జ‌గ‌న్ పుట్టిన రోజు కానుక‌.. ఇక‌, ‘ఆ మాట’ మాట్లాడొద్దు!

ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాలు నిజంగానే షాకిస్తున్నాయి. ఏ ఉద్దేశంతో వీటిని తీసుకుం టున్నారో.. ప్ర‌బుత్వానికి అయినా తెలుసో లేదో.. కానీ, వీటి వ‌ల్ల వివాదాలే ఎక్కువగా తెర‌మీదికి వ‌స్తున్నాయి. కొన్నాళ్ల కింద‌ట‌.. క‌న్యాశుల్కం నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌పైనే నిషేధం విధించారు. అదేమంటే వైశ్యుల మ‌నోభావా లు దెబ్బ‌తినేలా ఉన్నాయంటూ.. వారి డిమాండ్‌మేర‌కు ఈ నిషేధం విధించిన‌ట్టు ప్ర‌భుత్వం తెలిపింది.

వాస్తవానికి బ‌లిజేప‌ల్లి ల‌క్ష్మీకాంతం క‌వి రాసిన క‌న్యాశుల్కంలో సామాజిక నీతి సూత్రం ఉంద‌ని.. అనేక మంది మేధావులు చెప్పారు. అయినా.. స‌ర్కారు వినిపించుకుంటే క‌దా! స‌రే.. ఇప్పుడు ఈ కేసు హైకోర్టులో ఉంది. క‌న్యాశుల్కం నాట‌కాన్ని పూర్తిగా ఇంగ్లీషులో అనువదించి ఇవ్వాల‌ని.. దానిని చ‌దివి తీర్పు వెల్ల‌డిస్తామ‌ని హైకోర్టు ఆదేశించింది. దీంతో పిటిష‌నర్లు ఇప్పుడు ఆ ప‌నిమీదే ఉన్నారు.

ఇదిలావుంటే, తాజాగా ఏపీ ప్ర‌భుత్వం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఏపీ సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు కాన‌క అనుకునేలా .. ఒక ప‌దంపై నిషేధం విధించింది. అదే.. “భ‌ట్రాజు పొగ‌డ్త‌లు” అనేది ఇక‌పై ఎవ‌రూ మాట్లాడ‌కూడ‌ద‌ని.. స్ప‌ష్టం చేస్తూ..బుధ‌వారం తెల్ల‌వారు జామున జీవోఇష్యూ చేసింది. సినిమాలు, టీవీల సీరియ‌ళ్లు, రాజ‌కీయ నేత‌ల ప్ర‌సంగాలు, బ‌హిరంగ స‌భ‌లు.. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల స‌మ‌యంలో కూడా ఈ ప‌దాన్ని వినియోగించ‌రాద‌ని స్ప‌ష్టం చేసింది.

ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు కాద‌ని ఎవ‌రైనా.. ఈ ప‌దం వినియోగిస్తే.. ఇండియ‌న్ పీన‌ల్‌కోడ్ 1860 ప్ర‌కారం.. చ‌ట్ట రీత్యా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీనికి మ‌రో వివ‌ర‌ణ ఏమి ఇచ్చిందం టే.. బీసీ సంఘాల ప్ర‌తినిధుల డిమాండ్ మేర‌కే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వివ‌రించింది. ఇదీ.. సంగ‌తి..!!