తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభ మైన పోలింగ్ ఫలితాల్లో.. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా వెనుకంజ లేకుండా ముందుకు సాగుతుండడం గమనార్హం. కీలకమైన కొడంగల్, నల్లగొండ, సాగర్, ములుగు, పాలేరు, ఖమ్మం, కామారెడ్డి(రేవంత్‌రెండో నియోజకవర్గం)లో పార్టీ ముందుకు పోతోంది. ఎక్కడా ఎలాంటి తేడా లేకుండా.. కాంగ్రెస్ పుంజుకోవడం గమనార్హం.
అసలు గెలుపు గుర్రం ఎక్కుతామా? అని డౌటున్న నియోజకవర్గాల్లో కూడా.. కాంగ్రెస్ పుంజుకోవడం గమ నార్హం. ఉదయం 8 గంటల తర్వాత.. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు రావడం ప్రారంభించాయి. ఈ ఫలితాల్లో నే కాంగ్రెస్ దూకుడు ప్రదర్శించింది. దాదాపు రెండు గంటల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. అయితే.. ఇదేసమయంలో బీజేపీకి చెందిన ఈటల రాజేందర్ వంటి హేమా హేమీలు వెనుకబడ్డారు.
అయితే.. కాంగ్రెస్ మాత్రం ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూనే వెళ్లింది. కీలకమైన మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దూకుడు గతానికి భిన్నంగా ఉంది. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు ప్రతి రౌండ్‌లోనూ పుంజుకున్నారు. ఇక, పాలేరుతో తీవ్ర పోటీ ఉంటుందని అనుకున్నా.. ఇక్కడ కాంగ్రెస్ ఏకపక్ష విజయంగా దూకుడు ప్రదర్శించింది. మాజీ ఎంపీ పొంగులేటి బ్యాలట్ ఓట్ల నుంచి ఈవీఎం వరకు మెజారిటీలోనే కొనసాగుతున్నారు.
పినపాకలో 3000 పైచిలుకు ఓట్ల మెజారిటీ, వేముల వాడలో తొలి రౌండ్‌లోనే 1000 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్‌కు దక్కడం విశేషం. ఇక్కడ అసుల గెలిస్తే.. చాలనే విధంగా పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే. ఇక, వరంగల్‌లో ప్రత్యేకంగా.. 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ దూసుకుపోతుండగా.. గత ఎన్నికల్లో సత్తా చాటిన కేసీఆర్.. కేవలం 4 నియోజకవర్గాల్లోనే ఆపశోపాలు పడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates