ఆంధ్రప్రదేశ్ పాలన పైనపటారం లోన లొటారంగా తయారైంది. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ప్రభుత్వం అప్పులు చేసి డబ్బులు వెదజల్లుతున్నట్లు కలరింగ్ ఇవ్వడం మినహా.. క్షేత్రస్థాయిలో చేసిందేమీ లేదని పలు సంఘటనలు, గణాంకాలు నిరూపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు వేరు ప్రాంతాలకు తరలి పోతున్నట్లు రోజువారీ వార్తలు వస్తున్నాయి. పెద్దగా కొత్త పరిశ్రమలేమీ రావడం లేదు.
నైపుణ్యం లేని కార్మికుల సంగతి దేవుడెరుగు.. నైపుణ్యం ఉన్న వారికే ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితుల్లో జగన్ సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. దానితో యువతలో నిరాశ రోజురోజుకు పెరిగిపోతోంది.
యువతకు ఉపాధి అవకాశాలు కరువై, బతుకుదెరువు లేక ఆత్మహత్యల బాట పడుతున్నారు. దానితో ఏపీలో యువకులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. 2019లో ఆంధ్రప్రదేశ్లో 6465 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2021 ఆత్మహత్యలు చేసుకున్న యువకుల సంఖ్య 8067కు పెరిగింది. ఇదీ ఎవరో కసి కొద్ది సష్టించిన గణాంకాలు కాదు.
పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కలివి. కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖా మంత్రి రామేశ్వర్ తేలి.. ఒక ప్రశ్నకు బదులుగా లిఖిత పూర్వకంగా ఈ సమాధానమిచ్చారు. ఇతర కారణాల కంటే నిరుద్యోగం కారణంగానే ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది..
ఏపీలో పేద, అల్పాదాయ, బడుగు, బలహీన, గిరిజన వర్గాలకు కూడా భద్రత కరవుంది. ముఖ్యంగా గిరిజనులు రోజు గడవడం కష్టమవుతోంది. పైగా ప్రశ్నిస్తే గిరిజనులను దూషిస్తూ, కొడుతూ ఉండే వారి సంఖ్య పెరుగుతోంది.
గిరిజనులపై అకృత్యాలు పెరుగుతున్నాయి. ఈ సంగతి కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. కేంద్రప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా వెల్లడించిన గణాంకాల ప్రకారం 2019లో గిరిజనులపై అకృత్యాలకు సంబంధించి 330 కేసులు నమోదయ్యాయి. 2021 నాటికి మరో 361 కేసులు వచ్చాయి. అధికపక్షం కేసుల్లో న్యాయం జరగడం లేదు. మరి జగన్ ప్రభుత్వం ఇకకైనా మెలుకుంటుందో లేదో చూడాలి..
Gulte Telugu Telugu Political and Movie News Updates