పంచాయ‌తీ పోరు: కాంగ్రెస్ వ్యూహం ఫ‌లిస్తుందా?

తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల స‌మ‌రానికి తెర‌లేచిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అధికార, ప్ర‌తిప‌క్షాలు ఎవ‌రి వ్యూహాల్లో వారు దూసుకుపోయే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ బ‌ల‌మైన వ్యూహంతోనే ముందుకు వ‌చ్చింది. పంచాయ‌తీ ఎన్నిక‌ల కోడ్‌కు కొన్ని గంట‌ల ముం దు జ‌రిగిన స‌మావేశంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోకి 27 మునిసిపాలిటీల‌ను క‌లుపుతూ నిర్ణ‌యం తీసు కుంది. అయితే.. ఇది ఇప్ప‌టికిప్పుడు జ‌ర‌గ‌క‌పోయినా.. భ‌విష్య‌త్తులోప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంది.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ అనుకూల ప‌వ‌నాలు వీస్తాయ‌న్న విశ్వాసం ఆ పార్టీ నేత‌ల్లో క‌నిపిస్తోంది. ఇక‌, రాజ‌కీయంగా ప్ర‌స్తుతం ఇస్తున్న ప‌థ‌కాల‌ను గ్రామీణ స్థాయికి విస్త‌రించారు. కోడ్‌కు ముందుగానే.. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు గ్రామీణ ప్రాంతాల్లో ఇందిర‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేశారు. రాత్రికి రాత్రి ఈ కార్య‌క్ర‌మాన్ని వ్యూహాత్మకంగా.. అమ‌లు చేయ‌డం ద్వారా.. మ‌హిళా ఓటు బ్యాంకును త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయ‌డం విశేషం. అంతేకాదు.. గ‌తంలో కేసీఆర్ ఇచ్చిన చీర‌ల‌కంటే కూడా నాణ్య‌మైన‌వి ఇచ్చామ‌ని ప్ర‌చారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఈ పంపిణీ త‌మ‌కు లాభిస్తుంద‌ని కాంగ్రెస్ నాయ‌కులు అంచ‌నా వేసుకుంటున్నారు. ఇక‌, పంచాయ‌తీ పోరులో కాంగ్రెస్ కు లాభిస్తున్న మ‌రో వ్య‌వ‌హారం.. సీఎం రేవంత్ ఇమేజ్‌.దీనినే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చ‌ర్చ‌కు పెడుతున్నారు. సీఎం రేవంత్ పెట్టుబ‌డుల‌కు పెద్ద‌పీట వేస్తున్నార‌ని.. హైద‌రాబాద్ను విస్త‌రిస్తున్నార‌ని.. త‌ద్వారా ప‌ట్ణణ ప్రాంతాల్లోనే కాకుండా.. న‌గ‌రాల్లోను, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉపాధి పెరుగుతోంద‌న్న‌ది నాయ‌కులు చేస్తున్న ప్ర‌చారం.

దీనికితోడు.. ఫ్యూచ‌ర్ సిటీ వ్య‌వ‌హారాన్ని కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్తున్నారు. ఇక‌, ఉచిత బ‌స్సు, ఇందిర‌మ్మ ఇళ్లు, రైతుల‌కు ఇస్తున్న రాయితీలు, సొమ్ములు.. ఇలా అనేక విష‌యాల‌ను కాంగ్రెస్ వ్యూహా త్మకంగా ప్ర‌చారం చేస్తోంది. అయితే.. వాస్త‌వానికి పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పార్టీల పేర్లు, జెండాలు లేక‌పోయి నా.. మ‌ద్ద‌తు దారుల ప్ర‌భావం ఉంటుంది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌కు క‌లిసి వ‌స‌త్ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే.. రిజ‌ర్వేష‌న్ వ్య‌వ‌హారం మాత్రం కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారుతుంద‌ని అంటున్నారు.