ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి వచ్చేసింది. బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ రూ.లక్షా 10 వేల కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు. వైసీపీ హయంలో తిరిగి వెళ్ళిపోయిన రిన్యూ కంపెనీ ఏపీకి తిరిగి వస్తుందంటూ నిన్న లోకేష్ బిగ్ బ్రేకింగ్ ఇచ్చారు. ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాత బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ రాష్ట్రంలో 12 బిలియన్ డాలర్లు (₹1.1 లక్ష కోట్ల) పెట్టుబడులకు ముందుకు వచ్చిందంటూ ఆయన ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఇది మరో భారీ పెట్టుబడి అని ప్రకటించారు.
ఈ పెట్టుబడులు పునరుత్పత్తి శక్తి, బ్యాటరీ మరియు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, సౌర తయారీ రంగంతో పాటు వివిధ డీకార్బనైజేషన్ కార్యక్రమాల్లో వినియోగిస్తారని తెలిపారు. అదనంగా బ్రూక్‌ఫీల్డ్ సంస్థ డేటా సెంటర్లు, కమర్షియల్ రియల్ ఎస్టేట్, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, మౌలిక వసతులు, పోర్టులు వంటి విభిన్న రంగాలలో కూడా భాగస్వామ్యం కానుందని ఆయన వెల్లడించారు. ఈ మెగా ఇన్వెస్ట్‌మెంట్‌తో ఆంధ్రప్రదేశ్‌ను స్థిరమైన, మార్పును నడిపించే పెట్టుబడుల గ్లోబల్ హబ్‌గా మరింతగా నిలబెట్టే అవకాశం ఉందని లోకేష్ ప్రకటించారు.
ఇదే కాదు నారా లోకేష్ కృషితో రాష్ట్రానికి మరో డేటా సెంటర్ వచ్చింది. విశాఖపట్నంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో అమెరికాకు చెందిన టిల్‌మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ 300 మెగావాట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఐదేళ్ల జగన్ హయాంలో ఎస్ఐపిబి సమావేశాలు చాలా అరుదుగా జరిగాయి. కానీ కూటమి ప్రభుత్వ హయాంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏడాదికాలంలో 12 సమావేశాలు జరిగాయి. అంటే దాదాపుగా నెలకి ఒక సమావేశం జరిగింది. అంటే ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనేది ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే ఇప్పుడు భారీ పెట్టుబడులు రావడానికి కారణం అవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates