రైతుబంధు పై రేవంత్ కీలక నిర్ణయం ?

రైతుబంధు పథకం అమలుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పథకం అమలుకు అప్పర్ లిమిట్ సీలింగ్ విధించాలని అనుకుంటున్నదట. రైతుబంధు పథకం అమలుపై సమీక్షించిన తర్వాతనే రైతుభరోసా నిధులు విడుదల చేయాలని అనుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. 2018లో కేసీయార్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతుబంధు పథకంలో చాలా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. పథకంలో అనర్హులకు కూడా చాలా లబ్ది జరిగిందని వచ్చిన ఆరోపణలను కేసీయార్ ప్రభుత్వం పట్టించుకోలేదు.

అలాంటి ఆరోపణలను, ఇతరత్రా పీడ్ బ్యాక్ ను రేవంత్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అందుకనే సమీక్షల మీద సమీక్షలు చేస్తోంది. నిజానికి రైతుబంధు పథకంలో అర్హులతో పాటు అనర్హులకు కూడా లబ్దికలుగుతోందన్నది వాస్తవం. పైగా కౌలు రైతులు, బక్క రైతులను కేసీయార్ ప్రభుత్వం అసలు పట్టించుకోనేలేదు. కౌలు రైతులను అప్పటి ప్రభుత్వం అసలు రైతులగానే గుర్తించలేదు. విచిత్రం ఏమిటంటే రైతుబంధు పథకంలో పెద్ద పెద్ద భూస్వాములు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఉన్నతాదికారులు, బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు కూడా లబ్దిపొందారు.

ఊర్లలో తమ భూములను కౌలుకు ఇచ్చేసి హైదరాబాద్ లో స్ధిరపడిన వారికి కూడా రైతుబంధు పథకంలో బాగా లబ్దిజరిగింది. అలాంటి వ్యవహారాలకు ఫులిస్టాప్ పెట్టి నిజమైన అర్హులు ఎవరు ? అనర్హులు ఎవరు అన్న విషయాలను సమగ్రంగా తేల్చాలని రేవంత్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇందుకోసం గ్రామసభలు కూడా నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. గ్రామసభల్లోనే అర్హులెవరు, అనర్హులెవరు అన్న విషయాలు చాలావరకు తేలిపోతుంది.

పనిలోపనిగా రైతుల నుండి కూడా అభిప్రాయాలు తీసుకుని గ్రామసభల్లో సదరు రైతుల భూముల విస్తీర్ణం, ఎంతకాలంగా సాగుచేస్తున్నారు ? భూ యజమానులు ఎవరు అన్న విషయాలను ఫైనల్ చేయాలని డిసైడ్ అయ్యింది. దీంతో పథకంలో లబ్దిపొందుతున్న అనర్హులు ఎవరనే విషయం చాలావరకు తేలిపోతుంది. కేసీయార్ ప్రభుత్వం ఇలాంటి అధ్యయనం ఏమీ చేయకుండానే పథకాన్ని అమలు చేసేసింది. సో రేవంత్ ప్రభుత్వం చేయబోతున్న మార్పుల కారణంగా నిజమైన అర్హులెవరో తేలిన తర్వాతే రైతుభరోసా నిధులను విడుదల చేయాలని డిసైడ్ అయ్యింది.