నట సింహం, టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై ఏపీ సీఎం జగన్ తొలిసారి తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీ వినీ ఎరుగని రీతిలో విమర్శలు గుప్పించారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థపై రాజకీయం జరుగుతున్న విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వలంటీర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌లో వారి పాత్ర ఉందని ఆయన చెప్పారు.
అయితే.. దీనిపై ఇప్పటికే వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. మంత్రుల నుంచి నాయకుల వరకు.. పవన్‌పై నిప్పులు చెరిగారు. అదేసమయంలో వలంటీర్లు కూడా పవన్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఇక, పవన్‌పై కేసులు నమోదు చేసేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. ఇలా.. పవన్ వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతూనే ఉన్నాయి.
ఇప్పుడు తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లావెంకటగిరిలో పర్యటించిన సీఎం జగన్.. ఈవ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అయితే.. ఆయన ఈ సందర్భంగా నటుడు బాలయ్య ను ఈ విషయంలోకి లాగడం సంచలనంగా మారింది. జగన్ మాట్లాడుతూ.. మంచి చేస్తున్న వ్యవస్థలను, మంచి చేసే మనుషులనూ సంస్కారం ఉన్న ఎవరూ విమర్శించరని వ్యాఖ్యానించారు.
“చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, బావమర్ది(బాలయ్య) క్యారెక్టర్ ఎలాంటిదో అందరికీ తెలుసు. యూట్యూబ్‌లో చూస్తే ఒకరు “అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ, స్విమ్మింగ్‌పూల్‌లో అమ్మాయిలతో కనిపిస్తాడు”. మరొకరు “అమ్మాయి కనిపిస్తే ముద్దులు పెట్టాలి.. కడుపైనా చేయాలి” అంటాడు. ఇంకొకరు “టీవీ షోకి వెళ్లి.. బావా మీరు సినిమాల్లో చేశారు.. నేను నిజంగా చేశాను” అంటాడు. ఇంకొకడిదేమో “బాబుతో పొత్తు.. బీజేపీతో కాపురం. ఇచ్చేది బీఫాం.. టీడీపీకి బీ టీం” అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates