ఆంధ్రావని అప్పులపై మళ్లీ కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పబ్లిక్ కోసం చేసిన అప్పును పబ్లిక్ గానే తెలియజేయాలని, దాచేందుకు వీల్లేదని చెబుతూ, బడ్జెట్ లో లెక్క చూపని అప్పుల లెక్క తేల్చాలని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఏపీజీ) ఓ లేఖ రాసింది. దీంతో ఇప్పుడు జగన్ సర్కారు మరోసారి డైలామాలో పడిపోయింది. ఇప్పటికే ఏపీ చేసిన లేదా చేస్తున్న అప్పులపై తామేమీ షూరిటీ ఉండమని, ఆ …
Read More »ఆ ధైర్యానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు
రాజకీయాల్లో ఆయన స్టైలే వేరు. ఆయనే రఘు రామ కృష్ణం రాజు. నరసాపురం ఎంపీ. ఆయన బర్త్ డే ఇవాళ. శుభాకాంక్షలు చెబుతూ రాస్తోన్న ప్రత్యేక కథనం ఇది. మొదట్నుంచి ఆయన శైలి వేరు. గెలిచాక కూడా అలానే ఉన్నారాయన. ఢిల్లీ కేంద్రంగా ఆంధ్రా ప్రభుత్వంపై అదే పనిగా విమర్శలుచేసినా ఆయనకే చెల్లు. అదేవిధంగా కొన్ని సార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేసిన దాఖలాలూ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన వ్యవహార శైలి …
Read More »ఏపీలో ఆ స్కీం బడ్జెట్ 25 కోట్లు, పబ్లిసిటీకి 60 కోట్లట
తన పథకాల గురించి జగన్ సర్కారు పబ్లిసిటీ ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఏపీలో ఉంటే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ న్యూస్ పేపర్లు ఫాలో అయ్యే వారికి ప్రతి నెలా ఏదో ఒక పథకం ప్రారంభిస్తున్నట్లు.. భారీగా నిధుల్ని కేటాయించినట్లు.. దానికి సంబంధించిన ఒక ప్రోగ్రాం గురించి మొదటి పేజీ మొత్తాన్ని కవర్ చేస్తూ యాడ్ ఇవ్వటం కనిపిస్తుంది. అన్ని పత్రికల్లో మొదటి పేజీలో ఈ …
Read More »కాంగ్రెస్‌లో మళ్లీ పీవీ జపం.. తెలంగాణ కోసమేనా?
రాజస్థాన్లోని ఉదయ్పుర్లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ ‘చింతన్ శిబిర్`లో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పట్టించుకోని పాత నాయకులను ఇప్పుడు స్మరిస్తున్నారు. అదేసమయంలో మైనార్టీ వర్గాలపై అమిత ప్రేమను ఒలకబోస్తున్నారు. ఈ రెండు పరిణామాలు కూడా కాంగ్రెస్ వ్యవహారంపై చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అవసాన దశలో ఉన్నదనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఘోరంగా …
Read More »దేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తారు: సోనియా
రాజస్థాన్లోని ఉదయ్పుర్లో కాంగ్రెస్ ‘చింతన్ శిబిర్’ ప్రారంభమైంది. 430 మంది కాంగ్రెస్ నేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు. దేశంలోని రాజకీయ, ఆర్థిక, సామాజిక, రైతాంగ, ఉపాధి, పార్టీ సంస్థాగత ప్రక్షాళన అంశాలపై వీరంతా చర్చించి తీర్మానాలు చేయనున్నారు. చింతన్ శిబిర్లో రూపొందించిన తీర్మానాలకు సీడబ్ల్యుసీ ఆమోదం లభించిన తరువాత సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్లనుంది కాంగ్రెస్ పార్టీ. అయితే.. ఈ చింతన్ శిబిర్‌కు నాయకులు ఎంతటి వాళ్లయినా.. సెల్ ఫోన్లు తీసుకురావద్దని …
Read More »48 గంటల్లో క్షమాపణ చెప్పు.. లేదా జైలు తప్పదు: కేటీఆర్ వార్నింగ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి ఆ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఈనెల 11న చేసిన ట్విట్టర్ లో ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. నిరాధర ఆరోపణలు చేసినందుకు 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదా పరువునష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. ఈమేరకు తన న్యాయవాది చేత బండి సంజయ్కి కేటీఆర్ నోటీసులు …
Read More »‘ఒకే కుటుంబం- ఒకే టికెట్’
చింతన్ శిబిర్‌లో ఇప్పుడు గాంధీల కుటుంబానికే పెద్ద చింత ఎదురయింది. దేశవ్యాప్తంగా కుటుంబ పాలనకు చెక్ పెట్టాలని భావిస్తున్న పార్టీ కుటుంబంలో ఒకరికే టికెట్ అని ప్రకటించింది. అయితే.. ఈ సమస్య.. తొలిగా.. సోనియా కుటుంబానికే పెద్ద చిక్కు తీసుకువచ్చింది. ఈ కుటుంబంలో ఇప్పటి వరకు ఇద్దరు సోనియా, రాహుల్ పోటీ చేస్తుండగా.. వచ్చే ఎన్నికల్లో కుమార్తె, అల్లుడు.. ప్రియాంక, రాబర్ట్ వాద్రాలు కూడా రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో …
Read More »జంపింగులకే.. జగన్ వీరతాళ్లు.. వైసీపీలో మంటలు
వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లే నలుగురి జాబితా రెడీ అయిందా? ఇప్పటికే అభ్యర్థులను పార్టీ అధినేత, సీఎం జగన్ ఖరారు చేశారా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ సీనియర్లు. ఏపీ నుంచి రాజ్యసభకు తాజాగా నాలుగు సీట్లు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఈ సభ్యులను ఖరారు చేసే పనిని పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఏపీ నుంచి సుజనా చౌదరి, విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేశ్, సీఎం రమేష్ సీట్లు ఖాళీ అవుతున్నాయి. …
Read More »ఆ ధైర్యం చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి కూడా లేదు!.. జగన్
ఏపీ సీఎం.. జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. “టీడీపీ ప్రభుత్వ హయాంలో మంచి చేశామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. చంద్రబాబు ఇంత మంచి పని చేశాడని చెప్పే ధైర్యం దత్తపుత్రుడికి లేదు. దత్తపుత్రుడితో పాటు ఎల్లోమీడియాకు కూడా ధైర్యం లేదు” అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలను తాము అమలు చేశామని జగన్ చెప్పారు. …
Read More »కుప్పంలో ఓటమికి తమ్ముళ్ళదే తప్పు
కుప్పం నియోజకవర్గంలోని నేతలు సక్రమంగా పని చేసుంటే మొన్నటి స్ధానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అంత చిత్తుగా ఓడిపోయేవారమా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మూడు రోజుల నియోజకవర్గం పర్యటనలో గుడెపల్లె మండలంలో చంద్రబాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అంత ఘోరంగా ఓడిపోవటానికి తమ్ముళ్ళదే తప్పని తేల్చారు. కొందరు నేతలు నాయకులుగా కాకుండా వినాయకులుగా మారిపోవటమే ఘోర ఓటమికి ప్రధాన కారణంగా చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో …
Read More »బహిష్కరణ వేటు పడకుండా వ్యూహం
తనపై పడుతుందని అనుకుంటున్న బహిష్కరణ వేటు నుంచి తప్పించుకునేందుకు వైఎస్ కొండారెడ్డి రివర్స్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పులివెందులలోని చక్రాయపల్లె మండలానికి కొండారెడ్డి వైసీపీ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి స్వయంగా కజిన్ బ్రదర్ అయిన కారణంగా ఈయనకు బాగా ప్రాధాన్యత వచ్చేసింది. సీఎంతో ఉన్న బంధుత్వాన్ని, ముఖ్యమంత్రి కుటుంబంతో ఉన్న సన్నిహితాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని …
Read More »వైసీపీ నేతల్లో పెరిగిపోతున్న టెన్షన్
ఒక్కసారిగా అధికార పార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడమే. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్ధానాలకు ఎన్నిక జరగబోతున్నట్లు కమీషన్ తాజా నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. జూన్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. ఇందులో ఏపీలో 4, తెలంగాణాలో రెండు స్ధానాలున్నాయి. ఏపీలో ఖాళీ అవబోయే నాలుగు స్ధానాల్లో ఒకదానిని …
Read More »