Trends

దెబ్బకు దిగి వచ్చిన మెటా.. భారత్ కు క్షమాపణలు

కొద్ది రోజుల క్రితం ఒక పాడ్ కాస్ట్ లో ప్రపంచ రాజకీయాల గురించి మాట్లాడిన ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు..మెటా అధినేత జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. సమన్లు పంపటం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 2024లో జరిగిన ఎన్నికల్లో ఏ అధికార పార్టీ కూడా విజయం సాధించలేదని పేర్కొన్నారు. అయితే.. జుకర్ చేసిన వ్యాఖ్యలు చాలా దేశాల్లో వాస్తవమే అయినా.. భారత్ …

Read More »

పాకిస్తాన్ కు రోహిత్?.. వెళ్లక తప్పదా?

అప్పుడెప్పుడో…2008లో దాయాది దేశం పాకిస్తాన్ లో భారత క్రికెట్ జట్టు పర్యటించింది. అదే ఏడాది పాక్ ఉగ్రవాదులు ముంబై ఫై జరిపిన దాడి నేపథ్యంలో పాక్ టూర్లను బీసీసీఐ దాదాపుగా రద్దు చేసింది. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ పాక్ లోనే జరుగుతోంది. అయినా కూడా టీమిండియా ఆ దేశానికి వెళ్లడం లేదు. టీమిండియా ఆడే మ్యాచులను దుబాయ్ లో ప్లాన్ చేసారు. ఫలితంగా పాక్ లో అడుగుపెట్టాల్సిన అవసరం …

Read More »

ఒలింపిక్ మెడల్స్ నాణ్యతపై రచ్చరచ్చ

ఒలిపింక్స్ అంటేనే… వరల్డ్ క్లాస్ ఈవెంట్. దీనిని మించిన స్పోర్ట్స్ ఈవెంట్ ప్రపంచంలోనే లేదు. అలాంటి ఈవెంట్ లో విజేతలకు ఇచ్చే పతకాల నాణ్యత ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పటిదాకా అసలు అనుమానాలే రాలేదు. అయితే… పారిస్ ఒలింపిక్స్ లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈ ఈవెంట్ మెడల్స్ ఫై గగ్గోలు పెడుతున్నారు. ఆలా తమ చేతికి వచ్చిన మెడల్ ఇలా రంగు వెలిసి పోయిందట. ఈ మేరకు భారత …

Read More »

ప‌సిడి గ‌నిలో ప్రాణాలు పోయాయ్‌.. 200 మంది మృతి!

అది బంగారు గ‌ని! త‌వ్వుకుంటే సిరులే!! కాక‌పోతే.. ఎలాంటి అధికారిక ఉత్త‌ర్వులు లేవు. అయినా.. కొందరు పేద‌లు.. ఈ గ‌నుల్లోకి వెళ్లి అంతో ఇంతో బంగారం తెచ్చుకుని గుట్టుమ‌ట్టుగా విక్ర‌యించుకుని జీవితాలను పోషించుకుంటున్నారు. ఇదంతా కొన్ని ద‌శాబ్దాలుగా జ‌రుగుతున్న‌దే. ఆయా గ‌నుల్లోని బంగారాన్ని ప్ర‌భుత్వం త‌వ్వించే అవ‌కాశం ఉన్నా.. ప్ర‌మాదాల కార‌ణంగా ఆయా గ‌నుల‌ను వ‌దిలేసింది. దీంతో అవి పేద‌ల‌కు వ‌రంగా మారాయి. అయితే.. ఈ ప‌నిని నేరంగా భావించిన …

Read More »

గంభీర్ మెడపై వేలాడుతున్న ‘ఛాంపియన్స్’ కత్తి

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఎందుకనో గానీ ఇటీవలి కాలంలో ఏ ఒక్కటీ కలిసి రావడం లేదు. టీమిండియా జట్టులో కీలక ప్లేయర్ గా రాణించిన గంభీర్.. ఆ తర్వాత ప్రతి విషయంలోనూ ప్రతికూల ఫలితాలనే చవిచూస్తున్నాడు. తాజాగా తన కెరీర్ లోనే టాప్ జాబ్ గా పరిగణిస్తున్న టీమిండియా హెడ్ కోచ్ పదవిని అతడు నిర్దేశిత గడువు కంటే ముందుగానే కోల్పోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. …

Read More »

YD రాజు కాదు… వెంకీ అంటే ఫ్యామిలీ రాజు !

ఇవాళ విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ఓపెనింగ్స్ కి ట్రేడ్ నివ్వెరపోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డుల వేట మొదలుపెట్టడం చూసి ఇదెక్కడి మాస్ అనుకోవడమొకటే తక్కువ. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి టికెట్ల కోసం వస్తున్న డిమాండ్ చూసి థియేటర్ మేనేజర్ల ఫోన్లు మ్రోగుతూనే ఉన్నాయట. అవతల పాజిటివ్ టాక్ వచ్చిన డాకు మహారాజ్ ఉన్నప్పటికీ మొదటి ఛాయస్ వెంకీ మామనే నిలవడం కొంత వరకు ఊహించిందే అయినా ఈ …

Read More »

స్టార్ బక్స్… దిగి రాక తప్పలేదా?

