వైసీపీ ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. రాజకీయాల్లో అయినా..ఉద్యోగాల్లో అయినా.. ఇవన్నీ కామనే. తమకు అవకాశం ఉంటే ఉంటారు. లేకపోతే వెళ్తారు. కానీ, ఆళ్ల విషయానికి వస్తే.. ఇతర నేతలకు.. ఈయనకు తేడా ఉంది. ప్రధానంగా మూడు కీలక లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒకటి విధేయత, రెండు వివాదాలకు దూరం, మూడు జగన్‌పై అపార నమ్మకం, విశ్వాసం, నాలుగు చిన్న వయసు. ఇన్ని …
Read More »జనసేన అష్టదిగ్భంధం.. పవన్ నిర్ణయం ..!
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల దూకుడుకు ఆయన అష్టదిగ్భంధం వేశారు. సహజంగానే పార్టీ అధికారంలోకి వచ్చాక.. అది ఏ పార్టీ అయినా.. కార్యకర్తలు, నాయకుల దూకుడు ఎక్కువగానే ఉంటుంది. అది ఇప్పటికిప్పుడు కాకపోయినా.. వచ్చే నాలుగేళ్లలో కనిపిస్తుంది. రాక రాక వచ్చిన అధికారం, పదేళ్లకుపైగా నిరీక్షణం వంటి కారణాల నేపథ్యంలో జనసేన నాయకులు, కార్యకర్తల్లో కొత్త జోష్ …
Read More »సిస్టమాటిక్ గ్యాప్‌లో చంద్రబాబు!
సీఎం చంద్రబాబు.. ఒక వ్యవస్థీ కృత గ్యాప్‌లో పడిపోయినట్టు తెలుస్తోంది. చీమ చిటుక్కుమన్నా తెలిసే సాంకేతికత ఆయన సొంతం. అయితే.. ఇది నిన్నమాట. ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన ఓ వ్యవహారం.. ఆయనకు.. ప్రజలకే కాదు.. ప్రముఖలకు మధ్య గ్యాప్ పెంచేస్తున్నవారు ఉన్నట్టుగా అర్థమవుతోంది. ప్రముఖ ఉద్యమ కారిణి, ప్రజ్వల సంస్థ నిర్వాహకురాలు సునీతా కృష్ణణ్ చేసిన ట్వీట్ చూస్తే.. చంద్రబాబు వరకు కొన్ని విషయాలు చేరడం లేదన్న అనుమానాలు …
Read More »హామీలేమయ్యాయి? :బాబుకు జగన్ ప్రశ్న.. టీడీపీ కౌంటర్ ఇదే!
ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా మాజీ సీఎం జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇప్పుడు అమలు చేయడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 14 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని చెబుతున్నారని.. ఇప్పుడు రాష్ట్రం బాధ్యతను ప్రజలకే వదిలేస్తున్నానని చెప్పడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తల్లికి వందనం, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్‌మెంటు నిధుల ఊసే లేకుండా పోయిందని …
Read More »జగన్‌కు రాజకీయాల్లో ఓనమాలు తెలియవు: గోనె
వైసీపీ అధినేత, ఏపీ విపక్ష నాయకుడు జగన్‌ను కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు తగులుకున్నారు. ఎన్నికల సమయంలోనూ జగన్‌పై విరుచుకుపడ్డ ఆయన ఇప్పుడు మరోసారి మాటల తూటాలు పేల్చారు. జగన్‌కు రాజకీయాల్లో ఓనమాలు తెలియవని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ కోరడమేంటని.. దీనిని బట్టే ఆయన రాజకీయ పరిపక్వతను అర్ధం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఈ మాటలు విని జనం …
Read More »టీడీపీ దూకుడును అందుకునేలా బీజేపీ వ్యూహం!
టీడీపీ బాటలోనే బీజేపీనే నడుస్తోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజా ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కూటమి పార్టీలు.. సర్కారు ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ దూకుడుగా ఉంది. ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువైంది. వారంలో ఐదు రోజుల పాటు పార్టీకార్యాలయాల్లో ప్రజాదర్బార్ నిర్వహించడం ద్వారా సామాన్యులకు పార్టీ, ప్రభుత్వం రెండూ కూడా చేరువయ్యాయి. దీనివల్ల ఇటు పార్టీకి, అటు ప్రభుత్వంలో టీడీపీకి కూడా …
Read More »మోడీ – వయనాడ్ – పాలిటిక్స్!
“దేనినైనా రాజకీయంగా ఆలోచించే ముందు అది ప్రజాహితమా? నాయకుల అభిమతమా? అన్నది ఉన్నత స్థానాల్లో ఉన్న వారు ఆలోచించుకోవాలి!” – దాదాపు రెండు దశాబ్దాల కిందట ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి పార్లమెంటు వేదికగా చెప్పిన మాట. ఫొక్రాన్ అణు పరీక్షలు చేసిన సమయంలో ప్రతిపక్షాల నుంచి ఎలుగెత్తిన విమర్శలకు చెక్ పెట్టేందుకు ఆయన చెప్పిన మాట.. నేటికీ సజీవం. ప్రతి విషయాన్నీ పొలిటికల్ అద్దంలో చూస్తున్న పరిస్థితి రాష్ట్రాల నుంచి …
Read More »చంద్రబాబు పంటికింద ‘రాళ్లు!’
రాష్ట్రంలో ‘రాళ్ల’ సమస్య వచ్చింది. అవికూడా.. అత్యంత ఖరీదైన గ్రానైట్ రాళ్లు. ధనవంతుల ఇళ్లలో వేసుకునే రాళ్లు. ఇప్పుడు ఆ రాళ్లను ఏం చేయాలో తెలియక చంద్రబాబు సర్కారు తలపట్టుకుంది. పోనీ.. వదిలేద్దామంటే రూ.350 కోట్లు పెట్టి జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అలాగని వాడదామంటే.. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశారు. దీంతో ఆ రాళ్ల వ్యవహారం.. ఇప్పుడు సర్కారుకు చిక్కుముడిగా మారింది. ఇంతకీ.. ఆ రాళ్ల …
Read More »సుజనా దూకుడు.. మామూలుగా లేదుగా..!
తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి దూకుడు మామూలుగా లేదని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఆయన టికెట్ దక్కించుకుని పోటీకి రెడీ అయినప్పుడు.. అనేక విమర్శలు వచ్చాయి. ఆయన ఇక్కడ ఉండరని.. ఢిల్లీలోనో.. బెంగళూరులోనో.. హైదరాబాద్‌లోనో మకాం వేస్తారని.. నియోజకవర్గం ప్రజలు తమ కష్టాలు చెప్పుకొనేందుకు ఫ్లైట్లు బుక్ చేసుకోవాలని వైసీపీ నుంచి విమర్శలు …
Read More »బాబుపై ఒత్తిడి.. ఔననలేరు.. కాదనలేరు..!
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుపై ఒత్తిడి పడుతోందా? ఎన్నికలకు ముందు పార్టీకి సహకరించిన విభిన్న వర్గాల నుంచి ఆయన ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? అంటే ఔననే అంటున్నారు పార్టీ సీనియర్ నాయకులు. ఎన్నికల సమయంలో పారిశ్రామిక వర్గాల నుంచి సామాజిక సమీకరణల వరకు అన్ని వైపులా మద్దతు లభించింది. వీరిలో వైసీపీని సమర్థించిన రెడ్డి సామాజిక వర్గం కూడా ఉంది.ఇదే సమయంలో కమ్మ సామాజిక వర్గం నుంచి భారీ ఎత్తున మద్దతు …
Read More »‘దువ్వాడ’ సీన్లో బిగ్ ట్విస్ట్.. ఏం జరిగిందంటే!
వైసీపీ ఎమ్మెల్సీ, ఫైర్ బ్రాండ్ నాయకుడు, ప్రస్తుతం కుటుంబ వివాదాలతో తెరమీదికి వచ్చి.. నెటిజన్లతో ముద్దుల మొగుడుగా ట్రోల్ అవుతున్న దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం బిగ్ ట్విస్ట్ తెరమీదికి వచ్చింది. వివాదానికి కేంద్ర బిందువుగా దువ్వాడ సతీమణి వాణి, ఆయన కుమార్తెలు చెబుతున్న మరో మహిళ, దువ్వాడతో సహజీవనం చేస్తున్న దివ్వెల మాధురి తాజాగా మీడియా ముందుకు వచ్చారు. సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ‘దువ్వాడే నా సర్వస్వం’ అని …
Read More »చంద్రబాబు, లోకేష్‌ల పై కేసులు పెట్టాలి: జగన్
రాష్ట్రంలో రెండు నెలలుగా మారణహోమం సాగుతోందని.. అరాచక పాలనలో రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతూనే ఉందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస హత్య లకు బాధ్యులైన వారిపై నమోదు చేస్తున్న కేసులకు తోడు వారిని ప్రోత్సహిస్తున్న వారిపైనా కేసులు పెట్టా లన్నారు. అదేవిధంగా వీరికి మద్దతుగా నిలుస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లను కూడా వదిలి పెట్టుకుండా కేసులు పెట్టాలని వ్యాఖ్యానించారు. …
Read More »