Trends

ఏపీ వద్దంటున్న కంపెనీ లక్ష కోట్లకు ఎదిగింది

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ దివీస్ ల్యాబ్స్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం జిల్లాలోని కొత్తపాకల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక్కడ దివీస్ ఫ్యాక్టరీ నిలిపి వేయాలని, తాము అధికారంలోకి వస్తేఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపిస్తానని గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని స్థానిక రైతులు …

Read More »

రూ.5 ముఖవిలువ ఉన్న షేరుకు 19480శాతం డివిడెండ్!

నిజంగా నిజం. నమ్మలేని వాస్తవం. ఒక షేరు విలువకు ఏకంగా 19480 శాతం మధ్యంతర డివిడెండ్ ను ప్రకటించిన ఒక టెక్నాలజీ కంపెనీ సంచలనంగా మారింది. ఎప్పుడైనా.. ఏ కంపెనీ అయినా ఇంత భారీగా డివిడెండ్ ప్రకటించిందా? అనిపించేలా ఉన్న ఈ షేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ కంపెనీ పేరేమిటి? అది అందించే సేవలు ఏమిటి? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట …

Read More »

రూ.440 కోట్ల ఐఫోన్ల లూటీ?

కార్పొరేట్ సంస్థలకు కేరాఫ్ అడ్రస్‌ అయిన బెంగళూరులో జరిగిన ఓ అనూహ్య పరిణామం.. ఇప్పుడు భారత కార్పొరేట్ రంగాన్నే కుదిపేస్తోంది. బెంగళూరు శివార్లలో ప్రఖ్యాత మొబైల్ బ్రాండ్ ఐఫోన్‌ల తయారీ జరిగే విస్ట్రన్ ఫ్యాక్టరీపై ఆ సంస్థ ఉద్యోగులే దాడికి పాల్పడటం, వందల కోట్ల రూపాయల ఐఫోన్లను లూటీ చేయడం కలకలం రేపుతోంది. కరోనా టైంలో ఈ సంస్థ ఉద్యోగుల పట్ల అన్యాయంగా ప్రవర్తించిందట. నాలుగు నెలల పాటు జీతాలివ్వలేదట. …

Read More »

ఒకేసారి రెండు శతృదేశాలతో యుద్ధానికి రెడీ

ఒకేసారి ఇటు పాకిస్ధాన్ అటు చైనాతో యుద్ధం చేయటానికి భారత్ సైన్యం రెడీ అయిపోతోంది. ఎందుకన్నా మంచిదన్న ఉద్దేశ్యంతోనే ముందుజాగ్రత్తగా 15 రోజులకు సరిపడా మందుగుండు సామగ్రిని, ఆయుధాలు తదితరాలన్నింటినీ రెడీ చేసుకోమని కేంద్రప్రభుత్వం నుండి ఆదేశాలు అందాయి. ప్రస్తుతం మన దగ్గర 10 రోజులకు మాత్రమే సరిపడా నిల్వలున్నాయి. అదికూడా ఒక దేశంతో యుద్ధం వస్తేనే నిల్వలు సరిపోతుంది. కానీ కేంద్రం నుండి హఠాత్తుగా వచ్చిన ఆదేశాల కారణంగా …

Read More »

25 నుంచి సెకండ్ వేవ్ లాక్ డౌన్ రూల్స్ ?

Lockdown

ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభించబోతోందా ? అంటే అవుననే అంటున్నారు వైద్య నిపుణులు. జనవరి 15వ తేదీ నుండి మార్చి 15వ తేదీ మధ్యలో కరోనా వైరస్ మహమ్మారి మళ్ళీ రెచ్చిపోయే అవకాశం ఉందంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సెకండ్ వేవ్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపకుండా ముందస్తు చర్యలు తీసుకోవలంటూ నిపుణుల కమిటి ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికలు చేయటం కలకలం రేపుతోంది. గతంలో వచ్చిన మొదటిసారి …

Read More »

గంగూలీ ఇలా చేయడం కరెక్టేనా?

క్రికెటర్‌గా, క్రికెట్ పాలకుడిగా సౌరభ్ గంగూలీది ప్రత్యేకమైన ముద్ర. భారత క్రికెట్ సంక్షోభంలో ఉన్న సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలతో కళంకితుడైన అజహరుద్దీన్ స్థానంలో టీమ్ ఇండియా పగ్గాలందుకుని తిరుగులేని స్థాయికి చేర్చిన ఘనత అతడిదే. ఇక ఆట నుంచి నిష్క్రమించాక తక్కువ సమయంలోనే బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత అనూహ్యంగా గత ఏడాది బీసీసీఐ పగ్గాలు కూడా అందుకున్నాడు. ఇంత తక్కువ సమయంలో ప్రపంచ క్రికెట్‌ను …

Read More »

లాక్డౌన్లో కృష్ణుడి కథలు

లాక్డౌన్ సమయాన్ని ఒక్కొక్కళ్లూ ఒక్కోలా గడిపారు.కానీ వనం జ్వాలా నరసింహారావు గారంత ఫలవంతంగా వాడుకున్న వారు చాలా అరుదు.ఏదో సంకల్పించి, మొదలుపెట్టి నెమ్మదిగా సాగదీయకుండా…328 పేజీల కథల పుస్తకాన్ని 48 రోజుల్లో రాసేసి, అచ్చువేసేయడం అంటే మామూలు విషయం కాదు. ఇందులోని కథలన్నీ భాగవతంలోనివి. అది కూడా పోతన భాగవతంలో నిక్షిప్తమై ఉన్నవి. వనం జ్వాలానరసింహారవు గారు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి వద్ద పధాన …

Read More »

ఐపీఎల్-14 ఇండియాలోనే.. ఇదిగో రుజువు

ఈ ఏడాది వేస‌విలో జ‌ర‌గాల్సిన ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ 13వ సీజ‌న్ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ‌టం.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో యూఏఈలో ప్రేక్ష‌కులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో లీగ్‌ను నిర్వ‌హించ‌డం తెలిసిన సంగ‌తే. ఐతే క‌రోనా క‌ష్ట కాలంలో జ‌నాల‌కు గొప్ప ఉప‌శ‌మ‌నంగా క‌నిపించిన ఐపీఎల్ సూప‌ర్ హిట్ట‌యింది. అంచ‌నాల్ని మించి ఆద‌ర‌ణ సంపాదించుకుంది. భారీగా ఆదాయం ఆర్జించి పెట్టింది. ఈ ఉత్సాహంలో కొత్త ఏడాదిలో షెడ్యూల్ ప్ర‌కారం ఏప్రిల్, …

Read More »

ఫైజర్ కరోనా టీకా వీళ్ళకి నిషేధం..

ప్రముఖ ఫార్మాసంస్ధ ఫైజర్ కరోనా వైరస్ యాంటీ వ్యాక్సిన్ తయారు చేసిన విషయం తెలసిందే. తాము డెవలప్ చేసిన టీకాను ఎలర్జీలున్న వాళ్ళు వేయించుకోవద్దంటూ స్పష్టంగా యాజమాన్యం ప్రకటించేసింది. ఆహారంతో పాటు మందులు, ఇతరత్రా ఎలర్జీలున్న వాళ్ళు తాము తయారు చేసిన కోవిడ్ టీకాను వేయించుకోవద్దంటూ బహిరంగంగానే హెచ్చరించింది. ఎందుకంటే బ్రిటన్లో ఇప్పటికే వేలాదిమంది ఫైజర్ తయారుచేసిన కరోనా టీకాను వేయించుకుంటున్న విషయం తెలిసిందే. ఫైజర్ రెడీ చేసిన టీకాను …

Read More »

వింత వ్యాధికి అసలు కారణం బయటపడిందా ?

ఏలూరులో కలకలం రేపుతున్న వింతవ్యాధికి అసలు కారణాన్ని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. క్రిమిసంహార మందుల్లో ఉండే ఆర్గానో క్లోరిన్ కారణంగానే మనుషుల మెదడుపై తీవ్ర ప్రబావం చూపుతున్నట్లు గుర్తించారు. పంటల్లో వాడే క్రిమిసంహారక మందులు, దోమలు, బొద్దింకలు, ఈగలు తదితర క్రిమిసంహారకాలకు వాడే రశాయనాలు తాగునీటిలో విపరీతంగా కలిసిపోయినట్లు శాస్త్రజ్ఞులు గుర్తించారు. నీటిలో ఉండాల్సినదానికన్నా కొన్ని వేల రెట్లు క్రిమిసంహారకాలు చేరిపోయినట్లు నీటి శాంపుల్సు పరీక్షల్లో తేలింది. వింతవ్యాధికి కారణాలపై ఇప్పటికే …

Read More »

‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ ఇస్తే తీసుకెళ్లి..

అంతర్జాతీయ క్రికెట్లో అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికర ఉదంతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒక సీనియర్ ఆటగాడికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లేదా ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు ఇస్తే.. వాటికి తమ కంటూ జూనియర్లు అర్హులని, వారిదే మెరుగైన ప్రదర్శన అని కొందరు సీనియర్లు వాళ్ల చేతిలో పెట్టేస్తుంటారు. ఇలాంటి ఉదంతాలు అరుదుగానే జరుగుతుంటాయి. చాలా కాలం తర్వాత అలాంటి దృశ్యం.. భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ముగింపు …

Read More »

2020కు మించి 2021? నోస్ట్రడామస్ అంచనాలు ఇవేనట

భవిష్యత్తు ఎలా ఉంటుంది? అన్నంతనే తెలుగువారికి పోతులూరు వీరబ్రహ్మం స్వామి గుర్తుకు వస్తే.. విదేశీయులకు నోస్ట్రడామస్ గుర్తుకు వస్తారు. వందల ఏళ్ల క్రితమే.. భవిష్యత్తులో ఏం జరుగుతుందన్న విషయాల్ని ముందే ఊహించటం.. అవన్నీ జరగటం లాంటివి చూసినప్పుడు.. వీరు చెప్పిన జోస్యాల్ని సింఫుల్ గా తీసుకోలేం. కరోనా కారణంగా 2020 ఎప్పుడెప్పుడో అయిపోతుందా? అని ఎదురుచూస్తున్న ప్రపంచానికి 2021 గురించి నోస్ట్రడామస్ ఏం చెప్పాడన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే …

Read More »