స్టార్ బక్స్… ఈ పేరు వింటేనే కుర్రకారుకి ఓ రేంజ్ ఉత్సాహం వస్తుంది. ఎప్పుడెప్పుడు అందులోకి ప్రవేశిద్దామా అంటూ కుర్రాళ్ళు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఇదంతా కాదండీ… స్టార్ బక్స్ పేరే ఓ బ్రాండ్. ఆ పేరు చెబితేనే రాజసం ఉట్టిపడుతుంది. ఇక అందులో దొరికే కాఫీ, స్నాక్స్ రుచి మధురమనే చెప్పాలి. అలాంటి స్టార్ బక్స్ కు ఇప్పుడు ఎలాంటి పరిస్థితి దాపురించిందో తెలుసుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. స్టార్ బక్స్ …

Read More »

మోకాళ్లపై తిరుమలకు క్రికెటర్ నితీష్

తెలుగు నేలకు గర్వకారణంగా నిలిచిన టీం ఇండియా యంగ్ అండ్ డైనమిక్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సంక్రాంతి వేళ కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడు తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్ళాడు. ఇక మెట్ల మార్గంలోని మోకాళ్ళ పర్వతం వద్ద అతడు తన మోకాళ్లపై మెట్లు ఎక్కాడు. ఈ వీడియోను అతడు తన సోషల్ మీడియా ఖాతాల్లో …

Read More »

ఎక్క‌డున్నా గెట్ స్టార్ట్‌.. వ‌చ్చేయండొచ్చేయండి!!

+ “పండ‌క్కి సెల‌వులు పెట్టారు. ఇప్పుడు ఎక్క‌డున్నారు. స‌రే.. ఎక్క‌డున్నా త‌క్ష‌ణ‌మే వ‌చ్చేయండి!“ + “మీ సెల‌వులు ర‌ద్దు చేస్తున్నాం. వెంట‌నే పెట్టేబేడా స‌ర్దుకుని ప్లేనెక్యేయండి!“ + “మీ దేశంలో గ‌డిపించి ఇక‌, చాలు వెంట‌నే బ‌య‌లుదేరి రండి“ + “ఈ నెల 20లోగా మీరిక్క‌డుండాలి. అంతే! మ‌రో మాటే వ‌ద్దు! గెట్ స్టార్ట్‌“ — ఇవీ ఇప్పుడు అమెరికాలో ప‌నిచేస్తున్న విదేశీయుల‌ను ఉద్దేశించి వారి వారి కంపెనీల యాజ‌మాన్య‌లు …

Read More »

రూ.1077 కోట్ల భవనం కార్చిచ్చుకు కాలి బూడిదైంది

కొద్ది రోజుల క్రితం రగులుకున్న మాయదారి కార్చిచ్చు.. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ మహానగరం ఇప్పుడు మరుభూమిగా మార్చింది. సంపదతో తులతూగుతూ.. విలాసవంత జీవనానికి కేరాఫ్ అడ్రస్ అన్నట్లు ఉండే ఈ మహానగరం.. ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. వేలాది ఇళ్లు కాలి బూడిద అయ్యాయి. వాటిల్లో అత్యంత ఖరీదైన భవనాలు ఉన్నాయి. ఈ కార్చిచ్చు కారణంగా జరిగిన ఆస్తి నష్టం దగ్గర దగ్గర రూ.15 లక్షల కోట్లకు పైనే ఉంటుందని …

Read More »

పాక్ సుడి తిరిగింది: నదిలో 33 టన్నుల బంగారు నిల్వలు

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కిందా మీదా పడుతున్న పాకిస్థాన్ దశ తిరిగే విషయం వెలుగు చూసింది. ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలో ఉన్న సింధూ నది లోయలో భారీగా బంగారు నిల్వల్ని గుర్తించారు. ఇక్కడ దగ్గర దగ్గర 32.6 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లుగా తేల్చారు. వీటి విలువ మన రూపాయిల్లో రూ.18వేల కోట్లుగా చెబుతున్నారు. అదే పాకిస్థాన్ రూపాయిల్లో చెప్పాలంటే 600 బిలియన్లుగా అంచనా వేస్తున్నారు. …

Read More »

చెప్పడానికి ఏం లేదు.. అంతా బూడిదే!!

అగ్ర‌రాజ్యం అమెరికాలో ధ‌నవంతులు నివ‌సించే ప్రాంతం అది! క‌డుక్కున్న కాళ్ల‌తో అక్క‌డ అడుగులు వేసినా ముద్ర‌ప‌డ‌తాయేమో.. మ‌ట్టి అంటుతుందేమో.. అని భావించేంత క్లీన్‌గా.. ముఖ‌మ‌ల్ వ‌స్త్రంతో తుడిచిన అద్దంగా అక్క‌డి ఇళ్లు మెరిసిపోతూ ఉంటాయి. ర‌హ‌దారులు కూడా క‌డిగిన కంచాల్లా.. త‌ళ‌త‌ళ మెరుస్తూ ఉంటాయి. ప్ర‌తి గంట‌కూ ఒక‌సారి రోడ్లు ప‌రిశుభ్రం చేస్తూనే ఉంటారు. ఆకు రాలినా.. కాయితం ప‌డినా.. వెంట‌నే తీసేస్తారు. అంత అందంగా.. అంత అద్దంగా మెరిసే …

Read More »