ఏపీలోని కూటమి ప్రభుత్వ కీలక భాగస్వామ్య పార్టీ జనసేన ముఖ్య నాయకుడు, కొత్త ఎమ్మెల్సీగా ఇటీవల ఎన్నికైన కొణిదెల నాగబాబు.. తొలిసారి శాసన మండలిలోకి అడుగు పెట్టారు. గురువారం నుంచి అసెంబ్లీ, శాసన మండలి వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు.. నాగబాబు తొలిసారి వచ్చారు. దీనికి ముందు ఆయన.. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి.. పార్టీ అధినేత, తన సోదరుడు పవన్ కల్యాణ్ను కలుసుకున్నారు. మండలిలో ప్రస్తావించాల్సిన …
Read More »అయ్యన్నకు కోపమొచ్చిన వేళ.. ఏపీ అసెంబ్లీలో చిత్రం!
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి మరోసారి కోపం వచ్చింది. గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలి ప్రాధాన్య అంశంగా ప్రశ్నోత్తరాలు సమయానికి సమయం కేటాయిస్తారు. ఇది నిబంధనల ప్రకారం జరిగే కార్యక్రమం. ఈ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సభ్యులు ఏ ప్రశ్నలు అడిగారు.. మంత్రులు ఎలాంటి సమాధానం చెప్పారు.. అనే విషయాలను అసెంబ్లీ అధికారులు నమోదు చేసుకోవాలి. వాటిని రికార్డు …
Read More »జీఎస్టీ రిఫార్మ్… ఏపీకీ గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు
జీఎస్టీ సంస్కరణలు రాష్ట్రానికి గేమ్ ఛేంజ్గా మారనున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీలో సుదీర్ఘ ఉపన్యాసం చేసిన ఆయన.. జీఎస్టీ సంస్కరణలపై మాట్లాడారు. పన్నుల తగ్గింపుతో పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. గతంలో పన్నులను సరళీకరించడం ద్వారా ప్రస్తుతం 2 రకాల శ్లాబులకు మాత్రమే పరిమితం చేశారన్నారు. తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. ధరలు తగ్గడంతో ఆయా వస్తువుల కొను గోలు పెరిగి.. అదేసమయంలో రాష్ట్రానికి కూడా …
Read More »మార్షల్స్ పై లోకేష్ ఆగ్రహం.. రీజనేంటి?
అసెంబ్లీ మార్షల్స్ పై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రస్తుతం ఉన్నది వైసీపీ ప్రభుత్వం అనుకుంటున్నారా?” అని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, మార్షల్స్ హెడ్ను తన కార్యాలయానికి రావాలని కూడా సూచించారు. దీంతో మార్షల్స్ హెడ్ ఆయనను కలిసి వివరణ ఇచ్చారు. ఇక నుంచి ఇలాంటివి జరగబోవని హామీ ఇచ్చారు. అయితే ఇక నుంచి ఈ ఘటనలు రిపీట్ అయితే సహించేది లేదని నారా లోకేష్ తేల్చిచెప్పారు. …
Read More »టీడీపీలో గ్రీష్మ.. ఏం చేస్తున్నారు చెప్మా.. !
టిడిపి అధినేత సీఎం చంద్రబాబు ఎవరికైనా పదవులు ఇచ్చినా.. ఎవరికైనా అవకాశాలు కల్పించినా.. వారి నుంచి మరింత ప్రయోజనం ఆశిస్తారు. ఇది సహజం. రాజకీయాలైనా వ్యాపారమైనా ఒక రూపాయి పెట్టుబడి పెడితే పది రూపాయలు ఆదాయాన్ని కోరుకున్నట్టుగానే ఒక వ్యక్తికి ఏదైనా పదవి ఇచ్చినప్పుడు ఆ పదవి ద్వారా ఆ పార్టీ ప్రయోజనాలు.. ఆ పార్టీకి సంబంధించిన అనుకూల అంశాలను కోరుకోవడం తప్పేమీ కాదు. ఇది ఆది నుంచి జరుగుతున్న …
Read More »ఏపీ అసెంబ్లీ: వారు రారు.. వీరూ లేరు!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. వర్షాకాల సమావేశాల్లో కీలకమైన నాలుగు బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో సభకు అందరూ రావాలని పదేపదే స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా అధికారులు కూడా ఎమ్మెల్యేలకు సమాచారం అందించారు. వైసిపి ఎలాగూ రావడం లేదు. కాబట్టి ఆ పార్టీ నాయకులను ఆ పార్టీ అధినేతను కూడా …
Read More »సర్కారు లెక్క: 10 వేల కోట్లు ఉంటే పరిష్కారం.. !
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలను గమనిస్తే ప్రభుత్వం పై విమర్శలు పెరుగుతున్నాయి. అదేవిధంగా నిరసనలు ఉద్యమాలు కూడా తెరమీదకు వస్తున్నాయి. మరి వీటికి కారణం ఏంటి అంటే జస్ట్ పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ సమస్యలు ఉండవన్నది అధికారులు తాజాగా చెబుతున్న మాట. ప్రస్తుతం రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. వైసీపీ హయంలో మూడు క్వార్టర్లు ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వంలో మూడు క్వార్టర్ల ఫీజును విద్యార్థులకు …
Read More »సభకు రాకుంటే.. జీతం కట్: అసెంబ్లీ కీలక తీర్మానం!
అసెంబ్లీకి రాకుండా వేతనాలు తీసుకోవడంతో పాటు తరచుగా గైర్హాజరవుతూ ఏదో మొక్కుబడిగా సభకు వచ్చే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు ముందు మంత్రులు, పార్టీ విప్లు, అదేవిధంగా ముఖ్య నాయకులతో సమావేశమైన చంద్రబాబు నాయుడు, వైసీపీ నాయకులు సభకు రాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా సభకు రాకుండా జీతాలు తీసుకోవడం సరికాదన్నది.. గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న …
Read More »వైసీపీ కీలక నాయకురాలి ‘సైడ్ విజన్.. !’
రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికీ ఎలాంటి అవకాశం వస్తుందో.. ఎవరు ఎటువైపు మారుతారో అనేది చెప్పడం కష్టం. ‘అవసరం-అవకాశం’ అనే రెండు పట్టాలపై ప్రయాణం చేసే రాజకీయ నాయకులు.. తమ అవసరానికి తగిన విధంగా రాజకీయాలను మార్చుకోవడం అనేది పార్టీలు మారడం అనేది తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైసీపీకి చెందిన ఎం ఎల్ సి ఒకరు టిడిపికి టచ్ లోకి వెళ్లారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల …
Read More »సందడి లేని బీఆర్ఎస్ భవన్!
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కీలకమైన సెప్టెంబరు 17(తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం)నాడు మౌనంగా ఉండిపోయింది. వాస్తవానికి సెప్టెంబరు 17ను ప్రజాపాలన దినోత్సవంగా ప్రారంభించిందే.. అప్పటి సీఎం కేసీఆర్. ఆయన అధికారంలో ఉన్న పది సంవత్సరాలు కూడా.. ఈ రోజు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబురాలు చేశారు. ఇక, పార్టీ కార్యాలయంలో ఆటా పాటలతోపాటు విందులు కూడా ఏర్పాటు చేశారు. అప్పటి సీఎం కేసీఆర్.. ఘనంగా ఈ కార్యక్రమాల్లో …
Read More »నారా లోకేష్ కేరాఫ్ ఇంటర్నేషనల్… !
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రభావం అంతర్జాతీయ స్థాయికి చేరిందా? నిన్న మొన్నటివరకు ఢిల్లీలో రాజకీయాలు చేయడంలో ఆయన దూకుడుగా వ్యవహరించారు.. ఇప్పుడు ఆయన ప్రభావం అంతర్జాతీయ స్థాయికి చేరేలాగా వ్యవహరిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో సింగపూర్ తాజాగా లండన్లో పర్యటించిన నారా లోకేష్ అక్కడి పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. వాస్తవానికి సీఎం చంద్రబాబుతో కలిసి నారా లోకేష్ గాని ఇతర మంత్రులు …
Read More »సమరం లేదు.. `సభ` ఏకపక్షమే!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అంటే.. అధికార విపక్షాల మధ్య హోరా హోరీ వాదనలు.. సవాళ్లు.. ప్రతిసవాళ్లకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఇటీవల తెలంగాణలోనూ ఇలాంటి వాతావరణమే కనిపించింది. అధికార పక్షం కాంగ్రెస్… ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ ఎస్ మధ్య తీవ్రస్తాయిలో మాటల యుద్ధం జరిగింది. అంశం ఏదైనా కూడా సభలో ప్రతిపక్షం ఉంటేనే ఒక విధమైన చర్చ సాగుతుంది. కానీ, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates