ఏపీ మాజీ సీఎం జగన్ పై నమోదైన అక్రమ ఆస్తుల వ్యవహారాలకు సంబంధించిన కేసులు ఇప్పట్లో తేలే లా కనిపించడం లేదు. తాజాగా సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సీబీఐ తరఫు న్యాయవాది దాఖలు చేసిన అఫిడవిట్లోను.. తర్వాత వినిపించిన వాదనల్లోనూ ఈ విషయం స్పష్టంగా అర్థమైంది. జగన్ కేసుల్లో నిందితులుగా ఉన్న చాలా మంది ఇప్పటికే డిశ్చార్జ్(తమకు, ఈ కేసులకు సంబంధం లేదని.. తమను ఈ కేసుల నుంచి తొలగించాలని …
Read More »ఏపీలో జన్మభూమి కమిటీ 2.0
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్నా పోటీ చేయవచ్చన్న కొత్త నిబంధనను తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఈ రోజు జరిగిన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశంలో ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక …
Read More »కర్ణాటకకు పవన్ కల్యాణ్.. రీజనేంటి?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా కర్ణాటకలో పర్యటిస్తున్నారు. విజయవాడ నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్లిన పవన్ అక్కడి సీఎం సిద్దరామయ్యతో భేటీ అయ్యారు. అయితే.. ఈ పర్యటనలో ప్రధానంగా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లా నుంచి ఎర్ర చందనం.. బెంగళూరు సహా.. మైసూరుకు తరలి వెళ్తోందని సమాచారం. దీనిపై కూపీలాగిన పవన్ కల్యాణ్.. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు వెళ్లారు. …
Read More »కమ్యూనిస్టు దిగ్గజం కన్నుమూత.. నేటి సీఎంలకు స్ఫూర్తి!
దిగ్గజ కమ్యూనిస్టు నాయకుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 80 సంవత్సరాలు. అందరూ విద్యార్థి దశ నుంచి రాజకీయాలు చేశామని చెబుతారు. కానీ, బుద్ధదేవ్ మాత్రం ఉపాధ్యాయుడిగా ఉంటూ రాజకీయ అరంగేట్రం చేశారు. అది కూడా.. కరడుగట్టిన కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చారు. వాస్తవానికి సంప్రదాయ బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన కమ్యూనిస్టుగా మారిన తర్వాత.. ఆ సంప్రదాయాలకు దూరమయ్యారు. అత్యంత …
Read More »ఆమంచి .. కరణం .. అవకాశం ఎవరికో ?!
ఏపీలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయంతో అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరాలన్న ఆశావాహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో చీరాల నియోజకవర్గం నుండి చేరాలన్న నాయకుల ప్రయత్నాలు అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయి. ఈ నాయకులలో ఎవరికి టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూడడం గమనార్హం. 2014 ఎన్నికల్లో చీరాల నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ ఆ తర్వాత …
Read More »టీటీడీ చైర్మన్.. హై డిమాండ్
కొన్నాళ్లుగా చర్చకు దారి తీసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి విషయంలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసు కున్నట్టు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బోర్డు మొత్తం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో నూతన బోర్డును ఎంపిక చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో సభ్యుల మాట ఎలా ఉన్నా.. చైర్మన్ పదవికి మాత్రం నలుగురు కీలక వ్యక్తులు పోటీలో నిలిచారు. వీరిలో సినీ రంగానికి …
Read More »మళ్లీ కేకే…. కేక!
తాజాగా రాజ్యసభ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 12 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిపికేషన్ ఇచ్చింది. దీనిలో తెలంగాణకు చెందిన కే. కేశవరావు(కేకే) కూడా ఉన్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకులు కూడా ఉన్నారు. కేకే మినహా మిగిలిన 11 మంది కూడా.. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకు …
Read More »షర్మిల ఎందుకు ఒంటరయ్యారు? ఏం జరుగుతోంది?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఒంటరి అవుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. నిజానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక బలమైన నాయకులతో కూడిన పార్టీగా ఇప్పటికీ గుర్తింపు ఉంది. ఏపీలో చాలామంది సీనియర్ నాయకులు ఇప్పటికి పార్టీకి అండగానే ఉన్నారు. వీరిలో పల్లంరాజు, రఘువీరారెడ్డి, శైలజనాథ్ అదే విధంగా కేంద్ర మంత్రులుగా పని చేసిన వారు కూడా ఇప్పుడు ఈ కోవలోనే ఉన్నారు. అయితే వీరందరినీ కలుపుకొని …
Read More »సతీమణికి చీరలు కొన్న చంద్రబాబు.. కాస్ట్ ఎంతంటే!
సీఎం చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరి చీరలు కొనుగోలు చేశారు. అయితే.. ఇది కూడా వార్తేనా? అంటారా? ఔను వార్తే. ఎందుకంటే.. గతంలో భువనేశ్వరి ఓ సందర్భంలో ..చంద్రబాబు ఎప్పుడూ ప్రజలు, ప్రజలు అంటారే తప్ప.. ఇంట్లో వాళ్లను పట్టించుకోరని.. ఎప్పుడో పెళ్లయిన కొత్తలో ఒక్క చీర కొన్నారని, దానిని తాను భద్రంగా దాచుకున్నానని ఆమె చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు చీరలు కొనడం …
Read More »అదేంటో అధికారం పోయాకే.. ఇవన్నీ గుర్తొస్తున్నాయి!
కొన్ని రాజకీయ పార్టీలను, కొంతమంది నాయకులను గమనిస్తే అధికారం పోయిన తర్వాత అనేక విషయాలు గుర్తుకొస్తున్న విషయం ఆసక్తిగా మారింది. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తి వంటి విషయాలను పదేపదే మాట్లాడుతున్నారు. అటు ఏపీ, ఇటు తెలంగాణ ఏది తీసుకున్నా ప్రతిపక్షంలో ఉన్న మాజీ అధికార పక్షాలు ఇలా మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగాను వింతగా కూడా కనిపిస్తోంది. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్న జగన్ మోహన్ …
Read More »కార్యకర్తల మీద జగన్ ఫీలింగ్ ఇదా?
గత పర్యాయం ఏకంగా 151 సీట్లతో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అందుకు ప్రధాన కారణాల్లో కార్యకర్తల కృషి ఒకటి. అదే పార్టీ ఇప్పుడు 11 సీట్లకు పరిమితం అయిందన్నా దాని వెనుక కార్యకర్తలు ఉన్నారని చెప్పుకోవాలి. అంటే వాళ్లు పనిగట్టుకుని ఓడించారు అని కాదు. కార్యకర్తలను వైసీపీ సరిగా పట్టించుకోవడంతో గత ఎన్నికలకు ముందులా వాళ్లు కసిగా పని చేయలేదని.. ఈ పార్టీతో ఒరిగేది ఏముంది …
Read More »ఏపీలో కొత్త లిక్కర్ పాలసీకి ఓకే.. అసలేంటిది?
ఏపీలో కొత్త లిక్కర్ పాలసీకి చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిని అక్టోబరు 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యా ప్తంగా అమలు చేయనున్నారు. నూతన మద్యం విధానం మేరకు ప్రస్తుతం ఉన్న అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తేయ నున్నారు. ఇదేసమయంలో ప్రైవేటుకు అప్పగిస్తారు. వాస్తవానికి ప్రస్తుతం బార్లు మాత్రమే ప్రైవేటు ఆధ్వర్యంలో ఉన్నాయి. వీటికి సంబంధించిన లైసెన్సులు ఈ ఏడాది నవంబంరు-డిసెంబరు వరకు కొనసాగనున్నాయి. వీటిని …
Read More »