భర్త కోసం చైన్ స్నాచర్ గా మారిన భార్య!

తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు… బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల నుంచి యువకులు బంగారు నగలు దొంగిలించే క్రైమ్ కథా చిత్రమ్ అది… ఓ రకంగా చెప్పాలంటే ఆ చిత్రం తర్వాత ఆ తరహా చైన్ స్నాచింగ్స్ విపరీతంగా పెరిగాయని విమర్శలు కూడా వచ్చాయి. 

తాజాగా హైదరాబాద్లో జరిగిన ఓ ఘటన ఆ చిత్రాన్ని తలపిస్తుంది. అయితే, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. భర్త చేసిన అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్ చేసిన భార్య ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మేడ్చల్ కు చెందిన రాజేష్ ను అనితా రెడ్డి అనే మహిళ కొద్ది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది‌. తాను చేసిన రూ.5 లక్షల అప్పు తీర్చాలని తపన పడుతున్న భర్తను చూసి అనితా రెడ్డి బెంగ పెట్టుకుంది. ఆ అప్పు ఎలాగైనా తీర్చాలని చైన్ స్నాచింగ్ చేయాలని డిసైడ్ అయింది.

లిప్ట్‌లో వెళ్తున్న ఓ మహిళ మెడలో బంగారం లాక్కునే ప్రయత్నం చేసింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో చేతికి అందిన అర తులం నల్లపూసల గొలుసుతో పారిపోయింది. బాధితురాలి ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అరగంటలోనే అనితా రెడ్డిని సనత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు.