Political News

పులివెందులలో వైసీపీ ముందే చేతులెత్తేసిందా?

పులివెందుల జెడ్పిటిసి ఉప ఎన్నికల్లో వైసీపీ ముందే చేతులెత్తేసిందా? గత నాలుగు దశాబ్దాలలో ఎప్పుడూ లేనంత ప్రతిఘటనను ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబం ఎదుర్కొంటుందా? అంటే పులివెందుల తాజా రాజకీయ వాతావరణం చూస్తుంటే అవుననే చెప్పాలి. పులివెందుల జెడ్పిటిసికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ జెడ్పిటిసి పరిధిలో మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఏజెంట్లను బూత్‌లలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఇతర నియోజకవర్గాల …

Read More »

‘లిక్కర్ కేసు’: ఆ డబ్బంతా ఎవరికి చేరింది?

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం వ్యవహారంపై విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తాజాగా మరో చార్జిషీట్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు సమర్పించారు. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి గతంలోనే సుదీర్ఘ చార్జిషీట్‌ను అధికారులు సమర్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో అనుబంధ చార్జిషీట్‌ను ఇచ్చారు. దీనిలో అసలు నగదు ఎక్కడ నుంచి ఎలా వచ్చింది? ఈ నగదు చివరి లభ్ధిదారువరకు ఏయే మార్గాల్లో తరలింది? అనే …

Read More »

ఓట‌ర్లే మైనా.. మీకే ఓటేస్తామ‌ని చెప్పారా?: వైసీపీకి హైకోర్టు షాక్

ఏపీ ప్రతిపక్షం వైసీపీకి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. “సమయం లేదు. ఇప్పుడు ఏం చేయలేం” అని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ వెనక్కి తగ్గింది. ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీకి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇది మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ ఉప పోరును టీడీపీ, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జగన్ సొంత నియోజకవర్గంలో పాగా వేయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. తమ సత్తా చాటుకునేందుకు …

Read More »

టార్గెట్ రోజా.. ఇక యాక్షనే!

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజాకు టెన్షన్ పట్టుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్రంలో యువతను ప్రోత్సహించేందుకు క్రీడలు నిర్వహించారు. దీనికి సంబంధించి 150 కోట్లకు పైగా అప్పటి వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. కేవలం రెండేళ్ల కాలంలో ఏడాది పాటు నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఇంత పెద్ద మొత్తం కేటాయించడం, ఈ నిధులు కూడా చాలవని …

Read More »

సునీత ప్రశ్నలు.. సమాధానం చెప్పేదెవరు..!

వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత బాధ ప్రపంచం బాధగా మారింది. నిజానికి తండ్రిని కోల్పోయిన బాధ ఎవరికైనా ఉంటుంది. అందునా, అయినవాళ్లే (ఆమె ఆరోపిస్తున్నట్టు) దారుణంగా నరికి చంపితే, కనీసం దీనిలో బాధ్యులు ఎవరో కూడా తెలియకపోతే ఎవరికైనా బాధ కలుగుతుంది. అదే బాధ, అంతకుమించి అన్నట్టుగా సునీత ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆరు ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఎవరు దోషులో తెలియని పరిస్థితి కొనసాగుతోంది. సునీతపైకి చెబుతున్నా, …

Read More »

పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ, ఢిల్లీలో హై టెన్షన్

2024 లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొంతకాలంగా సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, ఆ బాంబు పేలుస్తానని రాహుల్ గాంధీ చేస్తున్న కామెంట్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇదే సమయంలో బీహార్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టడాన్ని రాహుల్ గాంధీ, …

Read More »

ఆపరేషన్ ఆకర్ష్.. బీజేపీకి కలిసివచ్చేదెంత

రాజకీయాల్లో చేరికలు, కూడికలు కామనే. వీటికి కూడా సమయం, సందర్భం ఉంటుంది. అయితే ఎలాంటి సందర్భం లేకుండానే తెలంగాణ బీజేపీ ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ దిశగా అడుగులు వేస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి తాజాగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరికతో భవిష్యత్తులో భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశంపై కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ ఆకర్ష్‌ను మరింత తీవ్రం చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు …

Read More »

నాడు కుప్పం నేడు పులివెందుల!

అధికారంలో ఉంటే ఒకరకంగా, అధికారం పోయాక మరొరకంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తాయన్న పేరుంది. దీనికి వైసీపీ చేస్తున్న రాజకీయాలే ఉదాహరణగా మారాయని అంటున్నారు పరిశీలకులు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలను మరిచిపోయినట్టు వ్యవహరిస్తోందని టీడీపీ నేతల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతోంది. దీనిలో ఎవరు గెలిచినా మహా అయితే ఏడాదిన్నర మాత్రమే పదవిలో ఉంటారు. అయినప్పటికీ, …

Read More »

తిరుమ‌ల‌లో రాజకీయాలేంది జగన్ మేనమామా?

జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తిరుమలలో రాజకీయ చిందులు తొక్కారు. తిరుమల పవిత్రతకు ఓ నాయకుడిగా పెద్దపీట వేయాల్సిన ఆయన, టీడీపీని, కూటమి ప్రభుత్వాన్ని తిడుతూ, తిరుమల శ్రీవారి ఆలయం ముందే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఆయన విమర్శలు గుప్పించారు. వాస్తవానికి తిరుమలలో రాజకీయ విమర్శలు చేయొద్దంటూ పాలక మండలి కొన్ని వారాల కిందట తీర్మానం …

Read More »

పాలిటిక్స్ బాలేవు.. వ‌ద్దులే: కీల‌క వార‌సుల మాట..!

సాధార‌ణంగా రాజ‌కీయాల్లో ఉన్న వారు తమ వార‌సుల కోసం ఎంతో ప్ర‌య‌త్నం చేస్తారు. వార‌సులు వ‌స్తే రాజ‌కీయాలు కొన‌సాగుతాయ‌ని, తమ హవా నిల‌బ‌డుతుంద‌ని కూడా అంచ‌నా వేసుకుంటారు. ప్ర‌స్తుత మంత్రులుగా ఉన్న‌వారిలో టీజీ భ‌ర‌త్ వార‌సత్వంగానే రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. మంత్రి అయ్యారు. ఇక ఎమ్మెల్యేల్లోనూ ప‌దుల సంఖ్య‌లో వార‌సులు ఉన్నారు. అయితే రాను రాను వీరి సంఖ్య పెరుగుతుంద‌ని భావించేవారు కూడా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి స‌గానికి పైగా …

Read More »

ఎస్‌.. మనం కూడా: జగన్ కీలక నిర్ణయం..!

రాజకీయాల్లో ఒకరిని అనుసరించడం తప్పుకాదు. తమకు అనుకూలంగా ఉంటే, ఎవరు దేనినైనా అనుసరిస్తారు. అనుకరిస్తారు కూడా. ఈ క్రమంలో తాజాగా వైసీపీ కూడా కాంగ్రెస్ పార్టీని అనుసరించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ఒకే ఇంటి నెంబరుతో వేలాది ఓట్లు వేయించారని, ఒకే వ్యక్తి పేరుతో వేల ఓట్లు సృష్టించారని కూడా ఆరోపిస్తున్నారు. …

Read More »

ట్రంప్ టారిఫ్‌ల సెగ.. అమెరికన్లకు మండుతోంది!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాలపై విధిస్తున్న సుంకాలు ఇప్పుడు అక్కడి ప్రజల జేబులపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, దుస్తులు, బ్యాగులు వంటి రోజువారీ ఉపయోగపు వస్తువుల ధరలు పెరిగిపోయాయని ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. సుంకాల కారణంగా షాపుల్లో ఒకే వస్తువు ధర కొద్ది నెలల వ్యవధిలోనే గణనీయంగా పెరిగిందని వారు చెబుతున్నారు. ఈ పెరుగుదలపై సామాజిక మాధ్యమాల్లో గగ్గోలు పెడుతూ, ట్రంప్ విధానాలపై విమర్శలు …

Read More »