వారిది స్థితిమంతమైన కుటుంబం.. ఆ కుటుంబంలో పెళ్లంటే మాటలా…? విందులు, వినోదాలు, ఖర్చుకు కొదవేముంది.. అయితే ఇవన్నీ కాదనుకుని అదే ఖర్చుతో పేదల ఇళ్లలో పెళ్లిళ్లు జరిపించి తన మానవత్వాన్ని చాటుకున్నారా పెద్దాయన.
“పెళ్లి విందుకు కోటి ఖర్చు పెట్టేదేంటి?” అని ఒక రాత్రి ఆలోచించిన బారిస్టర్ హఫీజ్ మొహ్మద్ తాహుద్దీన్, ఆ ఆలోచన పక్కన పెట్టి సరికొత్త ఆలోచన చేసి అందరి మన్ననలను అందుకున్నారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ శివరాంపల్లిలో నివసించే ఆయన, మకర సంక్రాంతి రోజున కుమారుడి పెళ్లి పెట్టుకున్నారు. ముందుగా భారీ విందు ప్లాన్ చేశారు. మెనూలో బిర్యానీ నుంచి అదిరిపోయే తీపి పదార్ధాల వరకు అన్నీ సిద్ధం చేయసుకున్నారు. కానీ మధ్యలో మనసు మార్చకున్నారు.
“కుమారుడికి జీవితమంతా ఇచ్చేశాను పెళ్లి విందు కాస్త తగ్గితే ప్రపంచం కూలిపోదు” అని డిసైడ్ అయ్యారు. వెంటనే మిత్రుడు జఫర్ అహ్మద్ సిద్ధిఖి, సంక్షేమ సంఘ సభ్యులతో చర్చించారు. ఆ వెంటనే పెళ్లి ఖర్చుల భారంతో పెళ్లి విందు వాయిదా వేసుకుని..దానికి ఉద్దేశించిన కోటి రూపాయలతో పెళ్లికి సిద్ధంగా ఉన్న ఆరు పేద జంటలకు ఖరీదైన ఫర్నిచర్ అందించారు.
అదిరిపోయేలా వారి పెళ్లిళ్లు జరిపించారు. ఇక శనివారం జరగనున్న తన కుమారుడి పెళ్లి విందును భారీగా కాకుండా చిన్నగానే జరిపించాలని ఆయన నిశ్చయించుకున్నారట..! ఈ విషయం సోషల్మీడియాలో వైరల్ కావడంతో ఆయన పెద్ద మనసును చూసి అంతా అభినందనలు తెలుపుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates