Political News

షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని మ‌రీ చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు రంగంలోకి దిగారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డెక్క‌డ నుంచి ఎవ‌రెవ‌రు పోటీ చేయాల‌నే అంశంపై ఆయ‌న దృష్టిపెట్టారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన కీల‌క నేత‌ల‌తోనూ ఆయ‌న క‌ల‌పుకొని పోతున్నారు. తాజాగా మంగ‌ళ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు అంటే.. మూడు రోజుల పాటు చంద్ర‌బాబు ఈ విష‌యంపైనే ఉండ‌నున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో అభ్య‌ర్థుల ఎంపిక‌లు ఊపందుకున్నాయి. అధికార వైసీపీ ఇప్ప‌టికే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసే కార్య‌క్ర‌మాన్ని దూకుడుగా ముందుకు …

Read More »

కోదండ‌రాంకు షాక్‌.. హైకోర్టు నిర్ణ‌యంతో సంచ‌ల‌నం!

తెలంగాణ ఉద్య‌మ నాయ‌కుడు, ప్ర‌ముఖ విద్యావేత్త ప్రొఫెస‌ర్ కోదండ‌రాంకు భారీ షాక్ త‌గిలింది. ఈయ నతోపాటు.. మైనారిటీ నాయకుడు, అమీరుల్లాఖాన్‌కు కూడా తీవ్ర ఎదురు దెబ్బే త‌గిలింద‌ని అంటున్నా రు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించిన త‌ర్వాత‌.. ప‌దేళ్ల‌కు కోదండ‌రాంకు కీల‌క‌మైన స్థానం దక్కింద‌ని అంద‌రూ అనుకున్నారు. ఆయ‌న‌కు గ‌త ప్ర‌భుత్వం ఇవ్వ‌ని గౌర‌వం ప్ర‌స్తుత సీఎం, కాంగ్రెస్ ప్ర‌భుత్వ సార‌థి రేవంత్‌రెడ్డి ఇస్తున్నార‌ని భావించారు. అదే.. గ‌వ‌ర్న‌ర్ కోటాలో …

Read More »

ఎన్నారై య‌శ‌స్వికి ఊర‌ట‌.. అమెరికా వెళ్లేందుకు ఓకే!

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సోష‌ల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టార‌ని ఆరోపిస్తూ.. ఏపీ సీఐడీ పోలీసులు టీడీపీ ఎన్నారై(ప్ర‌వాసాంధ్ర‌) విభాగం కార్య‌క‌ర్త‌.. య‌శ‌స్వి బొద్దులూరి, ఉర‌ఫ్ య‌శ్‌పై కేసులు న‌మోదు చేయ‌డం తెలిసిందే. ఆయ‌న త‌న త‌ల్లిని ప‌రామ‌ర్శించేందుకు గ‌త నెల ప్రారంభంలో హైద‌రాబాద్‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో విమానాశ్ర‌యంలోనే అరెస్టు చేశారు. అయితే.. ఇది చ‌ట్ట విరుద్ధం కావ‌డంతో ఆయ‌న‌కు 41 ఏ కింద నోటీసులు జారీ …

Read More »

వైసీపీకి మ‌రో నేత గుడ్ బై.. త్వ‌ర‌లోనే టీడీపీలోకి

ఏపీ అధికార పార్టీ వైసీపీకి మ‌రో కీల‌క నేత గుడ్ బై చెప్ప‌నున్నారు. పైగా ఈయ‌న ఎస్సీ నాయ‌కుడు కావడం గ‌మ‌నార్హం. ఆయ‌నే ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే, ఎస్సీ నేత కోనేటి ఆదిమూలం. తాజాగా ఈయ‌న హైదరాబాద్‌లో టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. పార్టీలో చేరిక‌పై ఆయ‌న చ‌ర్చించారు. ఆదిమూలం వెంట ఆయ‌న కుమారుడు కూడా ఉన్నారు. టీడీపీలో చేరే …

Read More »

కార్యాల‌యాల్లో ఎమ్మెల్యే కొడుకు ఫొటో

వైసీపీ ఎమ్మెల్యే.. ఫైర్‌బ్రాండ్ నాయ‌కుడు చంద్ర‌గిరి శాస‌న స‌భ్యుడు చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డికి స్థానికుల నుంచి సెగ తగిలింది. నిజానికి ఆయ‌నంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద‌గా వ్య‌తిరేక‌త లేదు. అంద‌రిలోనూ క‌లివిడిగా ఉంటారు. ఆర్భాటాలు, అట్ట‌హాసాల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌కుండా క‌లిసిపోతారు. క‌ష్టాలు, సుఖాల్లో నేనున్నానంటూ.. ముందుకు వ‌స్తారు. దీంతో చెవిరెడ్డి సామాన్యుల్లో ఫాలోయింగ్ ఉంది. అయితే.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో కొన్ని కొన్ని ప‌నులు పెద్ద సెగ‌నే పెడుతున్నాయి. ప్ర‌స్తుతం చంద్ర‌గిరి …

Read More »

జగన్ ఫోకస్ చేస్తున్న సినీ తార‌లు ఎవరు?

వ‌చ్చే ఎన్నికల‌కు సంబంధించి సాధార‌ణ నాయ‌కులే టికెట్లు ద‌క్కించుకునేందుకు పోటీ ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఇటు వైసీపీ, అటు టీడీపీల్లోనూ సిట్టింగులు.. ఇత‌ర నేత‌లు పోటీలో ఉన్నారు. అయితే.. వీరితో మాత్ర‌మే ఎన్నిక‌ల‌కు వెళ్తే మ‌జా ఏముంటుంద‌ని అనుకుంటున్న వైసీపీ. సినీ తార‌ల వ్య‌వ‌హారాన్ని కూడా తెర‌మీదికి తెచ్చింది. సినీ రంగానికి చెందిన ఒక‌రిద్ద‌రు ప్ర‌ముఖుల‌కు ఈ ద‌ఫా టికెట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికి 60 అసెంబ్లీ స్థానాల‌కు, …

Read More »

ష‌ర్మిల పై వైసీపీ.. తగ్గేదేలే

ఏపీ అధికార పార్టీ వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న నుంచి బ‌య‌ట ప‌డింది. ఇప్ప‌టి వ‌రకు ప్ర‌తిప‌క్షాలుగా ఉన్న టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీల నుంచి ఈ పార్టీకి రాజ‌కీయ సెగ బాగానే త‌గిలింది. ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించడం నుంచి సీఎం జ‌గ‌న్ ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేయ‌డం వ‌ర‌కు ఆయా పార్టీలు తీవ్ర విమ‌ర్శ‌లే చేశాయి. ఇక‌, ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌పై కూడా.. తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించాయి. ముఖ్యంగా ఈ …

Read More »

మాస్ టాక్‌: ఈ సారి ఏపీ అసెంబ్లీలో వీరు ప‌క్కా..

సారి సంచ‌ల‌న మార్పులు చోటు చేసుకుంటాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కీల‌క‌మైన ఇద్ద‌రు నాయ‌కులు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని మాస్ టాక్‌. వీరు ఖ‌చ్చితంగా వ‌చ్చే అసెంబ్లీలో అడుగు పెడ‌తార‌ని అంటున్నారు. వారే.. జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌. “వారిద్ద‌రూ ఈ సారి ప‌క్కాగా స‌భ‌లో అడుగు పెడ‌తారు. వారిద్ద‌రు ఉంటే.. స‌భ ఎలా ఉంటుందో“ …

Read More »

జ‌గ‌న్ ఇది ఊహించ‌లేదా.. ఊహించే చేశారా..!

అధికార పార్టీ వైసీపీలో అస‌మ్మ‌తి గుబులు రేపుతోంది. క‌నీసంలో క‌నీసం 30 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపో తున్నార‌ని పార్టీ అధిష్టాన‌మే అంచ‌నా వేస్తోంది. వీరిలో ఇప్ప‌టికే కోనేటి ఆదిమూలం, వ‌ర‌ప్ర‌సాద్‌, గుమ్మ‌నూరు జ‌య‌రాం, కొలుసు పార్థ‌సార‌తి, జ్యోతుల చంటిబాబు.. ఇలా అనేక మంది ఉన్నారు. వీరంతా నేరుగానే పార్టీపై గుస్సా వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. దీనికి కార‌ణం.. ఏకంగా రెండు నెల‌ల ముందుగానే ఎన్నిక‌ల‌కు సంబంధించి సీఎం జ‌గ‌న్‌, పార్టీ …

Read More »

షర్మిల స్లోగన్ జనానికి ఎక్కేసిందా?

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ సోద‌రి, కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్న విష‌యం తెలిసిందే. వాస్త‌వ టార్గెట్ ఎలా ఉన్నా.. అనూహ్య మ‌లుపుతిరిగిన ఆమె ప్ర‌చారంలో ఇప్పుడు ఏకైక టార్గెట్ వైసీపీ. నిజానికి కాంగ్రెస్‌కు జ‌వ‌స త్వాలు ఇవ్వాల‌ని.. పుంజుకునేలా చేయాల‌న్న‌ది.. త‌న వ్యూహ‌మ‌ని పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన తొలిరోజు చెప్పారు. కానీ, ఇంత‌లోనే రెండో రోజు నుంచి ఆమె అన్న ప్ర‌భుత్వాన్ని టార్గెట్ …

Read More »

నితీష్ కుమార్ కు ఇవే చివరి ఎన్నికలు: పీకే

బీజేపీకి మద్దతు పలుకుతూ ఎన్డీఏ కూటమిలో బీహార్ సీఎం నితీష్ కుమార్ చేరడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై గతంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కలిసి పని చేసిన రాజకీయ వ్యూహకర్త, ఐ ప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ కు ఇవే చివరి ఎన్నికలని, ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో కనపడరని పీకే …

Read More »

నో డిస్ట్రబెన్స్ ప్లీజ్

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల వరకు తెలంగాణా పీసీసీని మార్చేది లేదని ఐఏసీసీ కీలక నేతలు స్పష్టం చేశారట. రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగాను, పీసీసీ అధ్యక్షుడిగా డబుల్ యాక్షన్ చేస్తున్న విషయం తెలిసిందే. మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే వెంటనే పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేసేస్తారు. అయితే తెలంగాణాలో మాత్రం రేవంత్ అలా చేయలేదు. …

Read More »