హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద ఘోర ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ తో దూసుకెళ్లే స్నేహితుడి బైక్ మీద ప్రయాణించటమే ఆమె తప్పైంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కోల్ కతాకు చెందిన 22 ఏళ్ల స్విటీ పాండే మరణించింది. ఆమె తన స్నేహితుడు రాయన్ ల్యుకేతో కలిసి జేఎన్ టీయూ నుంచి ఐకియా వైపు టూ వీలర్ మీద వెళుతున్నారు.
మితిమీరిన వేగంతో దూసుకెళుతున్న ఈ వాహనం.. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద అదుపు తప్పింది. వేగం వల్ల దాన్ని కంట్రోల్ చేసే క్రమంలో యువకుడు ఫెయిలై బైక్ ను ఫ్లైఓవర్ గోడను ఢీ కొట్టాడు. అతి వేగం వల్ల వెనుక కూర్చున్న స్వీటీ ఒక్కసారిగా గాల్లో ఎగిరి.. ఫ్లైఓవర్ పై నుంచి కిందకు పడిపోయింది. రెప్పపాటులో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో సదరు యువతి తీవ్రంగా గాయపడింది.
మరోవైపు బైక్ ను ఫ్లైఓవర్ గోడను ఢీ కొట్టిన రాయన్ ల్యుకేకు గాయాలయ్యాయి. వీరిద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ స్విటీ పాండే కన్నుమూసింది. ఈ ఉదంతంపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడి బాధ్యతారాహిత్యానికి యువతి బలైంది. మహానగరంలో ఇటీవల కాలంలో టూ వీలర్లను వాయు వేగంతో నడటం ఫ్యాషన్ గా మారుతూ తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీనిపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉంటూ.. ప్రమాదాల్ని హెచ్చరించాల్సిన అవసరం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates