ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. జైలుకు వెళ్లి.. బెయిల్‌పై వచ్చిన నాయకులు అధికారంలోకి వస్తున్నారు. ఎంపీలుగా గెలుస్తున్నారు. తమ సత్తా కూడా చాటుతున్నారు. దీనిని ఊహించుకున్నారో.. లేక నిజంగానే అంచనా వేసుకున్నారో తెలియదు కానీ.. బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తన చెల్లి జైలుకు వెళ్లిందని.. త్వరలోనే బెయిల్‌పై వస్తుందని అన్నారు. అయితే..జైలుకు వెళ్లిన వారు బలమైన నాయకులుగా …
Read More »సిసోడియాకు బెయిల్.. ఇక, కవిత వంతేనా?
ఢిల్లీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణానికి సంబంధించి దాదాపు 17 మాసాలుగా జైల్లో ఉన్న ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఇదే కేసులో ఈ ఏడాది మార్చి నుంచి జైల్లో ఉన్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కవితకు కూడా ఊరట లభించనుందా? అనే చర్చ జరుగుతోంది. తాజా పరిణామాలను గమనిస్తే..సిసోడియా కేసును సాగదీయాలన్న …
Read More »వైసీపీకి హై ఓల్టేజ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా!
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కోలుకోలేని విధంగా దెబ్బ తగిలింది. కీలక నాయకుడు, కాపు సామాజిక వర్గంలో మంచి పేరున్న మాజీ మంత్రి ఆళ్ల నాని(ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్) వైసీపీకి తాజాగా రాజీనామా చేశారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు పేర్కొన్నారు. బలమైన సామాజిక వర్గంతోపాటు.. వినయశీలి, విధేయుడిగా కూడా నానీకి మంచి పేరుంది. 2019 ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న నాని.. తొలి రెండున్నరేళ్లపాటు …
Read More »ఆదివాసీ మహిళలతో చంద్రబాబు సంప్రదాయ నృత్యం
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో సింపుల్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. హుందాతనానికి పెట్టింది పేరుగా పెద్దమనిషి తరహాగా చంద్రబాబు ఎందరో ముఖ్యమంత్రులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ప్రొఫెషనల్ సీఎంగా కాస్త గంభీరంగా కనిపించే చంద్రబాబు సందర్భానుసారంగా ఆటవిడుపుగా వ్యవహరించిన దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అటువంటి అరుదైన దృశ్యం ఒకటి ఈరోజు ఆవిష్కృతమైంది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో …
Read More »కార్యకర్తలకు జై కొడుతున్న చంద్రన్న..!
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారు. గత ఐదేళ్లలో వైసీపీ దూకుడును, వైసీపీ నేతల వేధింపులను కూడా తట్టుకుని పార్టీ కోసం పనిచేసిన వారిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కీలక నాయకుల సంగతి ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో జెండాలు మోసిన వారు.. పోలీసు దెబ్బలు తిన్నవారు..చాలా మందే ఉన్నారు. ఒక్కొక్కరిపై 20-30 కేసులు నమోదైన వారు కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక …
Read More »జగ్గారెడ్డి ఎక్కడా తగ్గట్లేదుగా.. రీజనేంటి?
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎక్కడా తగ్గట్లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినా.. ఆయన ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓడినా పైచేయి నాదే అన్నట్టుగా ఆయన రాజకీ యాల్లో దూకుడుగా ఉంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ ఇదే కావడంతో ఆయన వైఖరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఓడిపోయి.. ఇంట్లో కూర్చోవడం కంటే.. బయటకు వచ్చి.. గెలిచిన నాయకుడి మాదిరిగా జగ్గారెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడ ఏసమస్య …
Read More »పవన్‌ను అన్ని మాటలన్నాడు.. తీరా చూస్తే
అధికారంలో ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతగా రెచ్చిపోయారో.. ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని ఎన్నెన్ని మాటలన్నారో.. వాళ్లను ఎంతగా వేదనకు గురి చేశారో తెలిసిందే. అహంకారంతో విర్రవీగిన వాళ్లందరూ ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. చరిత్రలో చూడని పరాభవం ఎదుర్కొని అవమాన భారంతో ఇంటికి పరిమితమయ్యారు. ఇప్పుడేమో కర్మ బూమరాంగ్ అన్నట్లుగా వారి కథ అడ్డం తిరుగుతోంది. అధికారంలో ఉండగా చేసిన పాపాలు చాలామందిని వెంటాడుతున్నాయి. దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. …
Read More »నారా లోకేష్‌లో ఎంత మార్పు.. ఇది కదా రాజకీయం అంటే!
రాజకీయాల్లో పరిణితి సాధించడం అంత ఈజీకాదు. ఎన్నో ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా.. ఎన్ని పదవులు అనుభవించినా.. రాజకీయంగా పరిణితి సాధించిన వారు కొందరే ఉన్నారు. అలాంటిది అతి తక్కువ సమయంలోనే రాజకీయంగా అనుభవం సాధించడంతోపాటు.. పరిణితి సాధించడం అంటే.. మాటలు కాదు. కానీ, నారా లోకేష్ దీనిని సాధించారు. ఎన్నికలకు ముందు వరకు వైసీపీ నాయకులతో విమర్శలు ఎదుర్కొన్న ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాజకీయంగా ఎంత ఎత్తుకు …
Read More »టీటీడీలో ఎన్నారైలకు చోటు… !
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నారైలకు చోటు దక్కనుందా? టీటీడీ బోర్డులో ఎన్నారైలను నియ మించేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ నాయకులు. ఎన్నికలకు ముందు ఎన్నారైలు తరలి వచ్చి పార్టీ కోసం, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కోసం బాగానే కష్టించారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. వీరు సాధారణ పదవులతో సంతృప్తి చెందే పరిస్థితి లేదు. నిజానికి చిన్న చిన్న పదువుల, …
Read More »పీ-4 మంత్రంతో ముందుకు.. బాబు వ్యూహం ఓకే.. !
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహం వేస్తే.. తిరుగుండదని అంటారు. గతంలో సెల్ ఫోన్లను తీసుకువచ్చినప్పుడు.. ఐటీని డెవలప్ చేసినప్పుడు.. కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. ఐటీని వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు తనపై యుద్ధమే చేశారని అనేక సందర్భాల్లో చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయినా.. ఆయన ముందుకు సాగారు. ఇక, సెల్ ఫోన్లు, కంప్యూటర్లను డెవలప్ చేసినప్పుడుకూడా ఆయనను వ్యతిరేకించారు.కానీ, ఇప్పుడు అవే హైదరాబాద్కు వెన్నుదన్నుగా మారాయి. అంటే.. …
Read More »జనం ఎఫెక్ట్: చంద్రబాబుకు – జగన్‌కు ఇదీ తేడా!
అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ప్రజల మధ్యకు వచ్చేందుకు ఉత్సాహం చూపించే నాయకుడు ఒకరు. అధికారం ఉన్నా.. లేకున్నా.. ప్రజల మధ్యకు వచ్చేందుకు జంకేవారు మరొకరు. మీన మేషాలు లెక్కించే వారు మరొకరు. వారే.. ఒకరు సీఎం చంద్రబాబు, మరొకరు మాజీ సీఎం జగన్. వీరిద్దరి మధ్య తేడా ఇదే. తనకు 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే దక్కారని ఆవేదన ఉన్నా.. చంద్రబాబు త్వరగా కోలుకుని.. వెంటనే ప్రజల మధ్యకు వచ్చారు. …
Read More »అవయవదానం చేసే వారికి… ఏపీ సర్కారు గౌరవ వీడ్కోలు!
సమాజంలో అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం తరఫున ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకువచ్చేందుకు నిర్ణయించింది. ఒకప్పుడు రక్తదానం ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించేవి. ఇప్పుడు కూడా రక్త దానం చేసే ఉద్యోగులకు ఒక పూట సెలవు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇలానే ఇప్పుడు అవయవ దానం చేసేవారికి ఏపీ ప్రభుత్వం సముచిత గౌరవం ఇవ్వాలని నిర్ణయించింది. అవయవాలు అవసరమైన వారు.. అవిలేక.. ప్రాణాలు …
Read More »