అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. క్రికెట్ దేవుడిగా కీర్తించే భారతరత్న సచిన్ టెండూల్కర్ నివాసం ఎదుట ఒక రాజకీయ నాయకుడు భారీ ఎత్తున నిరసన చేపట్టటం షాకింగ్ గా మారింది. ముంబయిలోని ఆయన ఇంటి ఎదుట ప్రహార్ జనశక్తి పక్ష ఎమ్మెల్యే బడ్చూ కాడూ నిరసన చేపట్టారు. తన అనుచరులతో కలిసి భారీ నిరసన చేపడుతూ.. సచిన్ టెండూల్కర్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు.
యూత్ జీవితాల్ని నాశనం చేసే ఆన్ లైన్ గేమ్స్ కు ప్రచారం చేయాల్సిన అవసరం సచిన్ కు ఏముందని ప్రశ్నించిన ఆయన.. ఆన్ లైన్ గేమ్స్ కు ప్రచారకర్తగా ఉండటాన్ని ప్రశ్నించారు. టెండూల్కర్ కు ఇచ్చిన భారతరత్నను వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఫస్ట్ గేమ్స్ పేరున ఒక ఉత్పత్తికి సచిన్ ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. బ్యాటింగ్ టు బెట్టింగ్ అన్న క్యాప్షన్ కు పక్కనే సచిన్ ఫోటో ఉండటాన్ని తప్పు పడుతున్నారు.
బెట్టింగ్ సంస్థలకు సచిన్ ప్రచార కర్తగా ఎలా ఉంటారన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. ఇప్పటికైనా సరే.. ఆన్ లైన్ గేమ్స్ కు సచిన్ ప్రచారకర్తగా వైదొలగాలన్నారు. ఒకవేళ తాము చెప్పినట్లుగా ప్రచారకర్తగా సచిన్ వైదొలగని పక్షంలో ప్రతి గణేశ్ మండపం వద్ద ధర్నా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. సచిన్ నివాసం ముందు ఎమ్మెల్యే.. అతడి అనుచరులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టటంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బచ్చూతో పాటు మరో 22 మందికి పైగా ఉన్న అతడి మద్దతుదారుల్ని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates