందుతున్నాయి. రాష్ట్రాలు కూడా స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. ఐతే కొత్త ఏడాదిలోనే వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా ఉంటుంద‌ని భావిస్తున్నారు. కానీ ఆశ్చ‌ర్య‌క‌రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ నెల 25 నుంచి జ‌నాల‌కు క‌రోనా వ్యాక్సిన్ వేయ‌బోతున్న‌ట్లుగా అధికార పార్టీ ముఖ్య నేత‌, ఎంపీ …

Read More »

మార్చిలోగా స్ధానిక ఎన్నికలు జరిగేది డౌటేనా ?

మొన్నటి మార్చిలో వాయిదాపడిన స్ధానికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనబడటం లేదు. జనవరి 15 నుండి మార్చి 15వ వరకు కరోనా వైరస్ మళ్ళీ విజృంభించబోతోందంటు ప్రపంచ ఆరోగ్య సంస్ధతో పాటు కేంద్రప్రభుత్వం కూడా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్ధితుల్లో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుకున్నట్లు ఫిబ్రవరిలో వాయిదాపడిన ఎన్నికలను నిర్వహించటం సాధ్యంకాదని ప్రభుత్వం హైకోర్టులో మంగళవారం ఓ అఫిడవిట్ …

Read More »

ఆలయాలపై జగన్ కు సోము వీర్రాజు బహిరంగ సవాల్

కొద్ది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని చారిత్రక రథం దగ్ధం ఘటన ఏపీతో పాటు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు నిరసనగా అంతర్వేది ఆలయాన్ని సందర్శించేందుకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు బీజేపీ, జనసేన నేతలను పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా హౌస్‌ అరెస్ట్‌ చేయడం నాడు రాజకీయ …

Read More »

క‌డ‌ప న‌మూనా.. కొంప ముంచేస్తుందా?

ఏపీ సీఎం జ‌గ‌న్ అనుస‌రిస్తున్న క‌డ‌ప న‌మూనా.. పార్టీని కొంప‌ముంచుతుంద‌నే వాద‌న బ‌లంగా వినిపి స్తోంది. తాను పుట్టిన గ‌డ్డ‌ను అద్భుత జిల్లాగా తీర్చి దిద్దుకోవాల‌ని భావిస్తున్న ముఖ్య‌మంత్రి.. ఆ విష‌యంలో అనుకున్న‌దానిక‌న్నా ఎక్కువ‌గా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతో వైసీపీలో ఈ విష‌యం తీవ్ర చ‌ర్చ‌నీ యాంశంగా మారింది. ఏ నాయ‌కుడికైనా.. త‌న సొంత ఊరును అభివృద్ధి చేసుకోవాల‌నే ఉంటుంది. తాను పుట్టిన గ‌డ్డ రుణం తీర్చుకోవాల‌నే ఉంటుంది. అయితే.. ఈ …

Read More »

అమరావతిపై ఆయన డాక్యుమెంటరీ ఎలా ఉంది?

గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రాజధానిగా ఎంచుకున్న అమరావతికి వైకాపా సర్కారు మరణ శాసనం రాసేసి ఏడాది దాటిపోయింది. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని చెబుతున్నప్పటికీ.. అది పేరుకు మాత్రమే. దీని ఉద్దేశమేంటన్నది అందరికీ తెలిసిందే. అమరావతిని నిర్వీర్యం చేయడానికి ఏం చేయాలో అన్నీ చేస్తోంది జగన్ సర్కారు. గత ప్రభుత్వ మాటల్ని, ఒప్పందాల్ని నమ్మి అమరావతికి తమ భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఏడాదిగా …

Read More »

గెలుపు గుర్రాలు సైలెంట్‌.. ఓడినోళ్ల‌ దూకుడు.. ఏం బీజేపీ.. ఏం రాజ‌కీయం?

ప్ర‌జా క్షేత్రంలో ఒక‌సారైనా..గెలిచిన నాయ‌కులు బీజేపీలో చాలా మందే ఉన్నారు. కామినేని శ్రీనివాస‌రావు, కంభంపాటి హ‌రిబాబు, గోక‌రాజు గంగ‌రాజు.. ఇలా అనేక మంది ఉన్నారు. ఇక‌, ఎన్నో సార్లు.. కమ‌లం త‌ర‌ఫున బ‌రిలోకి దిగి కూడా ఒక్క‌సారి కూడా విజ‌యం సాధించ‌ని నాయ‌కులు ఇంత‌కు రెండు రెట్లు ఉన్నారు. అయితే.. గ‌తంలో గెలిచి, ప్ర‌జానాడిని అంతో ఇంతో ప‌ట్టుకున్న నాయ‌కులు గ‌డ‌ప దాట‌డం లేదు. కానీ, నిరంత‌రం ఓడిన నాయ‌కులు …

Read More »

వైసీపీని గెలిపించే బాధ్య‌త.. ఆ మంత్రుల‌దేనా?

తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక వ్య‌వ‌హారం వైసీపీలో కాక రేపుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో జ‌రిగిన ఏ ఎన్నిక‌ల‌ను గ‌మ‌నించినా.. అక్క‌డ వైసీపీని గెలిపించే బాధ్య‌త‌ను స్వ‌యంగా పార్టీ అధినేతగా జ‌గ‌నే చూసుకునేవారు. సార్వ‌త్రిక స‌మ‌ర‌మైనా.. లోక‌ల్ బాడీ ఎన్నిక‌లైనా(చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రిగిన‌), ఆఖ‌రుకు నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికైనా.. స్వ‌యంగా జ‌గ‌నే బ‌రిలోకి దిగి త‌న అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్ర‌చారం చేసుకునేవారు. గెలిచారా.. ఓడారా.. అనే విష‌యాన్ని ప‌క్క‌న …

Read More »

అమిత్ షా ముందు జగన్ కీలక ప్రతిపాదనలు

అధికార వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ప్రతిపాదనలకు మద్దతివ్వాలంటూ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో దాదాపు గంటపాటు భేటీ అయిన జగన్ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీచేయాలని విజ్ఞప్తి చేయటం గమనార్హం. ఎందుకంటే ఇప్పటివరకు మూడు రాజధానుల ప్రతిపాదన అన్నది రాష్ట్రపరిధిలోనే నలుగుతోంది. ప్రభుత్వ ప్రతిపాదనకు అనుకూలంగా వ్యతిరేకంగా రాజకీయపార్టీల్లోను, న్యాయస్ధానాల్లోను అనేక …

Read More »