గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీలోని సీనియర్ నేతల్లో ఒకరైన దుట్టా రామచంద్రరావు పార్టీలో ఇమడలేకపోతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావుపై తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా వల్లభనేని వంశీ గెలిచారు. అయితే వైసీపీ అధికారంలోకి రావటంతో మారిన రాజకీయాల కారణంగా వంశీ టీడీపీకి దూరమయ్యారు. డైరెక్టుగా వంశీ వైసీపీలో చేరకపోయినా అనధికారికంగా అధికార పార్టీ ఎంఎల్ఏగానే కంటిన్యూ …
Read More »దేశంలో త్వరలోనే ఓ సంచలనం జరుగుతుంది: కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఓ సంచలనం జరుగుతుందని అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, కేజ్రీవాల్లతో చర్చలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “రాజకీయ నేతలు కలిసినప్పుడు రాజకీయాలే మాట్లాడుతాం. దేశంలో ఒక సంచలనం జరగాల్సి ఉంది, జరిగి తీరుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అందరూ చూస్తారు.” అంటూ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ …
Read More »కేంద్రం ఎఫెక్ట్: జగన్ వైపే జనం చూపులు
దేశంలో ఠారెత్తుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు భారీగా తగ్గించింది. పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు తగ్గించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలోని వైసీపీ సర్కారు వైపే ప్రజలు చూస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో నే పెట్రోల్, డీజిల్‌పై సుంకాలు.. వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై కొన్నాళ్లుగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయినా.. కూడా జగన్ సర్కారు …
Read More »షాకింగ్ న్యూస్: దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరల భారీ తగ్గింపు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ దేశ ప్రజలపై కరుణ కురిపించారు. పెట్రోల్ , డీజిల్ ధరలను భారీగా తగ్గిస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో నిత్యావసర వస్తువులు, సహా పెట్రోల్, డీజిల్, నిర్మాణ రంగ వస్తువుల ధరలు భారీగా పెరిగిన వేళ కేంద్ర ప్రభుత్వం ఆ భారాన్ని తగ్గించే దిశగా నిర్ణయాలు తీసుకుంది. చమురు, గ్యాస్, నిర్మాణ రంగ వస్తువులపై సుంకాలు తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై 8 …
Read More »కాంగ్రెస్‌లో చేరిన ఉద్యమ నేత..ఛాన్స్ మిస్ చేసుకున్న బీజేపీ..!
తెలంగాణ కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చినట్లేనా..? పోవడమే కానీ రావడం తెలియని ఆ పార్టీకి ఆ సీనియర్ నేత చేరికతో సరికొత్త జోష్ వచ్చిందా..? దీని వెనుక ఒక కీలక నేత చక్రం తిప్పారా..? ఒక మంచి అవకాశాన్ని బీజేపీ వదులుకుందా..? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానాలు ఇస్తున్నాయి ఆ పార్టీలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కుటుంబం తాజాగా కాంగ్రెసులో చేరిన …
Read More »సెగలు రేపుతున్న సీఎం జగన్ లండన్ టూర్
ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనపై టీడీపీ సీనియర్ నేత, శాసన మండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ దావోస్‌కు వెళ్లడానికి మాత్రమే సీబీఐ కోర్టు అనుమతి ఉందా? లండన్ వెళ్లేందుకూ అనుమతించిందా..? అన్నదానిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ లండన్ వెళ్లేందుకు సైతం అనుమతిస్తే.. అధికార పర్యటనలో ఎందుకు చేర్చలేదో చెప్పాలని నిలదీశారు. షెడ్యూల్లో లేని లండన్‌లో ఎందుకు ల్యాండ్ అయ్యారో రాష్ట్ర …
Read More »‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూసేందుకు బీజేపీని ఒప్పిస్తా’
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు బీజేపీని సైతం ఒప్పిస్తానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఆ పార్టీ అధిష్టానంతో దీనిపై చర్చిస్తానని తెలిపారు. గతంలో అమరావతి విషయంలో అమిత్‌షాను ఒప్పించిన అనుభవం తనకు ఉందని పవన్ గుర్తుచేశారు. పొత్తుల విషయంలోనూ అదే విధంగా ఒప్పించగలనన్న నమ్మకం ఉందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు ఎవరితోనైనా పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధమని ఇటీవల ప్రకటించిన …
Read More »డౌన్ డౌన్ జగన్.. తలపట్టుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు చేపడుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి నిరసనల సెగ తగులుతూనే ఉంది. పలుచోట్ల జనం సమస్యలపై నేతలను నిలదీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా విజయరాంపురంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్.. సొంత పార్టీ కార్యకర్తల నుంచే వ్యతిరేకత చవిచూడాల్సి వచ్చింది. మా కొద్దు ఈ ప్రభుత్వం అంటూ ఇక్కడ నినాదాలు చేయడంతో ఎమ్మెల్యే అక్కడ నుంచి వేగంగా వెళ్లిపోయారు. మరో వైపు.. డౌన్.. డౌన్ .. …
Read More »హైదరాబాద్ కు మోడీ.. ఢిల్లీకి కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కోపాన్ని భరించటం చాలా కష్టం. ఆయన ఒకసారి ఆగ్రహించటం మొదలు పెడితే..దాన్ని అక్కడితో ఆపరు. ఆయన ఆ పనిని నిరంతరం చేస్తూనే ఉంటారు. ఆయన అనుగ్రహం ఎంతటి సంతోషాన్ని ఇస్తుందో.. ఆగ్రహం అంతటి వేదనకు కారణమవుతుంటుంది. గడిచిన కొన్నేళ్లుగా ఆయన పట్టిందల్లా బంగారంగా మారటం.. కాలం ఆయనకు అనుకూలంగా ఉండటంతో ఆయనేం చేసినా.. ఆయనకు మేలు చేస్తుంటే.. ఆయన ప్రత్యర్థులకు మాత్రం ఇక్కట్లను తెచ్చి పెడుతోంది. …
Read More »ఒకవైపు తండ్రి, మరోవైపు కొడుకు
చంద్రబాబునాయుడుతో పాటు నారా లోకేష్ కూడా జనాల్లోకి వచ్చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలుపెట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు గడచిన 15 రోజులుగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఏ జిల్లాకు వెళ్ళినా ముందు పార్టీ నేతలతో, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. తర్వాత చిన్నపాటి సభలు, రోడ్డుషోలు నిర్వహిస్తున్నారు. తన పర్యటనలో అన్నీ ప్రాంతాలను టచ్ చేసేట్లుగా చంద్రబాబు ప్లాన్ చేసుకున్నారు. ఒకవైపు చంద్రబాబు పర్యటన జరుగుతుండగానే మరోవైపు లోకేష్ కూడా …
Read More »కేసీఆర్ ఢిల్లీ టూర్.. ఎవరిని కలవనున్నారు.. ఏం చేయనున్నారు ?
జాతీయస్థాయి పర్యటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ హస్తినకు చేరుకున్నారు. దేశ రాజకీయాలపై మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిసారించిన వేళ.. జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి నేతలతో చర్చలు జరిపిన గులాబీ బాస్ ఈ సారి జాతీయస్థాయిలో పలు రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతోనూ సమావేశం …
Read More »వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తాం: పవన్ కళ్యాణ్
జనసేనాని పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే రాష్ట్ర ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు.. మొత్తంగా 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగుతున్నట్టు ప్రకటించారు. తెలంగాణలోని చౌటుప్పల్ లో పర్యటిస్తున్న ఆయన ఇక్కడ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్త సైదులు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన భార్యకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనసేన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates